ICC T20 World Cup 2024: ఐసీసీ మెన్స్ టీ20 వరల్డ్ కప్ 2024లో తొలి విజయాన్ని నమోదు చేసిన స్కాట్లాండ్, 5 వికెట్ల తేడాతో నమీబియాపై ఘన విజయం
బార్బోడస్ వేదికగా నమీబియాతో జరిగిన మ్యాచ్‌లో 5 వికెట్ల తేడాతో స్కాట్లాండ్ ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన నమీబియా నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 155 పరుగులు చేసింది.
ఐసీసీ మెన్స్ టీ20 వరల్డ్ కప్ 2024లో స్కాట్లాండ్ తొలి విజయాన్ని నమోదు చేసింది. బార్బోడస్ వేదికగా నమీబియాతో జరిగిన మ్యాచ్‌లో 5 వికెట్ల తేడాతో స్కాట్లాండ్ ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన నమీబియా నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 155 పరుగులు చేసింది. నమీబియా బ్యాటర్లలో కెప్టెన్ గెర్హార్డ్ ఎరాస్మస్(52) పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా.. గ్రీన్(28), డావిన్(20) పరుగులతో రాణించారు. స్కాట్లాండ్ బౌలర్లలో వీల్ 3 వికెట్లు పడగొట్టగా.. కుర్రీ రెండు, సోలే, గ్రీవ్స్, లీస్క్ తలా వికెట్ సాధించారు. పాకిస్తాన్ కొంప ముంచిన సూపర్ ఓవర్, రెండు వరుస విజయాలతో యూఎస్ఏ దూకుడు, ఐసీసీ మెన్స్ టీ20 వరల్డ్ కప్ 2024లో పరాభవంతో టోర్నీ ప్రారంభించిన దాయాది దేశం
అనంతరం 156 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన స్కాట్లాండ్ 18.3 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి ఛేదించింది. స్కాటీష్ కెప్టెన్ బెర్రింగ్‌టన్(47) ఆఖరి వరకు క్రీజులో నిలబడి మ్యాచ్‌ను ఫినిష్ చేశాడు. అతడితో పాటు ఆల్‌రౌండర్ మైఖేల్ లీస్క్(35) పరుగులతో రాణించాడు. నమీబియా బౌలర్లలో కెప్టెన్ ఎరాస్మస్ రెండు వికెట్లు పడగొట్టగా.. స్కోల్జ్, రుబీన్, లుంగమినీ తలా వికెట్ సాధించారు. ఆల్‌రౌండ్ షోతో అదరగొట్టిన మైఖేల్ లీస్క్‌కు ప్లేయర్ ఆఫ్‌ది మ్యాచ్ అవార్డు దగ్గింది.