WTC 2023 Final: పరుగుల వరద పారిస్తున్న ఆస్ట్రేలియా బ్యాటర్లు, ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ డే1 హైలెట్స్ ఇవిగో..
ప్రస్తుతం 62 ఓవర్లలో ఆస్ట్రేలియా బ్యాటర్లు 3 వికెట్ల నష్టానికి 226 పరుగులు చేశారు.
లండన్‌లోని కెన్నింగ్టన్ ఓవల్ మైదానంలో ఆస్ట్రేలియా- టీం ఇండియా మధ్య జరుగుతున్న ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ (ICC World Test Championship Final) మ్యాచ్ Day 1లో భాగంగా మూడో సెషన్ ప్రారంభమైంది. ప్రస్తుతం 62 ఓవర్లలో ఆస్ట్రేలియా బ్యాటర్లు 3 వికెట్ల నష్టానికి 226 పరుగులు చేశారు.స్టీవెన్ స్మిత్, ట్రావిస్ హెడ్ నిలకడగా బ్యాటింగ్ చేస్తూ పరుగుల వరద పారిస్తున్నారు. ట్రావిస్ హెడ్ 94 బంతుల్లో 93 పరుగులు చేయగా, స్టీవెన్ స్మిత్ 137 బంతుల్లో 49 పలుగులు చేశాడు. ప్రస్తుతం స్టీవెన్ స్మిత్, ట్రావిస్ హెడ్ క్రీజులో ఉన్నారు.
తొలి సెషన్‌లో 2 వికెట్లు కోల్పోయిన ఆస్ట్రేలియా జట్టు భోజన విరామం సమయానికి 23 ఓవర్లలో 73 పరుగులు చేసింది. భోజన విరామం అనంతరం రెండో సెషన్ ప్రారంభంలోనే మూడో వికెట్ కోల్పోయిన ఆస్ట్రేలియా జట్టు నిలకడగా ఆడింది. ఆసీస్ టీ విరామం సమయానికి 51 ఓవర్లలో 170 పరులు చేసింది. రెండో సెషన్ ప్రారంభంలోనే ఆస్ట్రేలియా (Australia) జట్టుకు భారత (India) బౌలర్ షమీ షాక్ ఇచ్చాడు. షమీ బౌలింగ్‌లో మార్నస్ లాబుషేన్ బౌల్డ్ అయ్యాడు. మార్నస్ లాబుషేన్ 62 బంతుల్లో 26 పరుగులు చేశాడు.
మన క్రికెటర్స్ ఫోటో షూట్.. జబర్దస్ట్ ఫోటోలు ఇవిగో..
24.1 ఓవర్ల వద్ద ఆస్ట్రేలియా 76 పరుగులు చేసి మూడో వికెట్ కోల్పోయింది. 60 బంతుల్లో డేవిడ్ వార్నర్ 43 పరుగులు చేశాడు. ఠాకూర్ బౌలింగ్‌లో శ్రీకర్ భరత్‌కు క్యాచ్ ఇచ్చి వార్నర్ ఔటయ్యాడు. ఉస్మాన్ ఖవాజా 10 బంతులు ఆడి పరుగులు రాబట్టకపోగా.. సిరాజ్ బౌలింగ్‌లో శ్రీకర్ భరత్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు.