Shubman Gill (Photo credit: Twitter @IPL)

ఐపీఎల్‌-2023లో రసవత్తరమైన పోరుకు సమయం ఆసన్నమైంది. గుజరాత్‌ టైటాన్స్‌- చెన్నై సూపర్‌ కింగ్స్‌ మధ్య మంగళవారం తొలి క్వాలిఫయర్‌ జరుగనుంది. ఈ మ్యాచ్‌లో గెలిచే జట్టు నేరుగా ఫైనల్స్‌కు చేరుకోనుండగా, ఓడిన జట్టు క్వాలిఫయర్‌-2లో గెలిచే జట్టుతో తలపడనుంది. దీంతో ఈ మ్యాచ్‌పై భారీ అంచనాలు నెలకొన్నాయి.

నేటి మ్యాచ్‌ నేపథ్యంలో గుజరాత్‌(Gujarat Titans) ఓపెనర్‌, సెంచరీల హీరో శుభ్‌మన్‌ గిల్‌(Shubman Gil) కీలక వ్యాఖ్యలు చేశాడు. ఆర్సీబీతో ఆదివారం నాటి మ్యాచ్‌లో అజేయ సెంచరీతో గుజరాత్‌కు విజయాన్ని అందించిన గిల్‌.. ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ అవార్డు అందుకున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా అతడు మాట్లాడుతూ.. ‘‘నేను సూపర్‌ ఫామ్‌లో ఉన్నాను. సీజన్‌ ఆరంభంలో చిన్న స్కోర్లను పెద్దవిగా మలచడంలో విఫలమయ్యాను. ఎక్కువగా 40, 50లు స్కోరు చేశాను. అయితే, ఇప్పుడు మెరుగయ్యాను. అనుకున్న ఫలితాలు రాబట్టగలుగుతున్నాను. ఇక మా తదుపరి మ్యాచ్‌ కోసం ఎంతో ఆతురతగా ఎదురుచూస్తున్నా. చెన్నైలో చెన్నై సూపర్‌ కింగ్స్‌తో మ్యాచ్‌ అంటే ఎగ్జైటింగ్‌గా ఉంది.

తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో గోల్డెన్‌ డకౌట్, 17 డకౌట్లతో ఐపీఎల్‌లోనే అత్యంత చెత్త రికార్డును మూటగట్టుకున్న ఆర్‌సీబీ వికెట్‌ కీపర్‌ దినేశ్‌ కార్తిక్‌

చెపాక్‌ స్టేడియంలో చెన్నై(Chennai Super Kings)ని ఎదుర్కొనేందుకు తమ వద్ద గొప్ప బౌలింగ్‌ దళం ఉందని ధోనీ సేనకు గిల్‌ స్వీట్‌ వార్నింగ్‌ ఇచ్చాడు. ‘చెపాక్‌ వికెట్‌పై చెన్నైని ఎదుర్కొనేందుకు మా వద్ద గొప్ప బౌలింగ్‌ దళం ఉందని నేను భావిస్తున్నాను. చెన్నైలో చెన్నైపై తలపడటం కోసం మేం ఉత్సాహంగా ఉన్నాం. రెండో సారి మేం ఫైనల్‌లో అడుగుపెడతామని విశ్వాసముంది’ అని గిల్‌ పేర్కొన్నాడు.

శుభమాన్ గిల్ సిక్స్ వీడియో, స్టేడియంలోనే నేల మీద పడుకుని ఏడ్చేసిన మహమ్మద్ సిరాజ్, డగౌట్‌లో కూర్చోని కంటతడి పెట్టిన కోహ్లీ

ఇక గుజరాత్‌ ఓపెనర్‌ గిల్‌ ఈ సీజన్‌లో అద్భుత ఫామ్‌లో ఉన్న విషయం తెలిసిందే. ఇప్పటి వరకు 14 ఇన్నింగ్స్‌లో కలిపి అతడు 680 రన్స్‌ చేసి అత్యధిక పరుగుల వీరుల జాబితాలో రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. ఈ సీజన్‌లో అతడు ఇప్పటికే రెండు సెంచరీలు నమోదు చేయడం విశేషం. వారికి తోడుగా గుజరాత్‌ బౌలర్లు మహ్మద్‌ షమీ, రషీద్‌ ఖాన్‌ ఆకాశమే హద్దుగా చెలరేగుతున్నారు. పేసర్‌ షమీ 24 వికెట్ల(ఎకానమీ 7.70)తో పర్పుల్‌ క్యాప్‌ సంపాదించగా.. స్టార్‌ స్పిన్నర్‌ రషీద్‌ ఖాన్‌ సైతం 24 వికెట్లు(ఎకానమీ 7.82) పడగొట్టి షమీకి గట్టి పోటీ ఇస్తున్నాడు. ఈ నేపథ్యంలో తమ బౌలింగ్‌ విభాగం గురించి ప్రస్తావిస్తూ గిల్‌.. మా వాళ్లు తోపులు అన్నట్లు వ్యాఖ్యానించాడు.

ఐపీఎల్‌లో ఇప్పటి వరకు గుజరాత్‌, చెన్నై మూడుసార్లు ముఖాముఖి తలపడ్డాయి. అయితే, ఈ మూడింటిలోనూ హార్దిక్‌ పాండ్యా సేననే విజయం వరించింది. పైగా ఈ మూడు మ్యాచ్‌లలో చెన్నై నిర్దేశించిన లక్ష్యాలను టైటాన్స్‌ ఛేజ్‌ చేసింది. ఇక చెపాక్‌ వేదికగా మాత్రం ఇరు జట్ల మధ్య మ్యాచ్‌ జరగడం ఇదే తొలిసారి.

చెన్నై సూపర్‌ కింగ్స్‌ సొంత స్టేడియంలో ఆడుతుండడంతో అభిమానుల ఆనందానికి హద్దే లేకుండాపోతోంది. క్వాలిఫయర్‌ ఆడుతున్న తమ జట్టుకు మద్దతు ఇవ్వడంతో పాటు ఆఖరి మ్యాచ్‌ ఆడుతున్నట్లుగా భావిస్తున్న జట్టు కెప్టెన్‌ ధోనీకి అండగా నిలిచేందుకు, తమ అభిమానాన్ని చాటేందుకు క్రికెట్‌ అభిమానులు భారీగా తరలిరాన్నారు. దీంతో ఈ మ్యాచ్‌ కోసం నిర్వాహకులు భారీ ఏర్పాట్లు చేపట్టారు.

న్నై సూపర్‌ కింగ్స్‌ జట్టు సారధి మహేంద్ర సింగ్‌ ధోనికి ఇదే చివరి ఐపీఎల్‌ అన్న ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో అతనికి సొంత గడ్డపై ఘనంగా వీడ్కోలు పలికేలా రెండు మ్యాచ్‌లు చెన్నైలో నిర్వహించాలని బీసీసీఐ నిర్ణయించినట్లు క్రీడావర్గాల్లో చర్చ జరుగుతోంది. ఇప్పటికే ఈ మ్యాచ్‌కు సంబంధించిన టిక్కెట్లు ఆన్‌లైన్‌లో హాట్‌ కేకుల్లా అమ్ముడయ్యాయి.