IPL 2023: ఇదేం బౌలింగ్ సామి, 3.5 ఓవర్లలో 66 పరుగులా, ఇలాగైతే టీమిండియాలో చోటు కష్టమే, అర్ష్‌దీప్‌ సింగ్‌పై మాజీ వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌ దీప్‌దాస్‌ గుప్తా కీలక వ్యాఖ్యలు

సొంతమైదానంలో జరిగిన ఈ మ్యాచ్‌లో అర్ష్‌.. 3.5 ఓవర్లలో 66 పరుగులు ఇచ్చి కేవలం ఒకే ఒక వికెట్‌ తీశాడు. ఏకంగా 17.20 ఎకానమీతో చెత్త గణాంకాలు చేశాడు. స్థాయికి తగ్గట్లు రాణించలేక విమర్శలు మూటగట్టుకుంటున్నాడు.

Arshdeep shatters stumps (Photo-IPL)

మొహాలీ వేదికగా బుధవారం ముంబై ఇండియన్స్‌తో మ్యాచ్‌ పంజాబ్‌ కింగ్స్‌ పేసర్‌ అర్ష్‌దీప్‌ సింగ్‌ భారీగా పరుగులు సమర్పించుకున్నాడు. సొంతమైదానంలో జరిగిన ఈ మ్యాచ్‌లో అర్ష్‌.. 3.5 ఓవర్లలో 66 పరుగులు ఇచ్చి కేవలం ఒకే ఒక వికెట్‌ తీశాడు. ఏకంగా 17.20 ఎకానమీతో చెత్త గణాంకాలు చేశాడు. స్థాయికి తగ్గట్లు రాణించలేక విమర్శలు మూటగట్టుకుంటున్నాడు.

టీమిండియా మాజీ వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌ దీప్‌దాస్‌ గుప్తా అర్ష్‌దీప్‌ ఆట తీరును ప్రస్తావిస్తూ కీలక వ్యాఖ్యలు చేశాడు. అర్ష్‌ అద్భుత బౌలర్‌ అయినప్పటికీ.. ప్రతిసారి ధారాళంగా పరుగులు సమర్పించుకోవడం జట్టుకు ఇబ్బందికరంగా మారిందని పేర్కొన్నాడు. అతడి బౌలింగ్‌ విధానం చూస్తుంటే ఒత్తిడిలో కూరుకుపోయి.. ఆత్మవిశ్వాసం కోల్పోయినట్లుగా కనిపిస్తోందని వ్యాఖ్యానించాడు. ఇలాగైతే టీమిండియాలో చోటు దక్కించుకోవడం కష్టమేనని తెలిపారు.

పంజాబ్ పై పట్టు సాధించిన ముంబై, హై స్కోరింగ్‌ మ్యాచ్‌లో 6 వికెట్ల తేడాతో విజయం

ఇక అర్ష్‌ తర్వాత సామ్‌ కరన్‌ ఈ మ్యాచ్‌లో అత్యధిక పరుగులు ఇచ్చిన బౌలర్‌గా నిలిచాడు. 3 ఓవర్లలో అతడు ఏకంగా 41 పరుగులు ఇచ్చి ఒక్క వికెట్‌ కూడా తీయలేకపోయాడు. మిగిలిన వాళ్లలో రిషికి ఒకటి, నాథన్‌ ఎల్లిస్‌కు రెండు వికెట్లు దక్కాయి. ఐపీఎల్‌-2023లో అర్ష్‌దీప్‌ ఇప్పటి వరకు ఆడిన 10 మ్యాచ్‌లలో 361 పరుగులు ఇచ్చి 16 వికెట్లు పడగొట్టాడు. అత్యధిక వికెట్ల వీరుల జాబితాలో మూడోస్థానంలో కొనసాగుతున్నాడు.



00" height="600" layout="responsive" type="mgid" data-publisher="bangla.latestly.com" data-widget="1705935" data-container="M428104ScriptRootC1705935" data-block-on-consent="_till_responded"> @endif