IPL 2023: రూ. 4 కోట్లు పెట్టి కొంటే దరిద్రంగా ఆడుతున్నావు, చివరి ఓవర్లో గెలిపిస్తావనుకుంటే చెత్తగా అవుటయ్యావు, అబ్దుల్ సమద్‌పై మండిపడుతున్న SRH అభిమానులు
కోల్‌కతా నైట్ రైడర్స్ ‘ఫినిషర్’ రింకూ సింగ్‌తో పోలుస్తూ అతడిని ట్రోల్ చేస్తున్నారు. రింకూ రోజురోజుకూ మెరుగవుతుంటే అబ్దుల్ సమద్ మాత్రం చెత్త ప్రదర్శనతో విసుగు తెప్పిస్తున్నాడని విమర్శలు కురిపిస్తున్నారు.
సన్‌రైజర్స్ హైదరాబాద్ బ్యాటర్ అబ్దుల్ సమద్‌పై SRH అభిమానులు మండిపడుతున్నారు. కోల్‌కతా నైట్ రైడర్స్ ‘ఫినిషర్’ రింకూ సింగ్‌తో పోలుస్తూ అతడిని ట్రోల్ చేస్తున్నారు. రింకూ రోజురోజుకూ మెరుగవుతుంటే అబ్దుల్ సమద్ మాత్రం చెత్త ప్రదర్శనతో విసుగు తెప్పిస్తున్నాడని విమర్శలు కురిపిస్తున్నారు. జమ్మూ కశ్మీర్‌కు చెందిన 21 ఏళ్ల అబ్దుల్ సమద్‌ను ఐపీఎల్-2023 వేలంలో సన్‌రైజర్స్ రూ. 4 కోట్ల భారీ మొత్తానికి కొనుగోలు చేసింది. ఈ క్రమంలో ఇప్పటి వరకు 5 మ్యాచ్‌లు ఆడిన అతడు 111 పరుగులు చేశాడు. ఈ సీజన్‌లో ఇప్పటి వరకు సమద్ అత్యధిక స్కోరు 32(నాటౌట్).
ఇక ఐపీఎల్-2023లో భాగంగా ఉప్పల్‌లో కేకేఆర్‌తో మ్యాచ్‌లో ఏడో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన అబ్దుల్ సమద్.. 18 బంతుల్లో 21 పరుగులు చేయగలిగాడు. జట్టు కష్టాల్లో కూరుకుపోయిన వేళ ఆదుకుంటాడనుకుంటే చేతులెత్తేశాడు. కేకేఆర్ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి బౌలింగ్‌లో అనుకూల్ రాయ్‌కు క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు. ఆఖరి ఓవర్లో విజయానికి తొమ్మిది పరుగులు అవసరమైన వేళ అబ్దుల్ సమద్ అవుటవడం రైజర్స్ కొంపముంచింది. 5 పరుగుల తేడాతో జట్టు ఓటమి పాలైంది.
మరోవైపు.. రూ. 55 లక్షలకు కేకేఆర్ రింకూ సింగ్‌ను కొనుగోలు చేసింది. అతడు తన పాత్రకు పూర్తి న్యాయం చేస్తున్నాడు. ఒంటిచేత్తో మ్యాచ్‌లు గెలిపిస్తూ, డెత్ ఓవర్లలో కింగ్ అనిపించుకుంటూ ముందుకు సాగుతున్న రింకూ.. ఇప్పటి వరకు ఆడిన 10 మ్యాచ్‌లలో 316 పరుగులు సాధించాడు.