IPL 2023: నీవు దేనికి పనికిరావా, సూర్యకుమార్ యాదవ్ మళ్లీ డకౌట్‌‌పై మండిపడుతున్న ముంబై ఫ్యాన్స్ , గత ఆరు ఇన్నింగ్స్‌ల్లో నాలుగు సార్లు గోల్డెన్‌ డకౌట్‌

తాజాగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో మ్యాచ్‌లో సూర్యకుమార్‌ గోల్డెన్‌ డకౌట్‌ అయ్యాడు. ఢిల్లీ బౌలర్ ముకేశ్‌ కుమార్‌ బౌలింగ్‌లో అనవసరమైన షాట్‌కు యత్నించి కుల్దీప్‌ యాదవ్‌కు క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు. దీంతో గత ఆరు ఇన్నింగ్స్‌ల్లో సూర్యకు ఇది నాలుగో గోల్డెన్‌ డక్‌ కావడం గమనార్హం.

Suryakumar Yadav (Photo-Twitter)

ముంబై ఇండియన్స్‌ స్టార్‌ సూర్యకుమార్‌ యాదవ్‌ గోల్డెన్‌ డకౌట్ల పరంపర కొనసాగుతోంది. తాజాగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో మ్యాచ్‌లో సూర్యకుమార్‌ గోల్డెన్‌ డకౌట్‌ అయ్యాడు. ఢిల్లీ బౌలర్ ముకేశ్‌ కుమార్‌ బౌలింగ్‌లో అనవసరమైన షాట్‌కు యత్నించి కుల్దీప్‌ యాదవ్‌కు క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు. దీంతో గత ఆరు ఇన్నింగ్స్‌ల్లో సూర్యకు ఇది నాలుగో గోల్డెన్‌ డక్‌ కావడం గమనార్హం.

నీకు బుర్ర ఉందా..ఏం చేస్తున్నావసలు, లలిత్‌ యాదవ్‌పై మండిపడిన డేవిడ్ వార్నర్, ముంబైపై ఓటమితో పాయింట్ల పట్టికలో ఆఖరి స్థానంలో నిలిచిన ఢిల్లీ

ఐపీఎల్‌కు ముందు ఆస్ట్రేలియాతో జరిగిన వన్డే సిరీస్‌లో సూర్య మూడు వన్డేల్లోనూ గోల్డెన్‌ డకౌట్‌గా వెనుదిరిగాడు. ఆ తర్వాత ఐపీఎల్‌లో తొలి మ్యాచ్‌లో 16 బంతుల్లో 15 పరుగులు, రెండో మ్యాచ్‌లో ఒక్క పరుగు మాత్రమే చేసి ఔటైన సూర్య.. తాజాగా మాత్రం గోల్డెన్‌ డక్‌ అయ్యి విమర్శలు మూటగట్టుకుంటున్నాడు. సూర్య ఆటతీరు తమను బాధిస్తుందని అభిమానులు పేర్కొన్నారు. మ్యాచ్‌ విషయానికి వస్తే ముంబై ఇండియన్స్‌ సీజన్‌లో తొలి విజయాన్ని నమోదు చేసింది. ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన ఉత్కంఠ పోరులో ముంబై ఆరు వికెట్ల తేడాతో విజయాన్ని అందుకుంది.