India vs New Zealand: రెండో టీ-20 మ్యాచ్‌లో టీమిండియా సూపర్ విక్టరీ, సెంచరీతో అదరొట్టిన సూర్యకుమార్ యాదవ్, చెలరేగిన టీమిండియా బౌలర్లు
భారత స్టార్ బ్యాటర్, మిస్టర్ 360 ఆటగాడు సూర్యకుమార్ యాదవ్ (Suryakumar Yadav) (111: 51 బంతుల్లో 11 ఫోర్లు, 7 సిక్స్‌లు) సెంచరీతో అదరగొట్టాడు.
Mount Maunganui, NOV 20: న్యూజిలాండ్‌తో జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో టీమ్‌ఇండియా (India) 65 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. భారత స్టార్ బ్యాటర్, మిస్టర్ 360 ఆటగాడు సూర్యకుమార్ యాదవ్ (Suryakumar Yadav) (111: 51 బంతుల్లో 11 ఫోర్లు, 7 సిక్స్‌లు) సెంచరీతో అదరగొట్టాడు. దీంతో కివిస్ ముందు భారత్ పెట్టిన 192 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించడంతో విఫలమైంది. భారత్ బౌలర్లు పొదుపుగా బౌలింగ్ చేస్తూ వికెట్లు తీశారు. అయితే న్యూజిల్యాండ్ బ్యాట్స్ మెన్ కేన్ విలియమ్సన్ (Kane Williamson) 61(52) ఒంటరిపోరాటం వృథా అయింది. దీంతో మూడు మ్యాచ్‌లో సిరీస్‌లో భారత్‌పై చేయి సాధించింది. తొలి మ్యాచ్ వర్షం కారణంగా రద్దయిన సంగతి తెలిసిందే. భారత్ నిర్దేశించిన 192 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో న్యూజిలాండ్ ఆది నుంచి తడబడుతూనే ఆడింది.
పరుగులేమీ చేయకుండానే ఫిన్ అలెన్ 0(2) వికెట్ కోల్పోయింది. ఆ తర్వాత బ్యాటింగ్ వచ్చిన విలియమ్సన్‌తో కలిసి కాన్వే కొద్దిసేపు భారత్ బౌలర్లకు చెమటలు పట్టించారు. ఈ క్రమంలో వాషింగ్టన్ సుందర్ బౌలింగ్‌లో అర్షదీప్‌కు క్యాచ్ ఇచ్చి కాన్వే 25(22) వెనుదిరిగాడు. ఆ తర్వాత కివిస్‌ను భారత్ బౌలర్లు కుదురుకోనీయలేదు. క్రమంగా వికెట్లు తీస్తూ, వచ్చారు. మరోవైపు విలియమ్సన్ 61(52) ఒంటరి పోరాటం చేసినా, మిగిలిన బ్యాటర్స్ నుంచి అతడికి సహకారం లభించలేదు. దీంతో కివిస్ 18.5 ఓవర్లకు 126 పరుగులు చేసి ఆలౌటైంది.
అంతకు ముందు టాస్ గెలిచిన న్యూజిలాండ్ భారత్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. సూర్య కుమార్ యాదవ్ శతకం 111(51)తో అదరగొట్టడంతో టీమ్ ఇండియా భారీ స్కోరు చేసింది. సూర్య తన టీ20 కెరీర్‌లో రెండో సెంచరీ బాదాడు. కేవలం 49 బంతుల్లో శతకాన్ని నమోదు చేశాడు. తొలుత అర్ధశతకం చేయడానికి 32 బంతులను తీసుకొన్న సూర్య.. ఆ తర్వాత సుడిగాలి ఇన్నింగ్స్ ఆడాడు. మరో 17 బంతుల్లోనే సెంచరీ మార్క్‌ను దాటేశాడు.