IPL 2023: అప్పుడు జట్టుకు దరిద్రం అంటూ వెక్కిరింతలు, ఇప్పుడు బౌలర్లకు చుక్కలు చూపిస్తూ దడపుట్టిస్తున్నాడు, సీఎస్‌కేకు కీలక ఆటగాడిగా మారిన శివమ్‌ దుబే

ఇప్పడు బౌలర్లకు చుక్కలు చూపిస్తున్నాడు. సీఎస్‌కే ప్రతీ విజయంలోనూ దుబే తన వంతు పాత్ర పోషిస్తున్నాడు. తాజాగా చెపాక్‌ వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో దుబే కీలక ఇన్నింగ్స్‌ ఆడాడు.

Shivam Dube (Twitter/IPL)

ఐపీఎల్‌-2023 సీజన్‌ ఆరంభంలో ఆకట్టుకోకపోయినా సీఎస్‌కే ఆటగాడు శివమ్‌ దుబే.. ఇప్పడు బౌలర్లకు చుక్కలు చూపిస్తున్నాడు. సీఎస్‌కే ప్రతీ విజయంలోనూ దుబే తన వంతు పాత్ర పోషిస్తున్నాడు. తాజాగా చెపాక్‌ వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో దుబే కీలక ఇన్నింగ్స్‌ ఆడాడు.

కేవలం 12 బంతులు మాత్రమే ఎదుర్కొన్న దుబే.. 3 సిక్స్‌లతో 25 పరుగులు చేసి ఔటయ్యాడు. అయితే అప్పటివరకు స్లోగా సాగిన సీఎస్‌కే ఇన్నింగ్స్‌.. దుబే సూపర్‌ బ్యాటింగ్‌తో ఊపందుకుంది. అనంతరం జడేజా, ధోని బ్యాట్‌కు పనిచెప్పడం సీఎస్‌కే 167 పరుగుల స్కోర్‌ సాధించగల్గింది.

ఆర్సీబీకి పట్టిన దరిద్రం ఆ బౌలర్, ఇంత చెత్త ఆటగాడిని ఎక్కడా చూడలేదు, హర్షల్‌ పటేల్‌ ఆట తీరుపై మండిపడుతున్న RCB అభిమానులు

ఇప్పటి వరకు ఈ ఏడాది సీజన్‌లో 12 మ్యాచ్‌లు ఆడిన దుబే.. 159.9 స్ట్రైక్‌ రేట్‌తో 315 పరుగులు చేశాడు. ఈ ఏడాది సీజన్‌లో ఇప్పటి వరకు దుబే 11 ఫోర్లు, 27 సిక్సర్లు బాదాడు. ఇక సీఎస్‌కే విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్న దుబేపై నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

Six Video

జట్టుకు పట్టిన దరిద్రం అన్నారు.. ఇప్పడు ఏమో బౌలర్లకు చుక్కలు చూపిస్తున్నాడు" అని ఓ యూజర్‌ ట్వీట్‌ చేశాడు. ఇక శివమ్‌ దుబే కొట్టిన సిక్సర్లే మ్యాచ్‌కు టర్నింగ్‌ పాయింట్‌ అని సీఎస్‌కే స్టార్‌ ఆల్‌రౌండర్‌ మొయిన్‌ అలీ కూడా తెలిపాడు.