Newdelhi, July 22: శ్రీలంకలో (Srilanka) జరుగుతున్న ఏసీసీ ఎమర్జింగ్ టీమ్స్ మెన్స్ ఆసియాకప్ 2023లో (Asia Cup 2023) ఆసక్తికర ఘటన జరిగింది. నిన్న బంగ్లాదేశ్‌తో (Bangladesh) జరిగిన సెమీఫైనల్‌లో 51 పరుగుల తేడాతో విజయం సాధించిన టీమిండియా (Team India) జూనియర్ జట్టు ఫైనల్‌లోకి ప్రవేశించింది. రేపు (ఆదివారం) కొలంబోలో జరగనున్న ఫైనల్‌లో భారత్-పాక్ జట్లు తలపడతాయి.మ్యాచ్ సందర్భంగా బంగ్లాదేశ్-ఎ ఆటగాడు సౌమ్య సర్కార్, ఇండియా-ఎ పేసర్ హర్షిత్ రాణా మధ్య మైదానంలో గొడవ జరిగింది. యువరాజ్ సిన్హ్ దోడియా బౌలింగులో  నికిన్ జోస్‌కు క్యాచ్ ఇచ్చి సౌమ్య సర్కార్ అవుటయ్యాడు. దీంతో భారత ఆటగాళ్లు సంబరాలు చేసుకున్నారు. ఈ క్రమంలో సౌమ్య సర్కార్‌ కు హర్షిత్ రాణా సెండాఫ్ ఇవ్వడం ఉద్రిక్తతకు కారణమైంది. సహనం కోల్పోయిన సౌమ్య అతడితో గొడవకు దిగాడు. అంపైర్ ఇతర ఆటగాళ్లు జోక్యం చేసుకోవడంతో గొడవ సద్దుమణిగింది.

Asia Cup 2023: సెప్టెంబరు 2న శ్రీలంకలో దాయాదులతో భారత్ పోరు, ఆగష్టు 30 నుంచి ఆసియా వన్డే కప్‌-2023, పూర్తి షెడ్యూల్ ఇదిగో..

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)