Birmingham, July 02: ఇంగ్లాండ్‌తో(England) జరుగుతోన్న ఐదో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో టీమ్‌ఇండియా(India) ఆట పూర్తయింది. లోయర్ ఆర్డర్ బ్యాట్స్‌మన్ రవీంద్ర జడేజా (Jadeja) (104; 194 బంతుల్లో 13x4) శతకం బాదాడు. 338/7 ఓవర్‌నైట్ స్కోర్‌తో శనివారం రెండోరోజు మహ్మద్ షమి(0)తో (Shami) కలిసి బ్యాటింగ్ ఆరంభించిన అతడు 183 బంతుల్లో 13 ఫోర్ల సాయంతో మూడంకెల స్కోర్ అందుకున్నాడు. ఈ క్రమంలోనే షమి(16; 31 బంతుల్లో 3x4)తో కలిసి ఎనిమిదో వికెట్‌కు 48 పరుగుల కీలక భాగస్వామ్యం నెలకొల్పాడు. అయితే.. స్టువర్ట్ బ్రాడ్ వేసిన 80వ ఓవర్ చివరి బంతికి షమి షాట్‌పిచ్ బంతిని గాల్లోకి ఆడి క్రాలే చేతికి చిక్కాడు. దీంతో టీమ్‌ఇండియా 371 పరుగుల వద్ద ఎనిమిదో వికెట్ కోల్పోయింది. కాసేపటికే జడ్డూ సైతం అండర్సన్ (Andarson) బౌలింగ్‌లో బౌల్డయ్యాడు. అప్పటికి జట్టు స్కోర్ 375/9గా నమోదైంది.
Innings Break!
Centuries from @RishabhPant17 (146) & @imjadeja (104) and an entertaining 31* from @Jaspritbumrah93 as #TeamIndia post 416 in the first innings.
Scorecard - https://t.co/xOyMtKJzWm #ENGvIND pic.twitter.com/M9RtB5Hu02
— BCCI (@BCCI) July 2, 2022
తర్వాత క్రీజులోకి వచ్చిన బుమ్రా (Bumrah) (31 నాటౌట్; 16 బంతుల్లో 4x4, 2x6) సంచలన బ్యాటింగ్ చేశాడు. బ్రాడ్ (Stuart Broad ) వేసిన 84వ ఓవర్‌లో చెలరేగిపోయాడు. ఆ ఓవర్‌లో (4, 5 వైడ్లు, 6 నోబాల్, 4, 4, 4, 6, 1) కొట్టడంతో 35 పరుగులు రాబట్టాడు. దీంతో టెస్టుల్లో ఒక ఓవర్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు. అయితే, అండర్సన్ వేసిన మరుసటి ఓవర్ ఐదో బంతికి సిరాజ్ (2) ఔటవ్వడంతో టీమ్‌ఇండియా ఇన్నింగ్స్‌కు తెరపడింది. దీంతో చివరికి భారత్ 416 పరుగులకు ఆలౌటైంది. అంతకుముందు తొలిరోజు టీమ్‌ఇండియా టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగగా 98 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఆ సయమంలో రిషభ్ పంత్ (146; 111 బంతుల్లో 20x4, 4x6), జడేజా ఆరో వికెట్‌కు 222 పరుగుల విలువైన భాగస్వామ్యం నెలకొల్పిన సంగతి తెలిసిందే. ఇలా టీమ్‌ఇండియా టెస్టుల్లో 100లోపే ఐదు వికెట్లు కోల్పోయాక 400 పైచిలుకు పరుగులు చేయడం ఇది మూడోసారి.
Kya yeh Yuvi hai ya Bumrah!?
2007 ki yaad dilaa di.. 😍@YUVSTRONG12 @Jaspritbumrah93 #ENGvIND pic.twitter.com/vv9rvrrO6K
— Sachin Tendulkar (@sachin_rt) July 2, 2022
ఒకే ఓవర్లో అత్యధిక పరుగులు..
* బుమ్రా (Jasprit Bumrah) 29 పరుగులు.. ఎక్స్‌ట్రా 6 పరుగులు (మొత్తం 35 రన్స్) స్టువర్ట్ బ్రాడ్ (Stuart Broad ) బౌలింగ్‌లో ఇదే మ్యాచ్‌లో.
* బ్రియాన్ లారా (Lara) 28 పరుగులు.. 2003లో జోహెనస్‌బర్గ్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో ఆర్ పీటర్సన్ బౌలింగ్‌లో.
* బెయిలీ 28 పరుగులు.. 2013లో పెర్త్ (Perth) వేదికగా జరిగిన మ్యాచ్‌లో జేమ్స్ అండర్సన్ బౌలింగ్‌లో.
* కేశవ్ మహారాజ్ 28 పరుగులు.. 2020లో పోర్ట్ ఎలిజబెత్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో జోరూట్ బౌలింగ్‌లో..
బ్రాడ్ vs బుమ్రా
ఫస్ట్ బాల్: ఫోర్
రెండో బాల్: 5 వైడ్స్
రెండో బాల్: సిక్స్ (నోబాల్)
రెండో బాల్: ఫోర్
మూడో బాల్: ఫోర్
నాలుగో బాల్: ఫోర్
ఐదో బాల్: సిక్స్
ఆరో బాల్: ఒక్క పరుగు
టెస్టుల్లో ఒక ఓవర్‌లో అత్యధిక పరుగుల జాబితా
35 జస్ప్రిత్ బుమ్రా (స్టువర్ట్ బ్రాడ్ బౌలింగ్‌లో) బర్మింగ్‌హామ్ 2022*
28 బ్రియన్ లారా (ఆర్ పీటర్సన్ బౌలింగ్‌లో) జొహెన్నెస్‌బర్గ్ 2003
28 జార్జ్ బెయిలీ (జేమ్స్ అండర్సన్ బౌలింగ్‌లో) పెర్త్ 2013
28 కేశవ్ మహారాజ్ (జో రూట్ బౌలింగ్‌లో) పోర్ట్ ఎలిజిబెత్ 2020
యువరాజ్‌సింగ్ 2007 టీ 20 ప్రపంచకప్‌లో స్టువర్ట్ బ్రాడ్ బౌలింగ్‌లోనే ఆరు బంతుల్లో ఆరు సిక్సర్లు కొట్టి సరికొత్త రికార్డు సృష్టించాడు. దీంతో టీ20ల్లో ఒకే ఓవర్లో అత్యధిక పరుగులు ఇచ్చిన బౌలర్‌గా చెత్త రికార్డు బ్రాడ్ మూటగట్టుకున్నాడు. తాజాగా ఈ టెస్టు మ్యాచ్‌లో బుమ్రాకు 35 పరుగులు సమర్పించుకున్నాడు. దీంతో టెస్టు, టీ 20ల్లో ఒకే ఓవర్లో అత్యధిక పరుగులు ఇచ్చిన బౌలర్‌గా నిలిచాడు. వన్డేల్లో నెదర్లాండ్ బౌలర్ డీఎల్‌ఎస్ వాన్ బంజ్ ఒకే ఓవర్లో అత్యధిక పరుగులు (36) ఇచ్చాడు. ఇతడి బౌలింగ్‌లోనే దక్షిణాఫ్రికా బ్యాటర్ హర్షల్ గిబ్స్ ఆరు బంతుల్లో ఆరు సిక్సర్లు కొట్టాడు.