IPL 2022: రింకూ సింగ్ మెరుపులు, నాలుగో విజయం నమోదు చేసుకున్న కోల్‌కతా నైట్‌ రైడర్స్‌, 7 వికెట్ల తేడాతో రాజస్థాన్‌ రాయల్స్‌పై విజయం

సోమవారం జరిగిన పోరులో కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ 7 వికెట్ల తేడాతో రాజస్థాన్‌ రాయల్స్‌పై విజయం సాధించింది. మొదట బ్యాటింగ్‌ చేసిన రాజస్థాన్‌ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 152 పరుగులు చేసింది

Rinku Singh and Nitish Rana (Photo credit: Twitter)

కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ ఐపీఎల్‌-15వ సీజన్‌లో నాలుగో విజయం నమోదు చేసుకుంది. సోమవారం జరిగిన పోరులో కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ 7 వికెట్ల తేడాతో రాజస్థాన్‌ రాయల్స్‌పై విజయం సాధించింది. మొదట బ్యాటింగ్‌ చేసిన రాజస్థాన్‌ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 152 పరుగులు చేసింది. కెప్టెన్‌ సంజూ శాంసన్‌ (49 బంతుల్లో 54; 7 ఫోర్లు, ఒక సిక్సర్‌) హాఫ్‌సెంచరీతో ఆకట్టుకోగా.. హెట్‌మైర్‌ (13 బంతుల్లో 27 నాటౌట్‌; ఒక ఫోర్‌, 2 సిక్సర్లు) ఆఖర్లో వేగంగా పరుగులు రాబట్టాడు.

కోల్‌కతా బౌలర్లలో సౌథీ రెండు, ఉమేశ్‌, శివమ్‌, అనుకూల్‌ రాయ్‌ తలా ఒక వికెట్‌ పడగొట్టారు. అనంతరం లక్ష్య ఛేదనలో కోల్‌కతా 19.1 ఓవర్లలో 3 వికెట్లకు 158 పరుగులు చేసింది. నితీశ్‌ రాణా (48 నాటౌట్‌; 3 ఫోర్లు, 2 సిక్సర్లు), రింకూ సింగ్‌ (23 బంతుల్లో 42 నాటౌట్‌; 6 ఫోర్లు, ఒక సిక్సర్‌), కెప్టెన్‌ శ్రేయస్‌ అయ్యర్‌ (34) రాణించారు. రాజస్థాన్‌ బౌలర్లలో బౌల్ట్‌, ప్రసిద్ధ్‌ కృష్ణ, కుల్దీప్‌ సేన తలా ఒక వికెట్‌ పడగొట్టారు.

పోనీలే.. మరోసారి నన్ను అవుట్ చేయడానికి ట్రై చెయ్‌, చహల్‌కు హగ్‌ ఇచ్చి ఓదార్చిన సూర్యకుమార్‌

వరుసగా విఫలమవుతున్న వెంకటేశ్‌ అయ్యర్‌ను తప్పించిన కోల్‌కతా ఫ్రాంచైజీ.. అతడి స్థానంలో అనుకూల్‌ రాయ్‌కు తుదిజట్టులో అవకాశమచ్చింది. గత సీజన్‌లో తన అద్వితీయ ప్రదర్శనతో జట్టును ఫైనల్‌ చేర్చిన వెంకటేశ్‌ అయ్యర్‌ ఈసారి బ్యాటింగ్‌, బౌలింగ్‌ రెండింట్లోనూ విఫలమవుతున్న విషయం తెలిసిందే. రింకూ సింగ్‌కు ‘మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌’అవార్డు దక్కింది. లీగ్‌లో భాగంగా మంగళవారం గుజరాత్‌తో పంజాబ్‌ తలపడనుంది.



సంబంధిత వార్తలు