PBKS vs GT, IPL 2023: ఐపీఎల్‌లో మరో ఉత్కంఠ పోరు, పంజాబ్‌పై గుజరాత్‌ టైటాన్స్‌ ఘనవిజయం, చెలరేగిన ఓపెనర్ శుభ్‌మన్‌ గిల్

ఆఖ‌రి ఓవ‌రి వ‌ర‌కు ఫ‌లితం తేలని మ్యాచ్‌లో ఢిఫెండింగ్ చాంపియ‌న్ గుజ‌రాత్ టైట‌న్స్ విజేత‌గా నిలిచింది. భీక‌ర ఫామ్‌లో ఉన్న‌ ఓపెన‌ర్‌ శుభ్‌మ‌న్ గిల్(67) అర్ధ శ‌త‌కంతో క‌దం తొక్క‌డంతో పంజాబ్ కింగ్స్‌పై 6 వికెట్ల తేడాతో గెలుపొందింది. దాంతో మూడో విజ‌యం ఖాతాలో వేసుకుంది.

Gujarat Titans Win Against Punjab Kings (PIC @ IPL Twitter)

Mohali, April 13: ఐపీఎల్ 16వ (IPL- 16) సీజ‌న్‌లో మ‌రో ఉత్కంఠ పోరు. ఆఖ‌రి ఓవ‌రి వ‌ర‌కు ఫ‌లితం తేలని మ్యాచ్‌లో ఢిఫెండింగ్ చాంపియ‌న్ గుజ‌రాత్ టైట‌న్స్ (Gujarat Titans) విజేత‌గా నిలిచింది. భీక‌ర ఫామ్‌లో ఉన్న‌ ఓపెన‌ర్‌ శుభ్‌మ‌న్ గిల్(67) అర్ధ శ‌త‌కంతో క‌దం తొక్క‌డంతో పంజాబ్ కింగ్స్‌పై (Punjab Kings) 6 వికెట్ల తేడాతో గెలుపొందింది. దాంతో మూడో విజ‌యం ఖాతాలో వేసుకుంది. మొద‌ట పంజాబ్‌ను 153కే క‌ట్ట‌డి చేసిన గుజ‌రాత్.. ల‌క్ష్య ఛేద‌న‌ను పూర్తి చేసింది. డేవిడ్ మిల్ల‌ర్(17) మ‌రోసారి కీల‌క ఇన్నింగ్స్ ఆడాడు. దాంతో, సొంత గ్రౌండ్‌లో నెగ్గాల‌నుకున్న‌ పంజాబ్‌కు నిరాశే మిగిలింది. మొహాలీ వేదిక‌గా జ‌రిగిన మ్యాచ్‌లో గుజ‌రాత్ టైటాన్స్(Gujarat Titans) ఆరు వికెట్ల తేడాతో విజ‌యం సాధించింది. 154 ప‌రుగుల ల‌క్ష్యాన్ని 19.5 ఓవ‌ర్ల‌లో నాలుగు వికెట్లు కోల్పోయి ఛేదించింది.

ఓపెన‌ర్ శుభ్‌మ‌న్ గిల్ (67;49 బంతుల్లో 7 ఫోర్లు, 1 సిక్స్‌) అర్ధ‌శ‌త‌కంతో ఆక‌ట్టుకోగా, వృద్ధిమాన్ సాహా(30; 19 బంతుల్లో 5 ఫోర్లు) రాణించాడు. పంజాబ్ బౌల‌ర్ల‌లో అర్ష్‌దీప్ సింగ్‌, ర‌బాడా, హర్‌ప్రీత్ బ్రార్, సామ్ క‌ర్రాన్‌ త‌లా ఓ వికెట్ ప‌డ‌గొట్టారు. అంత‌క‌ముందు టాస్ ఓడి మొద‌ట బ్యాటింగ్ చేసిన పంజాబ్ కింగ్స్ నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 8 వికెట్ల న‌ష్టానికి 153 ప‌రుగులు చేసింది.

IPL 2023: ఒకే జట్టుకు 200 మ్యాచ్‌ల్లో నాయకత్వం వహించిన తొలి కెప్టెన్‌గా ధోనీ సరికొత్త రికార్డు, అత్యధిక ఐపీఎల్‌ మ్యాచ్‌లు ఆడిన క్రికెటర్ల జాబితాలో తొలి స్థానంలో మిస్టర్ కూల్ 

పంజాబ్ బ్యాట‌ర్ల‌లో మాథ్యూ షార్ట్ (36), జితేష్ శ‌ర్మ (25) ప‌ర్వాలేద‌నిపించ‌గా.. ఆఖ‌ర్లో షారుక్ ఖాన్ వేగంగా (9 బంతుల్లో 22 ప‌రుగులు) ఆడ‌డంతో పంజాబ్ 150 ప‌రుగుల మార్క్‌ను దాటింది. గుజ‌రాత్ బౌల్లర్ల‌లో మోహిత్ శ‌ర్మ రెండు వికెట్లు తీయ‌గా, రషీద్ ఖాన్, అల్జారీ జోసెఫ్, మహమ్మద్ షమీ, జాషువా లిటిల్ లు ఒక్కొ వికెట్ ప‌డ‌గొట్టారు. (PBKS vs GT)