IND vs SA 2022 3rd ODI 2022: దక్షిణాఫ్రికా అత్యంత చెత్త రికార్డు, మూడో వన్డేలో భారత్ ఘన విజయం, 2-1తో సిరీస్ కైవసం
అక్టోబరు 11, మంగళవారం ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో జరిగిన మూడో వన్డేలో ఏడు వికెట్ల తేడాతో దక్షిణాఫ్రికాపై ఏడు వికెట్ల తేడాతో విజయం సాధించిన భారత్, మొదట బంతితో, ఆపై బ్యాట్‌తో ఆధిపత్య ప్రదర్శన చేసింది.ఓపెనర్‌ను కోల్పోయిన తర్వాత 2-1తో సిరీస్‌ను కైవసం చేసుకుంది.
సౌతాఫ్రికాతో స్వదేశంలో మూడో వన్డేలో ధావన్ సేన ఘన విజయం సాధించింది. ఏడు వికెట్ల తేడాతో గెలుపొంది సిరీస్‌ను 2-1తో కైవసం చేసుకుంది. మంగళవారం ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో జరిగిన మూడో వన్డేలో ఏడు వికెట్ల తేడాతో దక్షిణాఫ్రికాపై ఏడు వికెట్ల తేడాతో విజయం సాధించిన భారత్, మొదట బంతితో, ఆపై బ్యాట్‌తో ఆధిపత్య ప్రదర్శన చేసింది.ఓపెనర్‌ను కోల్పోయిన తర్వాత 2-1తో సిరీస్‌ను కైవసం చేసుకుంది. టీమిండియా 19.1 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 105 పరుగులు చేసి విజయాన్ని ఖాతాలో వేసుకుంది.
తొలి ఇన్నింగ్స్‌లో కుల్దీప్ యాదవ్ నాలుగు వికెట్లు తీయగా, వాషింగ్టన్ సుందర్ మరియు షాబాజ్ అహ్మద్ రెండేసి వికెట్లు తీయడంతో దక్షిణాఫ్రికా కేవలం 99 పరుగులకే ఆలౌటైంది. 100 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ 19.1 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేధించింది.
వంద పరుగుల లక్ష్య సాధనకు బరిలోకి దిగిన టీమిండియా ఓపెనర్ ధావన్ వికెట్‌ను 42 పరుగుల స్కోర్ వద్ద కోల్పోయింది. 8 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద ధావన్ రనౌట్‌గా వెనుదిరగాల్సొచ్చింది. ధావన్ ఔట్ కావడంతో క్రీజులోకొచ్చిన ఇషాన్ కిషన్ కూడా 10 పరుగులకే కీపర్ క్యాచ్‌గా చిక్కి పెవిలియన్ బాట పట్టాడు. అయితే.. మరో ఓపెనర్ శుభ్‌మన్ 49 పరుగులు చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. శ్రేయాస్ అయ్యర్ (22), సంజూ శాంసన్ (4) పరుగులు చేసి మ్యాచ్‌ను గెలుపుతో ముగించారు.
ఇక టీమిండియాతో ఇవాళ (అక్టోబర్ 11) జరుగుతున్న నిర్ణయాత్మక మూడో వన్డేలో దక్షిణాఫ్రికా జట్టు ఓ చెత్త రికార్డును మూటగట్టుకుంది. ఆ జట్టు వన్డేల్లో నాలుగో అత్యల్ప స్కోర్‌ను నమోదు చేసింది. నేటి మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన సఫారీ టీమ్.. 27.1 ఓవర్లలో కేవలం 99 పరుగులు మాత్రమే చేసి ఆలౌటైంది.