INDW vs BANW: డ్రా గా ముగిసిన భారత్- బంగ్లాదేశ్ మూడో వన్డే, భారత్ ఆశలను గల్లంతు చేసిన అంపైర్ల నిర్ణయాలు, వన్డే సిరీస్ సమంగా పంచుకున్న ఇరు జట్లు
వర్షం కారణంగా సూపర్ ఓవర్(Super Over) నిర్వహించకుండానే అంపైర్లు ఇరుజట్లను సంయుక్త విజేతలుగా ప్రకటించారు. అయితే..ఈ మ్యాచ్‌లో అంపైర్ల తప్పిదాలు టీమిండియా విజయావకాశాల్ని దెబ్బతీశాయి.
New Delhi, July 22: భారత్(India), బంగ్లాదేశ్(Bangladesh) మహిళల జట్ల మధ్య జరిగిన కీలకమైన మూడో వన్డే టైగా ముగిసింది. వర్షం కారణంగా సూపర్ ఓవర్(Super Over) నిర్వహించకుండానే అంపైర్లు ఇరుజట్లను సంయుక్త విజేతలుగా ప్రకటించారు. అయితే..ఈ మ్యాచ్‌లో అంపైర్ల తప్పిదాలు టీమిండియా విజయావకాశాల్ని దెబ్బతీశాయి. బంగ్లాదేశ్ నిర్దేశించిన 225 లక్ష్య ఛేదనలో ఒకవైపు వికెట్లు పడుతున్నా.. హర్లీన్ డియోల్(71), జెమీమా రోడ్రిగ్స్(33 నాటౌట్) జట్టును గెలుపు దిశగా నడిపించారు. విజయానికి ఒక్క పరుగు దూరంలో 225వద్ద టీమిండియా ఆలౌటయ్యింది. దాంతో, ఇరుజట్ల స్కోర్లు సమం అయ్యాయి. మామూలుగా అయితే.. విజేతను నిర్ణయించేందుకు సూపర్ ఓవర్ పెడతారు. కానీ, వర్షం కారణంగా అంపైర్లు భారత్, బంగ్లా జట్లను సంయుక్త విజేతలుగా అనౌన్స్ చేశారు. కీలక ఇన్నింగ్స్ ఆడిన హర్లీన్ డియోల్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’, టోర్నీ ఆసాంతం అదరగొట్టిన ఫర్గాన హక్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ది సిరీస్’ అవార్డులు దక్కాయి.
మొదట బ్యాటింగ్ చేసిన బంగ్లా 4 వికెట్ల నష్టానికి 225 పరుగులు కొట్టింది. ఓపెనర్ ఫర్గన హక్(107) సెంచరీతో మెరిసింది. వన్డేల్లో శతకం బాదిన తొలి బంగ్లా మహిళా క్రికెటర్‌గా ఆమె రికార్డు సృష్టించింది. మరో ఓపెనర్ షమిమా సుల్తానా(52) అర్ధ శతకంతో జట్టుకు భారీ స్కోర్ అందించారు. ఆ తర్వాత ఇన్నింగ్స్ మొదలెట్టిన టీమిండియాకు శుభారంభం దక్కలేదు. ఓపెనర్ షఫాలీ వర్మ(4), యస్తికా భాటియా(5) మరోసారి నిరాశపరిచారు. అయితే.. స్టార్ ఓపెనర్ స్మృతి మంధాన(59) హాఫ్ సెంచరీతో ఆకట్టుకుంది.
Viral Video: ఇండియా-బంగ్లాదేశ్ క్రికెటర్ల మధ్య గొడవ.. వీడియో వైరల్!
ఆమె తర్వాత వచ్చిన కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్(14) స్వల్ప స్కోర్‌కే ఎల్బీగా వెనుదిరిగడంతో భారత్ కష్టాల్లో పడింది. ఆ పరిస్థితుల్లో క్రీజులోకి వచ్చిన హర్లీన్ డియోల్ (77 108 బంతుల్లో 9 ఫోర్లు) అద్భుత ఇన్నింగ్స్‌తో జట్టును ఆదుకుంది. డియోల్ ఔటయ్యాక జెమీమా రోడ్రిగ్స్(33 నాటౌట్) ధాటిగా ఆడుతూ లక్ష్యాన్ని కరిగించింది. అయితే.. మరో మూడు బంతులు ఉన్నాయనగా 225 స్కోర్ వద్ద మేఘనా సింగ్ (6)ఔటయ్యింది. దాంతో, మ్యాచ్ టైగా ముగిసింది.