India national cricket team players celebrate a dismissal (Photo credit: X @BCCI)

Hyderabad, OCT 12: బంగ్లాపై భారత్‌ ఘన విజయం (India Win) సాధించింది. ఉప్పల్‌ వేదిగా జరిగిన మ్యాచ్‌లో ఆల్‌రౌండ్‌ ప్రదర్శనతో ప్రత్యర్థిని 133 పరుగుల తేడాతో చిత్తుచిత్తుగా ఓడించింది. చివరి టీ20లోనూ విజయఢంకా మోగించి మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను క్లీన్‌ స్వీప్‌ చేసింది. 298 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించడంలో బంగ్లా బోల్తా కొట్టింది. నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 164 పరుగులకు పరిమితమైంది. లిటన్‌దాస్‌ (42), హిర్దోయ్‌ (63*) మినహా ఎవరూ పెద్దగా రాణించలేదు. అంతకుముందు బ్యాటింగ్‌ చేసిన భారత్‌ 6 వికెట్ల నష్టానికి 297 పరుగులు చేసింది.

India Beat Bangladesh By 133 Runs

 

భారత్‌ అంతర్జాతీయ టీ20 చరిత్రలో రెండో భారీ స్కోర్‌ (highest core) నమోదు చేసింది. ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్‌ చేసిన భారత్‌ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 297 పరుగులు చేసింది. సంజూ శాంసన్‌ (47 బంతుల్లో 111; 11 ఫోర్లు, 8 సిక్సర్లు) విధ్వంసకర శతకంతో, సూర్యకుమార్‌ యాదవ్‌ (35 బంతుల్లో 75; 8 ఫోర్లు, 5 సిక్సర్లు) మెరుపు హాఫ్‌ సెంచరీతో చెలరేగిపోయారు.

Sublime century, records broken and flurry of sixes

 

ఆఖర్లో హార్దిక్‌ పాండ్యా (18 బంతుల్లో 47; 4 ఫోర్లు, 4 సిక్సర్లు), రియాన్‌ పరాగ్‌ (13 బంతుల్లో 34; ఫోర్‌, 4 సిక్సర్లు) కూడా తలో చేయి వేయడంతో భారత్‌ రికార్డు స్కోర్‌ సాధించింది. భారత ఇన్నింగ్స్‌లో అభిషేక్‌ శర్మ 4, రింకూ సింగ్‌ 8, నితీశ్‌ రెడ్డి 0, వాషింగ్టన్‌ సుందర్‌ ఒక్క పరుగు చేశారు. బంగ్లా బౌలర్లలో తంజిమ్‌ హసన్‌ సకీబ్‌ మూడు వికెట్లు పడగొట్టగా.. తస్కిన్‌ అహ్మద్‌, ముస్తాఫిజుర్‌, మహ్మదుల్లా తలో వికెట్‌ దక్కించుకున్నారు.