India vs Pakistan CWG 2022: పాక్‌పై భారత్ ఘనవిజయం, కామన్‌వెల్త్‌లో అదరగొట్టిన అమ్మాయిలు, పాక్ టీమ్‌కు ముచ్చెముటలు పట్టించిన స్మృతీ మందనా
పాకిస్థాన్ నిర్దేశించిన 100 పరుగుల విజయ లక్ష్యాన్ని 11.4 ఓవర్లలో రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి ఛేదించింది.
Birmingham, July 31: కామన్వెల్త్ గేమ్స్ (commonwealth games)లో భాగంగా పాకిస్థాన్‌తో ఎడ్జ్‌బాస్టన్‌లో జరిగిన టీ20 మ్యాచ్‌లో భారత మహిళల జట్టు ఆల్‌రౌండ్ షోతో అదరగొట్టింది. పాకిస్థాన్ నిర్దేశించిన 100 పరుగుల విజయ లక్ష్యాన్ని 11.4 ఓవర్లలో రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి ఛేదించింది. ఫలితంగా తొలి విజయాన్ని నమోదు చేసింది. స్మృతి మందాన (Smriti Mandhana) సూపర్ షోతో అదరగొట్టడంతో శతక పరుగుల లక్ష్యం చిన్నబోయింది. 42 బంతుల్లో 8 ఫోర్లు, 3 సిక్సర్లతో అజేయ అర్ధ సెంచరీ (63)తో నాటౌట్‌గా నిలిచిన మంధాన భారత విజయంలో కీలక పాత్ర పోషించింది. షెఫాలీ వర్మ (Shafali Verma) 16, సాబినేని మేఘన 14 పరుగులు చేయగా, జెమీమా రోడ్రిగ్స్ 2 పరుగులతో నాటౌట్‌గా నిలిచింది.
అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ నిర్ణీత 20 ఓవర్లలో 99 పరుగులకు ఆలౌట్ అయింది. వర్షం కారణంగా ఆలస్యంగా ప్రారంభమైన మ్యాచ్‌ను 18 ఓవర్లకు కుదించారు. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న పాకిస్థాన్‌కు ప్రారంభం ఏమంత కలిసి రాలేదు. ఖాతా కూడా తెరవకుండానే రెండో ఓవర్ మూడో బంతికి ఓపెనర్ ఇరామ్ జావేద్ (0) వికెట్‌ను కోల్పోయింది. ఆ తర్వాత వచ్చిన కెప్టెన్ బిస్మా మరూఫ్ జట్టును ఆదుకునే ప్రయత్నం చేసినప్పటికీ ఎక్కువ సేపు క్రీజులో కుదురుకోలేకపోయింది. 17 పరుగులు మాత్రమే స్నేహ్ రాణా బౌలింగులో వెనుదిరిగింది.
మరోవైపు ధాటిగా ఆడుతున్న ఓపెనర్ మునీబా అలీని కూడా స్నేహ్ రాణా పెవిలియన్ చేర్చింది. మునీబా 30 బంతుల్లో 3 ఫోర్లు, సిక్సర్‌తో 32 పరుగులు చేసింది.
ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన వారు కూడా ఎవరూ నిలదొక్కుకోలేకపోయారు. వికెట్లు తీస్తూ భారత బౌలర్లు ఒత్తిడి పెంచడంతో వచ్చినంత వేగంగా క్రీజును వదిలారు. 18వ ఓవర్ చివరి బంతికి కైనాత్ ఇంతియాజ్ (2)ను రాధా యాదవ్ బౌల్డ్ చేయడంతో పాక్ ఇన్నింగ్స్ ముగిసింది. పాక్ జట్టులో మునీబా (32) తర్వాత అలియా రియాజ్ చేసిన 18 పరుగులే అత్యధికం. భారత బౌలర్లలో స్నేహ్ రాణా, రాధాయాదవ్ చెరో రెండు వికెట్లు తీసుకోగా, రేణుకా సింగ్, మేఘనా సింగ్, షెఫాలీ వర్మ చెరో వికెట్ తీసుకున్నారు. ఇండియా తన తర్వాతి మ్యాచ్‌లో ఆగస్టు 3న బార్బడోస్‌తో తలపడుతుంది.