ICC World Cup 2023 Qualifiers: మాజీ ప్రపంచ ఛాంపియన్లకు పసికూనలు సవాల్, ఆ జట్లు ఫైనల్ చేరితేనే ప్రపంచకప్‌కు అర్హత, వరల్డ్‌ కప్‌ 2023 క్వాలిఫైయ‌ర్ షెడ్యూల్‌ ఇదిగో..

జింబాబ్వే వేదికగా జరుగనున్న ఈ టోర్నీ జూన్‌ 18 నుంచి జులై 9 వరకు జరుగనుంది.

West Indies vs Zimbabwe (Image Credits - Twitter/@ICC)

ICC Men's Cricket World Cup Qualifier 2023: ఈ ఏడాది వ‌న్డే వ‌ర‌ల్డ్ క‌ప్ క్వాలిఫైయ‌ర్(ICC ODI World Cup qualifiers) షెడ్యూల్‌ను ఐసీసీ కొద్ది సేపటి క్రితం విడుదల చేసింది. జింబాబ్వే వేదికగా జరుగనున్న ఈ టోర్నీ జూన్‌ 18 నుంచి జులై 9 వరకు జరుగనుంది. హ‌రారే స్పోర్ట్స్ క్ల‌బ్, క్వీన్స్ స్పోర్ట్స్ క్ల‌బ్, ట‌క‌షింగ క్రికెట్ క్ల‌బ్‌.. ఈ మూడు స్టేడియాల్లో మ్యాచ్‌లు జ‌ర‌గున్నాయి. మొత్తం 10 జట్లు పాల్గొనే ఈ టోర్నీలో 5-5 జట్లు రెండు గ్రూపులుగా విభజించబడ్డాయి.

జింబాబ్వే, వెస్టిండీస్‌, ద నెదార్లండ్స్‌, నేపాల్‌, యునైటెడ్‌ స్టేట్స్‌ జట్లు గ్రూప్‌-ఏలో.. శ్రీలంక, ఐర్లాండ్‌, స్కాట్లాండ్‌, ఒమన్‌, యూఏఈ జట్లు గ్రూప్‌-బిలో ఉన్నాయి.మిగిలిన రెండు స్థానాల కోసం మాత్రం ప‌ది జ‌ట్లు పోటీ ప‌డుతున్నాయి. వీటిలో ఒక‌ప్ప‌టి మేటి జ‌ట్టు వెస్టిండీస్‌, గ‌త ఏడాది ఆసియా క‌ప్ విజేత శ్రీ‌లంక జ‌ట్టు, సంచ‌ల‌నాల‌కు కేరాఫ్ అయిన జింబాబ్వే కూడా ఉన్నాయి. దాంతో అర్హ‌త పోటీలు ఆస్తక్తిక‌రంగా మారాయి.

ధోనీ ముందు ప్లూట్ ఊదుతున్న శుభమాన్ గిల్, గెలుపు మాదే అంటూ శపధాలు, నేడే అసలైన పోరు, ఫైనల్‌కు చేరేది ఎవరో?

తొలి దశలో ప్రతి జట్టు తమ గ్రూప్‌లో మిగతా జట్లతో ఒక్కో మ్యాచ్‌ ఆడుతుంది. రెండు గ్రూప్‌ల్లో టాప్‌ 3 స్థానాల్లో నిలిచే జట్లు సూపర్ సిక్స్‌ దశకు అర్హత సాధిస్తాయి. ఈ దశలో ప్రతి జట్టు గ్రూప్‌ దశలో ఎదురుపడని జట్లతో తలపడతాయి. సూపర్ సిక్స్ దశకు చేరుకోవడంలో విఫలమైన జట్లపై సాధించిన పాయింట్లు మినహా, ప్రతి జట్టు గ్రూప్ దశలో సాధించిన పాయింట్లు సూపర్ సిక్స్ దశకు బదిలీ చేయబడతాయి. ఈ దశ మ్యాచ్‌లు అయిపోయే సరికి టాప్‌ 2లో ఉన్న జట్లు భారత్‌ వేదికగా జరిగే ఐసీసీ పురుషుల క్రికెట్ ప్రపంచ కప్-2023కు అర్హత సాధిస్తాయి.

ICC World Cup 2023 Qualifiers
ICC World Cup 2023 Qualifiers
ICC World Cup 2023 Qualifiers

కాగా, భారత్‌ వేదికగా ఈ ఏడాది చివర్లో జరిగే వన్డే ప్రపంచకప్‌కు 8 జట్లు ఇదివరకే అర్హత సాధించిన విషయం తెలిసిందే. భారత్‌, న్యూజిలాండ్‌, ఇంగ్లండ్‌, ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్‌, పాకిస్తాన్‌, ఆఫ్ఘనిస్తాన్‌, సౌతాఫ్రికా జట్లు ప్రపంచకప్‌కు నేరుగా అర్హత సాధించాయి. ఈ మెగా టోర్నీకి సంబంధించిన షెడ్యూల్‌ ఇంకా విడుదల కాలేదు. ఈఏడాది భార‌త‌దేశం వ‌ర‌ల్డ్ క‌ప్ పోటీల‌కు ఆతిథ్యం ఇస్తోంది. అక్టోబ‌ర్ – న‌వంబ‌ర్ మ‌ధ్య‌లో వ‌ర‌ల్డ్ క‌ప్ టోర్నీ జ‌ర‌గనుంది. సొంత గడ్డ‌పై 2011లో ఎంఎస్ ధోనీ సార‌థ్యంలో టీమిండియా క‌ప్పు ఎగ‌రేసుకుపోయింది. భార‌త జ‌ట్టు ఈసారి కూడా ట్రోఫీ గెల‌వాల‌నే ప‌ట్టుద‌ల‌తో ఉంది.



00" height="600" layout="responsive" type="mgid" data-publisher="bangla.latestly.com" data-widget="1705935" data-container="M428104ScriptRootC1705935" data-block-on-consent="_till_responded"> @endif