Adidas as Team India's New Kit Sponsor: టీమ్‌ఇండియా కిట్‌ స్పాన్సర్‌గా అడిడాస్‌, ప్రతీ ఏడాది సుమారు రూ.70 కోట్లు చెల్లించేందుకు ఒప్పందం

ఈ మేరకు బీసీసీఐ కార్యదర్శి జై షా (BCCI Secretary Jay Shah) ప్రకటించారు. ఈ ఒప్పందం జూన్‌ 1 నుంచి అమలులోకి రానుందని తెలిపారు.

Team India. (Photo- BCCI)

టీమ్‌ఇండియా (Team India) కిట్‌ స్పాన్సర్‌గా (Kit Sponsor) ఇకపై అడిడాస్‌ వ్యవహరించనుంది. ఈ మేరకు బీసీసీఐ కార్యదర్శి జై షా (BCCI Secretary Jay Shah) ప్రకటించారు. ఈ ఒప్పందం జూన్‌ 1 నుంచి అమలులోకి రానుందని తెలిపారు.ఎంపీఎల్‌ స్పోర్ట్స్‌ (MPL Sports) 2020 నుంచి 2023 డిసెంబర్‌ వరకు భారత జట్టుకు కిట్ స్పాన్సర్‌గా వ్యవహరించాల్సి ఉన్నది. అయితే ఆ సంస్థ గత డిసెంబర్‌లో అర్థాంతరంగా తప్పుకోవడంతో కెవాల్ కిరణ్ (కిల్లర్ జీన్స్) తాత్కాలిక కిట్ స్పాన్సర్‌గా ఉన్నది. ఈ గడువు మే 31తో ముగియనుంది.

పాకిస్తాన్‌తో ఎటువంటి సిరీస్ లు ఆడేది లేదు, స్పష్టం చేసిన బీసీసీఐ

అంతకుముందు 2016 నుంచి 2020 వరకు నైక్‌ (NIKE) సంస్థ టీమ్‌ఇండియా కిట్‌ స్పాన్సర్‌గా వ్యహరించిన విషయం తెలిసిందే. తాజాగా అడిడాస్‌తో ఒప్పందం ఓకే కావడంతో మరో అంతర్జాతీయ సంస్థ టీమిండియా జెర్సీల్లో దర్శనమివ్వనుంది. 2023 నుంచి 2028 వరకు అంటే ఐదేండ్లపాటు టీమిండియా కిట్ స్పాన్సర్‌గా అడిడాస్‌ వ్యవహరించనున్నట్లు తెలుస్తున్నది. ఇందుకుగాను ఒక్కో మ్యాచ్‌కు రూ.65 లక్షలు చెల్లించనుంది. దీనిప్రకారం ప్రతీ ఏడాది సుమారు రూ.70 కోట్లు (ఐదేండ్లకు రూ.350 కోట్లు) చెల్లించేందుకు ఒప్పందం కుదిరిందని సమాచారం.



00" height="600" layout="responsive" type="mgid" data-publisher="bangla.latestly.com" data-widget="1705935" data-container="M428104ScriptRootC1705935" data-block-on-consent="_till_responded"> @endif