IPL Auction 2023: ఈ సారి సామ్‌ కర్రన్‌ కన్నా ఎక్కువ రేటు పలికే ఆటగాడు ఎవరు ? ఐపీఎల్‌ చరిత్రలో అత్యంత ఖరీదైన ఆటగాళ్ల లిస్ట్ ఇదిగో, పది ఫ్రాంచైజీల వద్ద ఉన్న నగదు ఎంతంటే..

దుబాయ్‌ వేదికగా జరుగబోయే ఈ మినీ వేలంలో 77 స్లాట్స్‌ అందుబాటులో ఉండగా ఫ్రాంచైజీల కన్ను తమ మీద పడేందుకు 333 మంది ఆటగాళ్లు అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు.

IPL Trophy (Photo-X)

Most Expensive Player in IPL History: క్రికెట్‌ అభిమానులంతా అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌) – 2024 వేలానికి మరికొద్దిగంటల్లో తెరలేవనుంది. దుబాయ్‌ వేదికగా జరుగబోయే ఈ మినీ వేలంలో 77 స్లాట్స్‌ అందుబాటులో ఉండగా ఫ్రాంచైజీల కన్ను తమ మీద పడేందుకు 333 మంది ఆటగాళ్లు అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. ఇందులో 214 మంది భారత్‌ నుంచి ఉండగా 119 మంది ఓవర్సీస్‌ (విదేశీ) క్రికెటర్లు ఉన్నారు.

ఇక మిగిలిన 77 మందిని వేలంలో దక్కించుకోవడానికి పది ఫ్రాంచైజీలు పోటీ పడుతున్నాయి. 77 మందిని (ఇందులో 30 స్లాట్స్‌ విదేశీయులకు కేటాయించినవి) కొనుగోలు చేయడానికి పది ఫ్రాంచైజీల వద్ద రూ. 262.95 కోట్ల నగదుఉంది. ఇందులో అత్యధికంగా గుజరాత్‌ టైటాన్స్‌ వద్ద రూ. 38.15 కోట్లు ఉండగా అత్యల్పంగా లక్నో సూపర్‌ జెయింట్స్‌ వద్ద రూ. 13.15 కోట్లు మాత్రమే మిగిలున్నాయి.

రేపే దుబాయ్‌లో ఐపీఎల్ ఆటగాళ్ల వేలం, ప్రస్తుతం ఉన్న జట్లు పూర్తి వివరాలు ఇవిగో, ప్రతి ఫ్రాంచైజీకి ఎంత డబ్బు ఉందో తెలుసా..

ఐపీఎల్‌లో అత్యంత ఖరీదైన భారత ఆటగాడిగా విరాట్‌ కోహ్లి నిలిచాడు. కోహ్లికి ఆర్సీబీ యాజమాన్యం 2023 సీజన్‌ కోసం రూ. 17 కోట్లు ముట్టజెప్పింది. కోహ్లి తర్వాత అత్యధిక మొత్తం అందుకున్న భారత ఆటగాళ్లుగా రోహిత్‌ శర్మ (2023 సీజన్‌లో 16 కోట్లు), రవీంద్ర జడేజా (2023లో 16 కోట్లు, రిషబ్‌ పంత్‌ (2023లో 16 కోట్లు, యువరాజ్‌ సింగ్‌ (2015లో 16 కోట్లు) ఉన్నారు. వీరి తర్వాత ఇషాన్‌ కిషన్‌ (2022లో 15.25 కోట్లు), యువరాజ్‌ సింగ్‌ (2014లో 14 కోట్లు), దినేశ్‌ కార్తీక్‌ (2014లో 12.5 కోట్లు), శ్రేయస్‌ అయ్యర్‌ (2022లో 12.25 కోట్లు) అత్యధిక ధర పలికిన భారత ఆటగాళ్లుగా ఉన్నారు.

ఇదిలా ఉంటే ఐపీఎల్‌ చరిత్రలో ఇప్పటివరకు జరిగిన 16 వేలాల్లో అత్యధిక ధర పలికిన ఆటగాళ్ల వివరాలు ఇలా ఉన్నాయి.

