IND vs PAK Asia Cup 2023: పాకిస్తాన్ ముందు భారీ లక్ష్యాన్ని ఉంచిన భారత్, శతకాలతో మెరిసిన కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లీ
అయితే ఓవర్లలో ఎలాంటి కోత జరగకుండా పూర్తి మ్యాచ్ జరగనుంది.
ఆసియాకప్ సూపర్ 4లో భాగంగా వర్షం కారణంగా అంతరాయం కలిగినప్పటికీ భారత్ వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ రిజర్వ్ డే లో గంటన్నర ఆలస్యంగా ప్రారంభం అయింది. అయితే ఓవర్లలో ఎలాంటి కోత జరగకుండా పూర్తి మ్యాచ్ జరగనుంది. ఆదివారం వర్షం కారణంగా 24.2 ఓవర్ల దగ్గర ఆగిపోయిన ఆటను సోమవారం(రిజర్వ్ డే) ఆట ప్రారంభించిన (147/2) టీమిండియా తొలుత కాస్త నిదానంగా ఆడింది. అయితే, ఆతర్వాత జోరుపెంచి వేగంగా పరుగులు రాబట్టింది.
గాయం నుంచి కోలుకుని దాదాపు ఆరు నెలల తర్వాత అంతర్జాతీయ క్రికెట్‌లోకి రీఎంట్రీ ఇచ్చిన కేఎల్ రాహుల్ వచ్చీరాగానే సెంచరీతో సత్తా చాటాడు. పాక్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో రాహుల్ 100 బంతుల్లో 10 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో వన్డే కెరీర్‌లో ఆరో సెంచరీ పూర్తి చేశాడు. రాహుల్ శతక్కొట్టిన మరుసటి ఓవర్‌లోనే విరాట్ కూడా సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అతను 84 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో సెంచరీ చేశాడు.
టీమిండియా 50 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి 356 పరుగులు చేసింది. పాకిస్తాన్ కు 357 పరుగుల లక్ష్యాన్ని విసిరింది.