Harbhajan Singh (Photo Credits: Getty Images)

ఐపీఎల్ 2023 కీలక దశకు చేరుకుంది. ప్లేఆఫ్ సమీపిస్తున్న కొద్దీ మ్యాచులన్నీ మరింత రసవత్తరంగా మారుతున్నాయి. ఎలాగైనా ప్లేఆఫ్ బెర్తును దక్కించుకోవాలని కసితో ఆడుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్లేఆఫ్ కు వెళ్లే నాలుగు జట్ల పేర్లను హర్భజన్ సింగ్ వెల్లడించాడు. ముంబై ఇండియన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, చెన్నై సూపర్ కింగ్స్, గుజరాత్ టైటాన్స్ జట్లు ఈ సీజన్‌లో ప్లేఆఫ్స్ చేరుకుంటాయని బల్లగుద్ది మరీ చెప్తున్నాడు.

చెన్నై, ముంబై, బెంగుళూరు, గుజరాత్ జట్లతో పాటు..లక్నో సూపర్ జెయింట్స్, రాజస్థాన్ రాయల్స్, పంజాబ్ కింగ్స్ కు సైతం ప్లేఆఫ్స్‌ చేరే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని..కానీ తీవ్రంగా శ్రమించాల్సి ఉంటుందని హర్భజన్ సింగ్ తెలిపాడు. ఈ మూడు జట్లూ ప్లేఆఫ్స్ కోసం ఇతర జట్లకు గట్టి పోటీ ఇస్తాయని చెప్పారు. అయితే ఏ జట్టు టైటిల్ సాధిస్తుందో ఇప్పుడే చెప్పలేమన్నాడు.

ఇదేం బౌలింగ్ సామి, 3.5 ఓవర్లలో 66 పరుగులా, ఇలాగైతే టీమిండియాలో చోటు కష్టమే, అర్ష్‌దీప్‌ సింగ్‌పై మాజీ వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌ దీప్‌దాస్‌ గుప్తా కీలక వ్యాఖ్యలు

ఐపీఎల్ 2023 పాయింట్ల పట్టికను గమనిస్తే 12 పాయింట్లతో గుజరాత్ టైటాన్స్ టాప్ లో ఉంది. ఆ తర్వాత 11 పాయింట్లతో లక్నో చెన్నై రెండు, మూడు స్థానాల్లో ఉన్నాయి. ఆ తర్వాత 10 పాయింట్ల చొప్పున రాజస్థాన్, ఆర్సీబీ, ముంబై ఇండియన్స్, పంజాబ్ 4, 5, 6 స్థానల్లో నిలిచాయి. ఇదిలా ఉంటే ఐపీఎల్ 2023 మొదలైనప్పటి నుంచి పేలవ ఆటతీరుతో విమర్శలెదుర్కొన్న ముంబై ఇండియన్స్..పుంజుకుని..ఇప్పుడు పాయింట్ల పట్టికలో టాప పొజీషన్ కు దూసుకెళ్తోంది. ఇప్పటి వరకు 9 మ్యాచుల్లో 5 విజయాలు సాధించి 10 పాయింట్లను ఖాతాలో వేసుకుంది.