IPL 2022: నిప్పులు చెరిగిన రబాడా, గుజరాత్‌ టైటాన్స్‌కు పంజాబ్‌ కింగ్స్‌ షాక్, గత మ్యాచ్‌లో ఎదురైన పరాజయానికి బదులు తీర్చుకున్న పంజాబ్, 8 వికెట్ల తేడాతో ఘన విజయం

శిఖర్‌ ధవన్‌ (53 బంతుల్లో 8 ఫోర్లు, సిక్స్‌తో 62 నాటౌట్‌) అర్ధశతకంతో పాటు రబాడ (4/33) నిప్పులు చెరగడంతో.. ఐపీఎల్‌లో మంగళవారం జరిగిన మ్యాచ్‌లో పంజాబ్‌ 8 వికెట్లతో టైటాన్స్‌ను (Gujarat Titans) ఓడించింది.

Sai Sudharsan (left) and Kagiso Rabada celebrates a wicket (Photo credit: Twitter)

ఐదు వరుస విజయాలతో టాప్‌ గేర్‌లో దూసుకెళ్తున్న గుజరాత్‌ టైటాన్స్‌కు పంజాబ్‌ కింగ్స్‌ (Punjab Kings Thrash Gujarat Titans) షాకిచ్చింది. శిఖర్‌ ధవన్‌ (53 బంతుల్లో 8 ఫోర్లు, సిక్స్‌తో 62 నాటౌట్‌) అర్ధశతకంతో పాటు రబాడ (4/33) నిప్పులు చెరగడంతో.. ఐపీఎల్‌లో మంగళవారం జరిగిన మ్యాచ్‌లో పంజాబ్‌ 8 వికెట్లతో టైటాన్స్‌ను (Gujarat Titans) ఓడించింది. గత మ్యాచ్‌లో ఎదురైన పరాజయానికి బదులు తీర్చుకుంది. దీంతో పది మ్యాచ్‌ల్లో ఐదు విజయాలు, ఐదు ఓటములతో 10 పాయింట్లు ఖాతాలో వేసుకుని పంజాబ్ ఐదో స్థానానికి చేరుకోగా, గుజరాత్‌ టైటాన్స్‌ వరుస విజయాలకు బ్రేక్‌ పడింది.

తొలుత రబాడ(4/33) విజృంభణతో టైటాన్స్‌ నిర్ణీత 20 ఓవర్లలో 143/8 స్కోరుకు పరిమితమైంది. యువ బ్యాటర్‌ సాయి సుదర్శన్‌(50 బంతుల్లో 65 నాటౌట్‌, 5ఫోర్లు, సిక్స్‌) అర్ధసెంచరీతో ఆకట్టుకోగా, మిగతా వాళ్లు ఘోరంగా విఫలమయ్యారు. గిల్‌(9), కెప్టెన్‌ హార్దిక్‌ పాండ్యా(1), మిల్లర్‌ (11), తెవాటియా (11), రషీద్‌ఖాన్‌(0) బ్యాట్లు ఝులిపించలేకపోయారు. అర్ష్‌దీప్‌సింగ్‌, రిషి ధవన్‌, లివింగ్‌స్టోన్‌ ఒక్కో వికెట్‌ తీశారు. ఆ తర్వాత లక్ష్యఛేదనకు దిగిన పంజాబ్‌ (Punjab Kings) మరో నాలుగు ఓవర్లు మిగిలుండగానే 16 ఓవర్లలో 145/2 స్కోరు చేసింది.

రింకూ సింగ్ మెరుపులు, నాలుగో విజయం నమోదు చేసుకున్న కోల్‌కతా నైట్‌ రైడర్స్‌, 7 వికెట్ల తేడాతో రాజస్థాన్‌ రాయల్స్‌పై విజయం

ఓపెనర్‌ ధవన్‌ (53 బంతుల్లో 62 నాటౌట్‌, 8 ఫోర్లు, సిక్స్‌), రాజపక్స(28 బంతుల్లో 40, 5 ఫోర్లు, సిక్స్‌), లివింగ్‌స్టోన్‌ (10 బంతుల్లో 30 నాటౌట్‌, 2 ఫోర్లు, 3 సిక్స్‌లు) చెలరేగారు. షమీ (1/43), ఫెర్గుసన్‌(1/29) ఒక్కో వికెట్‌ తీశారు. రబాడకు ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ దక్కింది. బుధవారం పుణె వేదికగా బెంగళూరు, చెన్నై జట్ల మధ్య మ్యాచ్‌ జరగుతుంది.

స్కోరుబోర్డు

గుజరాత్‌ టైటాన్స్‌: వృద్ధిమాన్‌ సాహా (సి) మయాంక్‌ అగర్వాల్‌ (బి) రబాడ 21, శుబ్‌మన్‌ గిల్‌ (రనౌట్‌/ధవన్‌) 9, సాయి సుదర్శన్‌ (నాటౌట్‌) 65, హార్దిక్‌ పాండ్యా (సి) జితేశ్‌ (బి) రిషి ధవన్‌ 1, డేవిడ్‌ మిల్లర్‌ (సి) రబాడ (బి) లివింగ్‌స్టోన్‌ 11, రాహుల్‌ తెవాటియా (సి) సందీప్‌ శర్మ (బి) రబాడ 11, రషీద్‌ ఖాన్‌ (సి) జితేశ్‌ (బి) రబాడ 0, ప్రదీప్‌ సంగ్వాన్‌ (బి) అర్ష్‌దీప్‌ 2, ఫెర్గూసన్‌ (సి) లివింగ్‌స్టోన్‌ (బి) రబాడ 5, జోసెఫ్‌ (నాటౌట్‌) 4, ఎక్స్‌ట్రాలు: 15, మొత్తం 20 ఓవర్లలో 143/8;

వికెట్లపతనం: 1/17, 2/34, 3/44, 4/67, 5/112, 6/112, 7/122, 8/129;

బౌలింగ్‌: సందీప్‌ శర్మ 4-0-17-0, రబాడ 4-0-33-4, అర్ష్‌దీప్‌ 4-0-36-1, రిషి ధవన్‌ 4-0-26-1, లివింగ్‌ స్టోన్‌ 2.3-0-15-1, రాహుల్‌ చాహర్‌ 1.3-0-11-0.

పంజాబ్‌ కింగ్స్‌: బెయిర్‌స్టో (సి) సంగ్వాన్‌ (బి) షమి 1, శిఖర్‌ ధవన్‌ (నాటౌట్‌) 62, రాజపక్స (ఎల్బీ) ఫెర్గూసన్‌ 40, లివింగ్‌స్టోన్‌ (నాటౌట్‌) 30, ఎక్స్‌ట్రాలు: 12, మొత్తం 16 ఓవర్లలో 145/2; వికెట్లపతనం: 1/10, 2/97; బౌలింగ్‌: షమి 4-0-43-1, ప్రదీప్‌ సంగ్వాన్‌ 2-0-23-0, అల్జరీ జోసెఫ్‌ 3-0-25-0, ఫెర్గూసన్‌ 3-0-29-1, రషీద్‌ ఖాన్‌ 4-0-21-0.



00" height="600" layout="responsive" type="mgid" data-publisher="bangla.latestly.com" data-widget="1705935" data-container="M428104ScriptRootC1705935" data-block-on-consent="_till_responded"> @endif