Babar Azam: కోహ్లీ రికార్డు బ్రేక్‌పై పాక్ కెప్టెన్ బాబర్ ఆజం బిల్డప్ వ్యాఖ్యలు, మండిపడుతున్న నెటిజన్లు
ఇక ఇటీవలి టీ20 ర్యాంకింగ్స్‌లో అగ్ర స్థానాన్ని నిలబెట్టకున్న బాబర్ ఆజమ్ (Babar Azam) సరికొత్త రికార్డు నెలకొల్పిన సంగతి తెలిసిందే.
పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ ఆజం ఐసీసీ పురుషుల వన్డే, టీ20 ర్యాంకింగ్స్‌లో మొదటి స్థానంలో కొనసాగుతున్నాడు. ఇక ఇటీవలి టీ20 ర్యాంకింగ్స్‌లో అగ్ర స్థానాన్ని నిలబెట్టకున్న బాబర్ ఆజమ్ (Babar Azam) సరికొత్త రికార్డు నెలకొల్పిన సంగతి తెలిసిందే. కొత్తగా అత్యధిక కాలం నంబర్ 1 స్థానంలో ఉన్న బ్యాటర్‌గా నిలిచి టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లి రికార్డు బద్దలు కొట్టాడు. గతంలో కూడా కోహ్లి పేరిట ఉన్న పలు రికార్డులను బాబర్ ఆజం బ్రేక్ చేశాడు.
ఈ నేపథ్యంలో శ్రీలంకతో టెస్టు సిరీస్‌కు ముందు ప్రెస్‌మీట్‌లో ఎదురైన ప్రశ్నకు బాబర్ స్పందించిన విధానం వైరల్ అవుతోంది. కోహ్లి రికార్డు (Virat Kohli’s record) అధిగమించారు కదా అంటూ రిపోర్టర్ ప్రశ్నించగా.. ఏ రికార్డు అంటూ బాబర్ బదులిచ్చాడు. ఇంతలో తన తాజా రికార్డు (అత్యధిక కాలం నంబర్ 1 స్థానం) గుర్తుకు వచ్చి.. ‘‘ఇందుకు నేను దేవుడికి ధన్యవాదాలు చెప్పాలి. నా అద్భుత ప్రదర్శనల వెనుక ఎంతో కఠోర శ్రమ దాగి ఉంది’ అని చెప్పుకొచ్చాడు.
బాబర్ ఆజమ్ ఇలా స్పందించడంపై కొంతమంది నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు. కోహ్లి రికార్డులన్నీ బద్దలు కొట్టినట్లు తెగ బిల్డప్ ఇస్తున్నావు.. ఏవో కొన్ని రికార్డులు అధిగమించినంత మాత్రాన తనను దాటేసినట్లే అనుకోవద్దు. నువ్వు ఓపెనింగ్ బ్యాటర్‌వి.. కోహ్లి అలా కాదు. ఇంకా పరిమిత ఓవర్ల క్రికెట్‌లోనే కాదు టెస్టు క్రికెట్‌లోనూ కోహ్లి ది బెస్ట్ అని గుర్తుపెట్టుకో’’ అంటూ కామెంట్లు చేస్తున్నారు.