MS Dhoni On Retirement: రిటైర్మెంట్ రూమర్స్‌కు చెక్ పెట్టిన ధోనీ, మరో ఐపీఎల్ సీజన్ ఆడుతానని స్పష్టం చేసిన సీఎస్కే కెప్టెన్

ఈ క్రమంలో ఐదు ఐపీఎల్ టైటిల్స్ గెలుపొందిన కెప్టెన్ గా ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ సరసన ధోనీ నిలిచాడు.

MS Dhoni (Photo credit: Twitter)

నిన్న రాత్రి జరిగిన ఐపీఎల్ ఫైనల్స్ లో గుజరాత్ టైటాన్స్ ను ఓడించి చెన్నై సూపర్ కింగ్స్ ఐపీఎల్ టైటిల్ ను కైవసం చేసుకుంది. ఈ క్రమంలో ఐదు ఐపీఎల్ టైటిల్స్ గెలుపొందిన కెప్టెన్ గా ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ సరసన ధోనీ నిలిచాడు. మరోవైపు ఇదే ధోనీకి చివరి ఐపీఎల్ అంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరిగిన సంగతి తెలిసిందే. దీనిపై మ్యాచ్ ముగిసిన అనంతరం ధోనీ స్పందిస్తూ... కీలక వ్యాఖ్యలు చేశాడు.

నా నిర్ణయం ఏమిటనేది ప్రకటించడానికి మరో 6-7 నెలల సమయం ఉంది. నాపై ప్రేమ చూపిస్తున్న వాళ్లందరికీ నా తరఫున మంచి బహుమతి అందించాలని అనుకుంటున్నా. ఆ గిఫ్ట్‌ ఇవ్వాలంటే నేను కష్టపడక తప్పదు’’ అని చెన్నై సూపర్‌ కింగ్స్‌ కెప్టెన్‌ మహేంద్ర సింగ్‌ ధోని ఉద్వేగపూరితంగా మాట్లాడాడు. ఈ గెలుపు తన ఫ్యాన్స్ కు ఒక గిఫ్ట్ అని ధోనీ చెప్పాడు.

ఒక్క వీడియోతో అన్ని రూమర్లకు పుల్‌స్టాప్, జడేజాను ఎత్తుకుని కన్నీటి పర్యంతమైన ధోనీ, మిలియన్‌కు పైగా వ్యూస్‌తో దూసుకుపోతున్న వీడియో

అద్భుతమైన విజయం సాధించిన ఈ క్షణం తన రిటైర్మెంట్ ప్రకటనకు సరైన సమయమని... 'థాంక్యూ వెరీ మచ్' అంటూ తన రిటైర్మెంట్ ను సింపుల్ గా ప్రకటించగలనని అన్నాడు. అయితే, మరో తొమ్మిది నెలలు పాటు హార్డ్ వర్క్ చేస్తానని, మరో ఐపీఎల్ సీజన్ ఆడుతానని స్పష్టం చేశాడు. అయితే, తన శరీరం ఎంత మేరకు సహకరిస్తుందనేని కూడా చూడాలని అన్నాడు. తుది నిర్ణయం తీసుకోవడానికి మరో 6 నుంచి 7 నెలల సమయం పడుతుందని చెప్పాడు.

మరో ఐపీఎల్ ఆడటమనేది కష్టమైన పనే అయినప్పటికీ... తనపై అభిమానులు చూపిస్తున్న ప్రేమ కోసం మరో ఐపీఎల్ ఆడాలనుకుంటున్నానని తెలిపాడు. ఐపీఎల్ లో తాము సాధించిన ప్రతి ట్రోఫీ ప్రత్యేకమైనదే అని చెప్పాడు. ధోనీ చేసిన ప్రకటనతో ఆయన అభిమానులు ఆనందంలో మునిగిపోయారు. ఈ సీజన్ ఐపీఎల్ ధోనీకి చివరిదనే భావనతో సీఎస్కే జట్టు ఆడిన ప్రతి స్టేడియంకు ఆయన అభిమానులు పెద్ద సంఖ్యలో తరలి వచ్చారు. అన్ని స్టాండ్స్ ధోనీకి మద్దతుగా పసుపురంగుతో నిండిపోయాయి.



సంబంధిత వార్తలు

Sonu Sood: డబ్బు సంపాదించడం కోసం లేదా అధికారం కోసమే రాజకీయాల్లోకి వస్తారు, సీఎం ఆఫర్ మీద బాలీవుడ్‌ నటుడు సోను సూద్ కీలక వ్యాఖ్యలు

Egg Attack On BJP MLA Munirathna: వీడియో ఇదిగో, బీజేపీ ఎమ్మెల్యే మునిరత్నపై కోడి గుడ్డుతో దాడి, నన్ను చంపేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తుందని ఆరోపణలు, ఖండించిన కర్ణాటక కాంగ్రెస్ నేతలు

CPI Narayana On Pushpa 2: అదో సినిమానా? స్మగ్లింగ్‌ ను గౌరవంగా చూపించే అలాంటి సినిమాకు మీరు రాయితీ ఇవ్వడమా? పుష్ప-2, తెలంగాణ ప్రభుత్వంపై సీపీఐ నారాయణ మండిపాటు

Amazon Prime Video New Rules: అమెజాన్ ప్రైమ్ వినియోగ‌దారుల‌కు బ్యాడ్ న్యూస్, పాస్ వ‌ర్డ్ షేరింగ్ పై జ‌న‌వ‌రి నుంచి కొత్త‌గా రెండు నిబంధ‌న‌లు తెస్తున్న సంస్థ‌