ODI World Cup 2023: టీమిండియాతో శ్రీలంక పోరు, బద్దలు అయ్యేందుకు రెడీగా ఉన్న రికార్డులు ఇవే, ఆసియా కప్‌ ఫైనల్‌ ఫలితం పునరావృతంతో పాటు సెమీస్‌ బెర్త్‌పై కన్నేసిన భారత్

టీమిండియాతో తలపడనుంది. ఈ మ్యాచ్‌లో భారత్‌ శ్రీలంకను ఓడించి, అధికారికంగా సెమీస్‌ బెర్త్‌ ఖరారు చేసుకోవాలని భావిస్తుంది.ఆసియా కప్‌-2023 ఫైనల్లో ఫలితాన్నే (సిరాజ్‌ (7-1-21-6) చెలరేగడంతో భారత్‌ 10 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది) ఈ మ్యాచ్‌లోనూ పునరావృతం చేయాలని భారత ఆటగాళ్లు భావిస్తున్నారు.

India vs Sri Lanka

ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికగా ఇవాళ (నవంబర్‌ 2) శ్రీలంక.. టీమిండియాతో తలపడనుంది. ఈ మ్యాచ్‌లో భారత్‌ శ్రీలంకను ఓడించి, అధికారికంగా సెమీస్‌ బెర్త్‌ ఖరారు చేసుకోవాలని భావిస్తుంది.ఆసియా కప్‌-2023 ఫైనల్లో ఫలితాన్నే (సిరాజ్‌ (7-1-21-6) చెలరేగడంతో భారత్‌ 10 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది) ఈ మ్యాచ్‌లోనూ పునరావృతం చేయాలని భారత ఆటగాళ్లు భావిస్తున్నారు.

మరోవైపు లంక సైతం ఈ మ్యాచ్‌లో భారత్‌ను ఓడించాలని పట్టుదలగా ఉంది. గత మ్యాచ్‌లో పసికూన ఆఫ్ఘనిస్తాన్‌ చేతిలో ఓడిన లంకేయులు ఈ మ్యాచ్‌లో ఎలాగైనా భారత్‌ను ఓడించి పరువు నిలుపుకోవాలని అనుకుంటున్నారు.శ్రీలంక ఇవాల్టి మ్యాచ్‌లో భారత్‌ను ఓడించినప్పటికీ ఆ జట్టుకు ఒరిగేదేమీ ఉండదు. ఆ జట్టు ఆరు మ్యాచ్‌ల్లో కేవలం రెండే విజయాలతో నిష్క్రమణకు (సెమీస్‌కు చేరకుండా) దగ్గరగా ఉంది.

దక్షిణాఫ్రికా చేతిలో 190 పరుగుల తేడాతో చిత్తయిన న్యూజీలాండ్, పాకిస్తాన్ సెమీస్ అవకాశాలను సజీవం చేసిన కివీస్

ఇక ప్రపంచకప్‌లో ఇరు జట్లు 9 సార్లు ఎదురెదురుపడగా.. భారత్‌ 4, శ్రీలంక 4 విజయాలతో సమంగా ఉన్నాయి. ఓ మ్యాచ్‌లో ఫలితం​ రాలేదు. ఈ మ్యాచ్‌లో టీమిండియా విజయం సాధిస్తే ఈ వరల్డ్ కప్‌లో సెమీస్ బెర్త్ ఖాయం చేసుకున్న తొలి జట్టుగా నిలుస్తుంది. అంతేకాదు పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి దూసుకెళ్తుంది. వరల్డ్ కప్‌లో వరుసగా 7 గెలుపుల ద్వారా రికార్డు సృష్టించనుంది. అంతేకాదు ఈ మ్యాచ్‌లో మరికొన్ని రికార్డులు కూడా బద్దలు అయ్యేందుకు రెడీగా ఉన్నాయి.

1. వన్డేల్లో 49 సెంచరీలతో అగ్రస్థానంలో ఉన్న మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్‌ రికార్డును విరాట్ కోహ్లీ సమం చేసే అవకాశాలున్నాయి. కోహ్లీ ఖాతాలో ప్రస్తుతం 48 సెంచరీలు ఉన్నాయి.

వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్‌లో టీమ్ఇండియా విజ‌య యాత్ర‌, ఇంగ్లాండ్ పై 100 తేడాతో ఘనవిజయం, భారత్ సెమీస్ బెర్త్ ఖాయం

2. ఒక క్యాలెండర్ ఏడాదిలో 1000 పరుగులు ఎక్కువసార్లు చేసిన ఆటగాళ్ల జాబితాలో ప్రస్తుతం విరాట్, సచిన్ టెండూల్కర్‌ సమానంగా ఉన్నారు. ఇద్దరూ ఏడు సార్లు ఒకే ఏడాది వెయ్యి పరుగులు చేశారు. సచిన్ ను అధిగమించేందుకు కోహ్లీ కేవలం 34 పరుగుల దూరంలో మాత్రమే ఉన్నాడు. ఈ మ్యాచ్‌లో 34 పరుగులు కొడితే సచిన్ రికార్డ్ బద్ధలుకానుంది.

3. శ్రేయాస్ అయ్యర్ తన తదుపరి మూడు మ్యాచ్‌ల్లో 65 పరుగులు చేస్తే ఏడాదిలో వెయ్యి పరుగులు చేసిన మూడవ వేగవంతమైన భారతీయ క్రికెటర్‌గా నిలుస్తాడు.

4. శ్రీలంక బౌలర్ మాథ్యూస్, రోహిత్ శర్మను వన్డేల్లో ఇప్పటివరకు ఏడుసార్లు అవుట్ చేశాడు. రోహిత్‌ను అందరి కంటే ఎక్కువసార్లు ఔట్ చేసింది ఈ బౌలరే కావడం విశేషం. ఇందులో 2 డకౌట్స్ కూడా ఉన్నాయి. మాథ్యూస్‌పై రోహిత్ సగటు 14.71 కాగా, స్ట్రైక్ రేట్ 58.85 చాలా తక్కువగా ఉన్నాయి. ఈ మ్యాచ్‌లో రోహిత్‌ను మాథ్యూస్ ఔట్ చేస్తే గణాంకాలు మరింత పేలవంగా మారతాయి.

5. శ్రీలంక బ్యాట్స్‌మెన్ సమరవిక్రమ 1000 వన్డే పరుగులకు 54 పరుగుల దూరంలో ఉన్నాడు. గురువారం ఈ మైలురాయిని చేరుకునే అవకాశం ఉంది. రాయ్ డయాస్‌తో (27 ఇన్నింగ్స్‌లు) సమానంగా వేగంగా 1000 పరుగులు చేరుకున్న శ్రీలంక ఆటగాడిగా అవతరిస్తాడు.

6. మహేశ్ తీక్షణ వన్డేల్లో 50 వికెట్ల మైలురాయి చేరుకోవడానికి 3 వికెట్ల దూరంలో ఉన్నాడు.