IND vs NZ 1st Test 2024: ఏకంగా 5గురు టీమిండియా బ్యాటర్లు డకౌట్, టెస్టుల్లో అత్యంత చెత్త రికార్డు నమోదు చేసిన భారత్, ముగిసిన రెండో రోజు ఆట

ఇవాళ కివీస్ దే పైచేయిగా నిలిచింది. నిన్న తొలి రోజు ఆట పూర్తిగా వర్షార్పణం కాగా, ఇవాళ్టి ఉదయం టాస్ గెలిచిన టీమిండియా బ్యాటింగ్ ఎంచుకుంది. అయితే కివీస్ బౌలర్ల విజృంభణతో టీమిండియా మొదటి ఇన్నింగ్స్ లో 46 పరుగులకే ఆలౌట్ అయింది.

IND vs NZ 1st Test 2024

టీమిండియా, న్యూజిలాండ్ జట్ల మధ్య బెంగళూరులో జరుగుతున్న తొలి టెస్టులో రెండో రోజు ఆట ముగిసింది. ఇవాళ కివీస్ దే పైచేయిగా నిలిచింది. నిన్న తొలి రోజు ఆట పూర్తిగా వర్షార్పణం కాగా, ఇవాళ్టి ఉదయం టాస్ గెలిచిన టీమిండియా బ్యాటింగ్ ఎంచుకుంది. అయితే కివీస్ బౌలర్ల విజృంభణతో టీమిండియా మొదటి ఇన్నింగ్స్ లో 46 పరుగులకే ఆలౌట్ అయింది.

పిచ్ పై ఉన్న తేమ పరిస్థితులను సద్వినియోగం చేసుకున్న కివీస్ పేసర్లు టీమిండియా బ్యాటింగ్ లైనప్ ను హడలెత్తించారు. ఈ ఇన్నింగ్స్ ఫలితంగా టీమిండియా ఓ చెత్త రికార్డు మూటగట్టుకుంది. సొంతగడ్డపై టీమిండియాకు టెస్టుల్లో ఇదే అత్యల్ప స్కోరు.

ఉప్ప‌ల్ లో చెల‌రేగిన టీమ్ ఇండియా, సంజా శాంస‌న్ దెబ్బ‌కు విల‌విలలాడిన బంగ్లాదేశ్, 133 ప‌రుగుల భారీ తేడాలో ఘ‌న విజ‌యం

ఇప్పటివరకు టెస్టుల్లో టీమిండియా అత్యల్ప స్కోరు 75 పరుగులు. 1987లో ఢిల్లీ టెస్టులో వెస్టిండీస్ పై భారత్ 75 పరుగులకే ఆలౌటైంది. 37 ఏళ్ల నాటి ఈ రికార్డు నేటితో తెరమరుగైంది. ఇక విదేశాల్లో టీమిండియా అత్యల్ప స్కోరు 36 పరుగులు. 2020లో ఆస్ట్రేలియా పర్యటన సందర్భంగా టీమిండియా అడిలైడ్ టెస్టులో 36 పరుగులకే కుప్పకూలిన సంగతి తెలిసిందే. ఆ ఇన్నింగ్స్ తర్వాత భారత్ మరోసారి 50 పరుగుల లోపే ఆలౌట్ కావడం మళ్లీ ఇవాళే చోటుచేసుకుంది.

ఇవాళ న్యూజిలాండ్ చేతిలో భారత్ 46 పరుగులకే ఆలౌట్ కాగా, అందులో ఐదు డకౌట్లు ఉన్నాయి. సొంతగడ్డపై ఓ ఇన్నింగ్స్ లో టీమిండియా బ్యాటర్లు ఐదుగురు డకౌట్ కావడం ఇది రెండోసారి. 1999లో మొహాలీ టెస్టు మ్యాచ్ లో ఐదుగురు టీమిండియా ఆటగాళ్లు సున్నా చుట్టారు. ఆ మ్యాచ్ కూడా న్యూజిలాండ్ తోనే కావడం గమనార్హం.

అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన న్యూజిలాండ్ జట్టు రెండో రోజు ఆట ముగిసే సమయానికి 3 వికెట్ల నష్టానికి 180 పరుగులు చేసింది. ప్రస్తుతం కివీస్ ఆధిక్యం 134 పరుగులు. రచిన్ రవీంద్ర 22, డారిల్ మిచెల్ 14 పరుగులతో క్రీజులో ఉన్నారు. అంతకుముందు, కివీస్ ఓపెనర్ డెవాన్ కాన్వే సెంచరీ చేజార్చుకున్నాడు. 105 బంతులు ఎదుర్కొన్న కాన్వే 11 ఫోర్లు, 3 సిక్సులతో 91 పరుగులు చేశాడు. కెప్టెన్ టామ్ లాథమ్ 15, విల్ యంగ్ 33 పరుగులు చేశారు. టీమిండియా బౌలర్లలో అశ్విన్ 1, కుల్దీప్ యాదవ్ 1, జడేజా 1 వికెట్ తీశారు.