సామ్‌ కర్రన్‌- 18.5 కోట్లు (2023, పంజాబ్‌ కింగ్స్‌)

కెమారూన్‌ గ్రీన్‌- 17.5 కోట్లు (2023, ముంబై ఇండియన్స్‌)

బెన్‌ స్టోక్స్‌- 16.25 కోట్లు (2023, చెన్నై సూపర్‌ కింగ్స్‌)

క్రిస్‌ మోరిస్‌- 16.25 కోట్లు (2021,రాజస్తాన్‌ రాయల్స్‌)

నికోలస్‌ పూరన్‌- 16 కోట్లు (2023, లక్నో సూపర్‌ జెయింట్స్‌)

యువరాజ్‌ సింగ్‌-16 కోట్లు (2015, ఢిల్లీ డేర్‌ డెవిల్స్‌)

పాట్‌ కమిన్స్‌-15.5 కోట్లు (2020, కేకేఆర్‌)

ఇషాన్‌ కిషన్‌-15.25 కోట్లు (2022, ముంబై ఇండియన్స్‌)

కైల్‌ జేమీసన్‌-15 కోట్లు (2021, ఆర్సీబీ)

బెన్‌ స్టోక్స్‌-14.5 కోట్లు (2017, రైజింగ్‌ పూణే సూపర్‌ జెయింట్స్‌)

సీజన్ల వారీగా అత్యధిక ధర పలికిన ఆటగాళ్లు..

2023: సామ్‌ కర్రన్‌- 18.5 కోట్లు (పంజాబ్‌ కింగ్స్‌)

2022: ఇషాన్‌ కిషన్‌-15.25 కోట్లు (ముంబై ఇండియన్స్‌)

2021: క్రిస్‌ మోరిస్‌- 16.25 కోట్లు (రాజస్తాన్‌ రాయల్స్‌)

2020: పాట్‌ కమిన్స్‌-15.5 కోట్లు (కోల్‌కతా నైట్‌రైడర్స్‌‌)

2019: జయదేవ్‌ ఉనద్కత్‌, వరుణ్‌ చక్రవర్తి- 8.4 కోట్లు (RR, KXIP)

2018: బెన్‌ స్టోక్స్‌- 12.5 కోట్లు (రాజస్తాన్‌ రాయల్స్‌)

2017: బెన్‌ స్టోక్స్‌-14.5 కోట్లు (రైజింగ్‌ పూణే సూపర్‌ జెయింట్స్‌)

2016: షేన్‌ వాట్సన్‌- 9.5 కోట్లు (ఆర్సీబీ)

2015: యువరాజ్‌ సింగ్‌-16 కోట్లు (ఢిల్లీ డేర్‌ డెవిల్స్‌)

2014: యువరాజ్‌ సింగ్‌- 14 కోట్లు (ఆర్సీబీ)

2013: గ్లెన్‌ మ్యాక్స్‌వెల్‌- 6.3 కోట్లు (ముంబై ఇండియన్స్‌)

2012: రవీంద్ర జడేజా- 12.8 కోట్లు (సీఎస్‌కే)

2011: గౌతమ్‌ గంభీర్‌- 14.9 కోట్లు (కేకేఆర్‌)

2010: షేన్‌ బాండ్‌, కీరన్‌ పోలార్డ్‌- 4.8 కోట్లు (కేకేఆర్‌, ముంబై)

2009: కెవిన్‌ పీటర్సన్‌, ఆండ్రూ ఫ్లింటాఫ్‌- 9.8 కోట్లు (ఆర్సీబీ, సీఎస్‌కే)

2008: ఎంఎస్‌ ధోని- 9.5 కోట్లు (సీఎస్‌కే)

పది ఫ్రాంచైజీల వద్ద ఉన్న నగదు వివరాలు ..

గుజరాత్‌ టైటాన్స్‌ – రూ. 38.15 కోట్లు

– సన్‌ రైజర్స్‌ హైదరాబాద్‌ – రూ. 34 కోట్లు

– కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ – రూ. 32.7 కోట్లు

– చెన్నై సూపర్‌ కింగ్స్‌ – రూ. 31.4 కోట్లు

– పంజాబ్‌ కింగ్స్‌ – రూ. 29.1 కోట్లు

– ఢిల్లీ క్యాపిటల్స్‌ – రూ. 28.95 కోట్లు

– రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు – రూ. 23.25 కోట్లు

– ముంబై ఇండియన్స్‌ – రూ. 17.75 కోట్లు

– రాజస్తాన్‌ రాయల్స్‌ – రూ. 14.5 కోట్లు

– లక్నో సూపర్‌ జెయింట్స్‌ – రూ. 13.15 కోట్లు