IND Vs AUS: తొలి టీ-20లో స‌త్తా చాటిన భార‌త మ‌హిళా టీమ్, షెఫాలీ వ‌ర్మ దుమ్మురేగే ఆట‌తో ఫ‌స్ట్ టీ-20లో ఘ‌న విజ‌యం

ఆసీస్ బ్యాట‌ర్ల‌లో ఫొబే లిచ్‌ఫీల్డ్(49; 32 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్స‌ర్లు), అలీసా పెర్రీ(37; 30 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స‌ర్లు) లు రాణించారు.

India Women Beat Australia Women (PIC@ BCCI X)

Mumbai, JAN 05: మూడు మ్యాచుల టీ20 సిరీస్‌లో (T-20) భార‌త మ‌హిళ‌ల జ‌ట్టు శుభారంభం చేసింది. వ‌న్డే సిరీస్‌ను ఆస్ట్రేలియా (India Women Beat Australia) వైట్‌వాష్ చేసిన‌ప్ప‌టికీ ముంబై వేదిక‌గా జ‌రిగిన తొలి టీ20 మ్యాచులో భార‌త్ తొమ్మిది వికెట్ల తేడాతో విజ‌యాన్ని సాధించింది. ఆసీస్‌ నిర్దేశించిన 142 ప‌రుగుల ల‌క్ష్యాన్ని 17.4 ఓవ‌ర్ల‌లో వికెట్ కోల్పోయిన ఛేదించింది. భార‌త బ్యాట‌ర్ల‌లో ష‌ఫాలీ వ‌ర్మ (Shafali varma) (64 నాటౌట్‌; 44 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్స్‌లు), స్మృతి మంధాన (Smriti) (54; 52 బంతుల్లో 7 ఫోర్లు, 1 సిక్స్‌) లు అర్ధ‌శ‌త‌కాల‌తో రాణించారు. ఆసీస్ బౌల‌ర్ల‌లో జార్జియా వేర్‌హామ్ ఓ వికెట్ తీసింది. అంత‌క‌ముందు తొలుత‌ బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా మ‌హిళ‌ల జ‌ట్టు 19.2 ఓవ‌ర్ల‌లో 141 ప‌రుగుల‌కే కుప్ప‌కూలింది. ఆసీస్ బ్యాట‌ర్ల‌లో ఫొబే లిచ్‌ఫీల్డ్(49; 32 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్స‌ర్లు), అలీసా పెర్రీ(37; 30 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స‌ర్లు) లు రాణించారు.

 

సదర్లాండ్ (12), మూనీ (17) లు మాత్ర‌మే రెండు అంకెల స్కోర్లు చేయ‌గా మిగిలిన వారు సింగిల్ డిజిట్‌కే ప‌రిమితం అయ్యారు. టీమ్ఇండియా బౌల‌ర్ల‌లో టిటాస్ సాధు నాలుగు వికెట్లతో ఆసీస్ వెన్ను విరిచింది. దీప్తి శర్మ, శ్రేయాంక పాటిల్ లు చెరో రెండు వికెట్లు, రేణుకా సింగ్ ఓ వికెట్ తీసింది.



00" height="600" layout="responsive" type="mgid" data-publisher="bangla.latestly.com" data-widget="1705935" data-container="M428104ScriptRootC1705935" data-block-on-consent="_till_responded"> @endif