Hardik Pandya: త్వరలోనే టీమిండియాకు కొత్త కెప్టెన్, హార్ధిక్ పాండ్యాకు పూర్తిస్థాయి కెప్టెన్‌గా బాధ్యతలు అప్పగించేందుకు రంగం సిద్ధం, న్యూజిలాండ్ టూర్‌ కోసం ప్రకటించే ఛాన్స్

ఇప్పటికే 5 టీ20 మ్యాచ్‌ల్లో మెన్‌ ఇన్‌ బ్లూకు కెప్టెన్‌గా వ్యవహరించిన పాండ్యా.. 4 సార్లు జట్టుకు విజయాన్ని అందించారు. ఈ జూన్‌లో జట్టులో తిరిగి చేరిన పాండ్యా.. టీమ్‌ఇండియాలో (Team India) స్థానం సొంతం చేసుకున్నాడు.

Hardik Pandya

New Delhi, DEC 22: త్వరలో భారత క్రికెట్‌ జట్టు నాయకత్వ (Team India Captancy) మార్పు జరుగనుందా? పరిస్థితులు చూస్తే అలానే అనిపిస్తున్నది. జట్టు పూర్తిస్థాయి కెప్టెన్‌ అయిన రోహిత్‌ శర్మ (Rohit Sharma) వరుస గాయాలు, ఫిట్‌నెస్‌ లేమితో బాధపడుతున్నాడు. దీంతో ప్రస్తుతం జరుగుతున్న బంగ్లాదేశ్‌ టెస్ట్‌ సిరీస్‌కు (Bangladesh Test Series) పూర్తిగా దూరమయ్యాడు. ఇప్పటికే టీ20 సిరీస్‌ నుంచి తప్పుకున్నాడు. టీ20 ప్రపంచకప్‌లో కూడా జట్టు కెప్టెన్‌గా అంతగా ఆకట్టుకోలేపోయాడు. ఈ నేపథ్యంలో భావి కెప్టెన్‌గా భావిస్తున్న స్టార్‌ ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్యాకు (Hardik Pandya) టీమ్‌ఇండియా వన్డే, టీ20 జట్టు కెప్టెన్‌గా నియమించనున్నారని సమాచారం. ఇప్పటికే ఈ విషయాన్ని పాండ్యాకు జట్టు యాజమాన్యం చెప్పినట్లు తెలిసింది. అయితే అతని నాయకత్వ సామర్థ్యాన్ని రానున్న రోజుల్లో పరీక్షించనున్నారు. ఇప్పటికే 5 టీ20 మ్యాచ్‌ల్లో మెన్‌ ఇన్‌ బ్లూకు కెప్టెన్‌గా వ్యవహరించిన పాండ్యా.. 4 సార్లు జట్టుకు విజయాన్ని అందించారు. ఈ జూన్‌లో జట్టులో తిరిగి చేరిన పాండ్యా.. టీమ్‌ఇండియాలో (Team India) స్థానం సొంతం చేసుకున్నాడు. ఈ ఏడాది జరిగిన ఐపీఎల్‌లో హార్ధిక్‌ నేతృత్వంలో బరిలోకి దిగిన గుజరాత్‌ జట్టు టైటిల్‌ను సొంతం చేసుకున్న విషయం తెలిసిందే.

Ishan Kishan: దటీజ్ ఇషాన్ కిషన్, నేను ఇంకా ధోని స్థాయికి చేరుకోలేదు, ధోనీ సంతకం పైన సంతకం చేయడానికి నిరాకరించిన స్టార్ బ్యాటర్ 

కాగా, 2021 టీ20 వరల్డ్‌ కప్‌ తర్వాత న్యూజిలాండ్‌తో (Newzeland) స్వదేశంలో జరిగిన సిరీస్‌లో రోహిత్‌ శర్మ టీమ్‌ఇండియా పగ్గాలు చేపట్టాడు. అదే ఏడాది డిసెంబర్‌లో వన్డే కెప్టెన్సీ నుంచి విరాట్‌ కోహ్లీ తప్పుకోవడంతో రోహిత్‌.. జట్టు పూర్తిస్థాయి కెప్టెన్‌గా నియమితులయ్యాడు. అయితే గాయంతో కెప్టెన్‌గా తన మొదటి వన్డే సిరీస్‌ నుంచి తప్పుకున్నాడు. కరోనా కారణంగా టెస్ట్‌ కెప్టెన్సీ పగ్గాలను కూడా ఆలస్యంగా చేపట్టిన విషయం తెలిసిందే.

Mbappe Crying Video: ఓడిపోయామంటూ స్టేడియంలో వెక్కి వెక్కి ఏడ్చిన ఎంబాప్పే, ఓదార్చిన ఫ్రాన్స్ అధ్యక్షుడు Emmanuel Macron 

వయస్సు పైబడటంతోపాటు తరచూ గాయాల బెడతతో ఫిట్‌నెస్‌ సమస్య రోహిత్‌ను వెంటాడుతున్నాయి. దీంతో యువకుడైన పాండ్యా పూర్తి ఫిట్‌గా ఉండటం, జట్టులో తన స్థానాన్ని సుస్థిరం చేసుకోవడంతో జట్టు యాజమాన్యం కెప్టెన్సీ మార్పుపై తీవ్రంగా ఆలోచిస్తున్నట్లు తెలుస్తున్నది. ఈ నేపథ్యంలో వచ్చే నెల 3 నుంచి స్వదేశంలో శ్రీలంకతో జరుగనున్న వన్డే సిరీస్‌కు ఎవరిని కెప్టెన్‌గా నియమిస్తారనే అంశంపై సర్వత్రా ఆసక్తి నెలకొన్నది. వచ్చేవారం చివర్లో జట్టును ఎంపిక చేయనున్నారు.