Krunal Pandya's Twitter Account Hacked: టీమిండియా ప్లేయర్ ట్విట్టర్ అకౌంట్ హ్యాక్, బిట్ కాయిన్లు ఇస్తే అకౌంట్ ఇచ్చేస్తామంటూ ట్వీట్లు, దీపక్ హుడాకు లింక్ పెట్టి నెటిజన్ల ట్వీట్లు
గురువారం ఉదయం నుంచి ఆయన అధికారిక ట్విట్టర్ హ్యాండిల్ (Twitter Handle) నుంచి పలు రకాలు ట్వీట్లు వస్తున్నాయి. కృనాల్ పాండ్యా ట్విట్టర్ అకౌంట్ ను బిట్ కాయిన్ల కోసం అమ్మేస్తున్నట్లు ట్వీట్లు పెట్టారు హ్యాకర్లు.
New Delhi, January 27: టీమిండియా ఆల్ రౌండర్ కృనాల్ పాండ్యా (Krunal Pandya) ట్విట్టర్ అకౌంట్ హ్యాక్ (Twitter account gets hacked) అయింది. గురువారం ఉదయం నుంచి ఆయన అధికారిక ట్విట్టర్ హ్యాండిల్ (Twitter Handle) నుంచి పలు రకాలు ట్వీట్లు వస్తున్నాయి. కృనాల్ పాండ్యా ట్విట్టర్ అకౌంట్ ను బిట్ కాయిన్ల కోసం అమ్మేస్తున్నట్లు ట్వీట్లు పెట్టారు హ్యాకర్లు. అయితే దీపక్ హుడా (Deepak Hooda) జట్టులో ఎంపికకు లింక్ పెట్టి, కృనాల్ పాండ్యా (Krunal Pandya) ను తీవ్రంగా ట్రోల్ చేస్తున్నారు నెటిజన్లు.
వెస్టిండీస్‌తో జరిగే వన్డే, టీ20 ఇంటర్నేషనల్ సిరీస్‌ల కోసం టీమిండియాను బుధవారం ప్రకటించారు. దీపక్ హుడా కూడా వన్డే జట్టులో చోటు దక్కించుకున్నాడు. ఓ మ్యాచ్‌లో కృనాల్, దీపక్ మధ్య గొడవ జరిగిన సంగతి తెలిసిందే. ఇలాంటి పరిస్థితిలో, అభిమానులు కృనాల్ ట్విట్టర్ ఖాతా నుంచి దీపక్ ఎంపికతో అసభ్యకరమైన ట్వీట్లను లింక్ చేశారు.
వెస్టిండీస్‌తో జరిగే వన్డే, టీ20 అంతర్జాతీయ సిరీస్‌ల కోసం కృనాల్, హార్దిక్ పాండ్యాలకు జట్టులో చోటు దక్కలేదు. దీపక్ హుడా టీమ్ ఇండియాలో చేరిన వెంటనే కృనాల్ ట్విట్టర్ ఖాతా హ్యాక్ అయిందని అభిమానులు ట్విట్టర్‌లో రాసుకొచ్చారు. కృనాల్ పాండ్యా మద్యం సేవించి ట్వీట్ చేస్తున్నాడని, అతని ట్విట్టర్ ఖాతా హ్యాక్ అయిందంటూ పలు కామెంట్లు వస్తున్నాయి.
జనవరి 2021లో, దీపక్ హుడా.. కృనాల్ పాండ్యాను దుర్భాషలాడాడని ఆరోపణలు వచ్చాయి. దీపక్ హుడా తన కెరీర్‌ను ముగించేస్తానని బెదిరించాడని కూడా చెప్పినట్లు కూడా వార్తలు వచ్చాయి. దీపక్ జులై 2021లో బరోడా తరపున ఆడుతున్నాడు. హుడా, కృనాల్‌ల పోరు తర్వాత జనవరిలో బరోడా క్రికెట్ అసోసియేషన్ దీపక్‌పై ఏడాది నిషేధం విధించింది.