IND vs SL World Cup 2023: నిప్పులు చెరిగిన మొహమ్మద్ షమీ, ఘోర పరాజయం పాలైన శ్రీలంక, సెమీస్ బెర్తు ఖాయం చేసుకున్న టీమిండియా

భారత్ విసిరిన భారీ లక్ష్యాన్ని చేధించలేక అత్యంత తక్కువ స్కోర్ కే ఆలౌట్ అయింది.

India vs Sri Lanka World Cup 2023

ప్రపంచకప్‌లో భాగంగా శ్రీలంకతో జరుగుతున్న మ్యాచ్‌లో టీమ్‌ఇండియా ఘన విజయం సాధించగా... శ్రీలంక చరిత్రలో ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. భారత్ విసిరిన భారీ లక్ష్యాన్ని చేధించలేక అత్యంత తక్కువ స్కోర్ కే ఆలౌట్ అయింది. 358 పరుగుల ఛేదనలో బ్యాటింగ్‌కు వచ్చిన శ్రీలంక.. ఏ మాత్రం పోటి ఇవ్వలేక చతికిల పడింది. భారత్ 302 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. శ్రీలంక కేవలం 19. 4 ఓవర్లలో 55 పరుగులకే ఆలౌట్ అయింది. దీంతో నేరుగా సెమీస్ బెర్తు ఖాయం చేసుకుంది టీమిండియా. వరుసగా ఏడు విజయాలతో 14 పాయింట్లు సాధించి పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచింది.

భారత బౌలర్ల ధాటికి శ్రీలంక బౌలర్లు నిలవలేకపోయారు, నిప్పులు చెరిగిన షమీ ధాటికి కుప్పకూలారు. అయిదు వికెట్లతో శ్రీలంక పతనాన్ని శాసించాడు షమీ. మహమ్మద్ సిరాజ్ ఆరంభంలొనే మూడు వికెట్లు తీసి శ్రీలంక పతనాన్ని శాసించారు. తొలి బంతికే వికెట్‌ కోల్పోయి పరుగుల కంటే ముందు వికెట్ల ఖాతా తెరిచిన లంకను మహమ్మద్ సిరాజ్, షమీలు నిప్పులు చెరిగే బంతులతో వణికించారు. బుమ్రా వేసిన తొలి ఓవర్‌లో మొదటి బంతికే నిస్సంక వికెట్ల ముందు దొరికిపోయాడు.

ఇన్నింగ్స్‌లో తొలి బంతికే వికెట్ తీసిన తొలి భారత బౌలర్‌గా జస్ప్రీత్ బుమ్రా రికార్డు, శ్రీలంక పాతుమ్ నిస్సాంకాను గోల్డెన్ డక్ గా పంపిన స్టార్ బౌలర్

రెండో ఓవర్‌ వేసిన సిరాజ్‌.. లంకకు డబుల్‌ స్ట్రోక్‌ ఇచ్చాడు. తొలి బంతికే దిముత్‌ కరుణరత్నెను ఎల్బీగా వెనక్కి పంపిన సిరాజ్‌.. ఐదో బంతికి లంక కీలక బ్యాటర్‌ సధీర సమరవిక్రమను ఔట్‌ చేశాడు. ఇదే ఓవర్లో రెండో బంతికి రివ్యూ తీసుకుని బతికిపోయిన సమరవిక్రమ.. ఐదో బంతికి శ్రేయస్‌ అయ్యర్‌కు క్యాచ్‌ ఇచ్చి పెవిలియన్‌ చేరాడు. నాలుగో ఓవర్‌ వేసిన సిరాజ్‌.. మరోసారి తొలి బంతికే లంకను దెబ్బతీశాడు. కెప్టెన్‌ కుశాల్‌ మెండిస్‌.. నాలుగో ఓవర్లో మొదటి బంతికే క్లీన్‌ బౌల్డ్‌ అయ్యాడు.

అనంతరం బౌలింగ్ రేసులోకి వచ్చిన మొహమ్మద్ షమీ తొలి ఓవర్ లోనే వరుస బంతుల్లో శ్రీలంక బ్యాటర్లని పెవిలియన్ కి పంపాడు. మహ్మద్‌ షమీ బౌలింగ్‌లో చమీరా పెవిలియన్‌కు చేరాడు.  అసలంక, హేమంత డకౌట్‌ అయ్యారు. ఏంజెలో మాథ్యూస్‌ క్లీన్ బౌల్డ్ అయ్యాడు.

విరాట్ కోహ్లీ ఔటైన వీడియో చూసి మళ్లీ అభిమానుల గుండె పగిలింది, ఈ సారి కూడా సచిన్ రికార్డును చేరుకోలేకపోయిన విరాట్

శ్రీలంకతో మ్యాచ్‌లో టీమిండియా బ్యాటర్లు శుబ్‌మన్‌ గిల్‌(92), విరాట్‌ కోహ్లి(88), శ్రేయస్‌ అ‍య్యర్‌(82) పరుగులతో అదరగొట్టారు. వీరి ముగ్గురి అద్భుతమైన అర్ధ శతకాలతో టీమిండియా భారీ స్కోరు సాధించింది. నిర్ణీత 50 ఓవర్లలో  8 వికెట్ల నష్టానికి 357 పరుగులు సాధించింది.

లంక బౌలర్లలో పేసర్‌ మధుషాంక అత్యధికంగా 5 వికెట్లు తీయగా.. దుష్మంత చమీరకు ఒక వికెట్‌ దక్కింది. రనౌట్ల రూపంలో లంకు రెండు వికెట్లు లభించాయి.



00" height="600" layout="responsive" type="mgid" data-publisher="bangla.latestly.com" data-widget="1705935" data-container="M428104ScriptRootC1705935" data-block-on-consent="_till_responded"> @endif