Kapil Dev on Rohit Form: రోహిత్...పేరుతో ఎక్కువ కాలం ఉండలేవు, పరుగుల సాధించాల్సిందే, దంటే అవకాశాలు తగ్గిపోతాయని తెలిపిన మాజీ కెప్టెన్ కపిల్ దేవ్
File Image | Kapil Dev | (Photo Credits: Getty Images)

Kapil Dev questions Rohit sharma's form: టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ బ్యాటింగ్ లో విఫలమవుతూ వస్తూ ఉండటంతో అతడు పెద్ద ఎత్తున విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తోంది.ఈ క్రమంలో జులై 1 నుంచి ఇంగ్లండ్ గడ్డపై ఆతిథ్య జట్టుతో భారత టెస్ట్ జట్టు ఒక మ్యాచ్ ఆడనుంది. రోహిత్ శర్మ బ్యాటింగ్ పై కపిల్ దేవ్ స్పందిస్తూ.. రోహిత్ నిజంగా తెలివైన వాడు.

అందులో సందేహం లేదు. 14 మ్యాచుల్లో ఒక్క ఫిఫ్టీ కూడా చేయకపోతే ప్రశ్నలు ఎదురవుతాయి. అది గ్యారీ సోబర్స్, డాన్ బ్రాడ్ మ్యాన్, విరాట్ కోహ్లీ, సచిన్ టెండుల్కర్, సునీల్ గవాస్కర్ లేదా రిచర్జ్స్ అయినా కావచ్చు. ఏం జరుగుగుతుందన్నది రోహితే చెప్పాలి. క్రికెట్ ఆడడం ఎక్కువైపోయిందా? లేక ఆటను ఆస్వాదించడం ఆపేశాడా? అని ప్రశ్నించాడు.

ప్రపంచ క్రికెట్లో ఇండియానే రారాజు, అందుకే బీసీసీఐ ఏది చెబితే అదే జరుగుతుంది, పాక్ మాజీ క్రికెటర్ షాహిద్‌ ఆఫ్రిది సంచలన వ్యాఖ్యలు

రోహిత్, విరాట్ కోహ్లీ వంటి ఆటగాళ్లు ఆటను కచ్చితంగా ఆస్వాదించాలి. ఆ ఆటగాళ్ల ద్వయం చెత్త ప్రదర్శన కొనసాగిస్తుంటే విమర్శకులు మౌనంగా కూర్చోలేరు. కేవలం పేరుతో ఎక్కువ కాలం కొనసాగలేరు. పరుగులు సాధించాల్సిందే. లేదంటే అవకాశాలు తగ్గిపోతాయి’’ అని కపిల్ దేవ్ అన్నారు. రోహిత్ మాదిరే విరాట్ కోహ్లీ సైతం ఐపీఎల్ 2022 లో మెప్పించేలా ఆడడంలో విఫలమయ్యాడు. కెప్టెన్సీ బాధ్యతలు వదిలేసినా కానీ, అతడు బ్యాటింగ్ తీరు మారలేదు.