IND vs NZ, Third Test: సొంత గడ్డపై టీమిండియాకు ఘోర పరాభవం, మూడో టెస్టులో 25 పరుగుల తేడాతో న్యూజీలాండ్ ఘన విజయం

ముంబై వేదికగా న్యూజిలాండ్‌తో జరిగిన మూడో టెస్టులో 25 పరుగుల తేడాతో భారత్ దారుణ ఓటమి చవిచూసింది. 147 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని చేధించడంలో టీమిండియా చతకలపడిం‍ది.లక్ష్య చేధనలో కేవలం 121 పరుగులకే భారత జట్టు కుప్పకూలింది.

India vs New Zealand, 2nd Test... Team India target 359(Cricbuzz X)

సొంత గడ్డపై టీమిండియాకు ఘోర పరాభవం ఎదురైంది. ముంబై వేదికగా న్యూజిలాండ్‌తో జరిగిన మూడో టెస్టులో 25 పరుగుల తేడాతో భారత్ దారుణ ఓటమి చవిచూసింది. 147 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని చేధించడంలో టీమిండియా చతకలపడిం‍ది.లక్ష్య చేధనలో కేవలం 121 పరుగులకే భారత జట్టు కుప్పకూలింది. భారత బ్యాటర్లు దారుణ ప్రదర్శన కనబరిచారు. రిషబ్ పంత్‌(64) మినహా మిగితా అందరూ విఫలమయ్యారు. విరాట్ కోహ్లి, జైశ్వాల్‌, గిల్‌, సర్ఫరాజ్‌, జడేజా వంటి స్టార్ ప్లేయర్లు సింగిల్ డిజిట్ స్కోర్లకే పరిమితమయ్యారు.

టీమిండియాను వైట్ వాష్ చేసిన కివీస్, ప్రపంచంలోనే తొలి జట్టుగా చరిత్ర సృష్టించిన న్యూజిలాండ్‌

యశస్వి జైస్వాల్ 5, రోహిత్ శర్మ 11, శుభ్‌మాన్ గిల్ 1, విరాట్ కోహ్లీ 1, సర్ఫరాజ్ ఖాన్ 1, రవీంద్ర జడేజా 6, వాషింగ్టన్ సుందర్ 12, రవిచంద్రన్ అశ్విన్ 8, ఆకాశ్ దీప్ 0, మహ్మద్ సిరాజ్ 0 (నాటౌట్) చొప్పున స్వల్ప స్కోర్లు చేశారు. మరోసారి వాంఖడేలో కివీస్ స్పిన్నర్ అజాజ్ పటేల్ అద్బుతం చేశాడు. తన స్పిన్ మయాజాలంతో భారత్ బ్యాటర్లను ముప్పు తిప్పులు పెట్టాడు. సెకెండ్ ఇన్నింగ్స్‌లో ఏకంగా 6 వికెట్లు పడగొట్టి టీమిండియా పతనాన్ని శాసించాడు. అతడితో పాటు పార్ట్ టైమ్ స్పిన్నర్ గ్లెన్ ఫిలిప్స్ 3 వికెట్లతో సత్తాచాటాడు. పేసర్ మాట్ హెన్రీ కూడా ఓ వికెట్ సాధించాడు.

భారత గడ్డపై మూడు లేదా అంతకంటే ఎక్కువ టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌లో టీమిండియాను  వైట్‌వాష్ చేసిన తొలి జట్టుగా న్యూజిలాండ్ రికార్డులకెక్కింది. ఈ సిరీస్ ముందు వ‌ర‌కు ఏ జ‌ట్టు చేతిలో కూడా టీమిండియా స్వ‌దేశంలో వైట్ వాష్‌కు గురువ్వ‌లేదు. ఇప్పుడు న్యూజిలాండ్ భార‌త జ‌ట్టును వైట్ వాష్ చేసి చ‌రిత్ర సృష్టించింది.

భారత్‌ వర్సెస్‌ న్యూజిలాండ్ మూడో టెస్టు(న‌వంబ‌ర్ 1- 5)

వేదిక:  ముంబై, వాంఖ‌డే స్టేడియం

టాస్‌: న్యూజిలాండ్‌.. తొలుత బ్యాటింగ్‌

న్యూజిలాండ్‌ తొలి ఇన్నింగ్స్‌ స్కోరు: 235

టీమిండియా తొలి ఇన్నింగ్స్‌ స్కోరు: 263

న్యూజిలాండ్‌ రెండో ఇన్నింగ్స్‌ స్కోరు: 174

భారత్‌ రెండో ఇన్నింగ్స్‌ స్కోరు: 121

ఫలితం: 25 పరుగుల తేడాతో భారత్‌ ఓటమి



00" height="600" layout="responsive" type="mgid" data-publisher="bangla.latestly.com" data-widget="1705935" data-container="M428104ScriptRootC1705935" data-block-on-consent="_till_responded"> @endif