T20 Tickets: హైదరాబాదీ క్రికెట్ ఫ్యాన్స్ అలర్ట్.. ఆస్ట్రేలియా, భారత్ మూడో టీ20 మ్యాచ్ టికెట్లన్నీ అమ్ముడయ్యాయి.. ఆన్ లైన్ లో టికెట్లు బుక్ చేసుకున్న వాళ్లు మాత్రమే జింఖానా మైదానంకు వచ్చి ఫిజికల్ టికెట్లు తీసుకోవాలి.. హెచ్ సీఏ కీలక ప్రకటన

ఆస్ట్రేలియా, భారత్ మూడో టీ20 మ్యాచ్ కి సంబంధించిన టికెట్లన్నీ అమ్ముడయ్యాయని హైదరాబాద్ క్రికెట్ సంఘం ఒక ప్రకటనలో తెలిపింది. ఇదివరకు ఆన్ లైన్ లో టికెట్లు బుక్ చేసుకున్న వాళ్లు మాత్రమే జింఖానా మైదానంకు వచ్చి ఫిజికల్ టికెట్లు తీసుకోవాలని తెలిపింది.

Tickets

Hyderabad, September 23: ఆస్ట్రేలియా, భారత్ మూడో టీ20 మ్యాచ్ (T20 Match) కి సంబంధించిన టికెట్లన్నీ అమ్ముడయ్యాయని హైదరాబాద్ క్రికెట్ సంఘం (HCA) ఒక ప్రకటనలో తెలిపింది. ఇదివరకు ఆన్ లైన్ లో టికెట్లు బుక్ చేసుకున్న వాళ్లు మాత్రమే జింఖానా మైదానంకు వచ్చి ఫిజికల్ టికెట్లు (Physical Tickets) తీసుకోవాలని తెలిపింది. ఇందుకోసం శుక్ర, శని, ఆదివారాల్లో కౌంటర్లు ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు తెరిచి ఉంటాయని చెప్పింది.

ఆన్ లైన్ లో బుక్ చేసుకున్న వాళ్లు ఈ మెయిల్ కన్ఫర్మే షన్ చూపించడంతో పాటు ప్రభుత్వ గుర్తింపు కార్డు చూపించాలని, దాని జిరాక్స్ ను కూడా ఇచ్చి ఫిజికల్ టికెట్లు తీసుకోవాల్సి ఉంటుందని తెలిపింది. ఇతరులు బుక్ చేసిన టికెట్లను తీసుకోవాలంటే ఇద్దరి ఫొటో గుర్తింపు కార్డులు, జిరాక్సులను జత చేయాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. ఆన్ లైన్ లో టికెట్లు బుక్ చేసుకున్నప్పటికీ.. ఫిజికల్ టికెట్లు ఉంటేనే ఆదివారం రాత్రి ఉప్పల్ స్టేడియంలో జరిగే మ్యాచ్ కు అనుమతి ఉంటుందని హైదరాబాద్ క్రికెట్ సంఘం స్పష్టం చేసింది.

తిరుమల భక్తులకు ముఖ్య గమనిక.. బ్రహ్మోత్సవాల వేళ 12 వేల వాహనాలకే అనుమతి.. కరోనా కారణంగా రెండేండ్ల నుంచి నిలిచిపోయిన బ్రహ్మోత్సవాలు.. ఇప్పుడే తిరిగి ప్రారంభం..

కౌంటర్లలో టికెట్లు విక్రయిస్తామని హైదరాబాద్ క్రికెట్ సంఘం ప్రకటించడంతో గురువారం భారీ సంఖ్యలో జింఖానా మైదానం వద్దకు వచ్చిన అభిమానుల మధ్య తోపులాట జరిగి పలువురు గాయపడిన సంగతి తెలిసిందే. ఈ విషయంలో హెచ్ సీఏపై సర్వత్ర విమర్శలు వస్తున్నాయి. చివరి నిమిషం వరకూ కౌంటర్లలో టికెట్ల విక్రయంపై సరైన ప్రకటన ఇవ్వకపోవడంతోపాటు జింఖానా మైదానం వద్ద సరైన ఏర్పాట్లు చేయలేకపోయిందని పలువురు ఆరోపించారు.

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement