Krunal Pandya Tests Positive: భారత్ టీంలో కరోనా కలకలం, కోవిడ్ బారీన పడిన ఆల్‌రౌండ‌ర్ కృనాల్ పాండ్యా, రెండో టీ20 జూలై 28కి వాయిదా, ఐసోలేష‌న్‌లోకి వెళ్లిన రెండు జట్లు

ఆల్‌రౌండ‌ర్ కృనాల్ పాండ్యా (Krunal Pandya Tests Positive) కోవిడ్ వైర‌స్ బారిన ప‌డ్డాడు. దీంతో మంగ‌ళ‌వారం జ‌ర‌గాల్సిన రెండో టీ20ని వాయిదా ( T20I Postponed to July 28) వేశారు. ప్ర‌స్తుతం రెండు జ‌ట్లూ ఐసోలేష‌న్‌లో ఉన్నాయి.

Krunal Pandya (Photo Credits: Twitter@krunalpandya24)

New Delhi, July 27: శ్రీలంక టూర్‌లో ఉన్న భారత్ టీమ్‌లో క‌రోనా క‌ల‌క‌లం రేపింది. ఆల్‌రౌండ‌ర్ కృనాల్ పాండ్యా (Krunal Pandya Tests Positive) కోవిడ్ వైర‌స్ బారిన ప‌డ్డాడు. దీంతో మంగ‌ళ‌వారం జ‌ర‌గాల్సిన రెండో టీ20ని వాయిదా ( T20I Postponed to July 28) వేశారు. ప్ర‌స్తుతం రెండు జ‌ట్లూ ఐసోలేష‌న్‌లో ఉన్నాయి. కృనాల్‌తో సన్నిహితంగా మెలిగిన ఇతర ఆటగాళ్లను చాలా దగ్గరగా పర్యవేక్షిస్తున్నారు. ఒక‌వేళ టీమ్స్‌లోని అంద‌రు ప్లేయ‌ర్స్ నెగటివ్‌గా తేలితే.. బుధ‌వారం ఈ రెండో టీ20 (India vs Sri Lanka Second T20I) నిర్వ‌హిస్తారు.

ఆదివారం జ‌రిగిన తొలి టీ20లో ఇండియా 38 ప‌రుగుల‌తో గెలిచిన విష‌యం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో కృనాల్ ఆడాడు. రెండు ఓవ‌ర్ల‌లో 3 ప‌రుగులు ఇచ్చి ఒక వికెట్ తీశాడు. రెండు రోజుల ముందే అత‌డు రెండు టీమ్స్‌లోని ప్లేయ‌ర్స్‌తో క‌లిసి ఆడాడు. దీంతో ఇంగ్లండ్‌లో ఉన్న టెస్ట్ టీమ్‌తో క‌ల‌వాల్సిన‌ ఉన్న సూర్య‌కుమార్ యాద‌వ్‌, పృథ్వి షా ప్ర‌యాణంపై ఇది ప్ర‌భావం చూప‌నుంది. ఈ ఇద్ద‌రూ అక్క‌డ గాయ‌ప‌డిన శుభ్‌మ‌న్ గిల్‌, వాషింగ్ట‌న్ సుంద‌ర్ స్థానాల్లో వెళ్లాల్సి ఉంది.

టీవీ కెమెరాల ముందే నన్ను పెళ్లి చేసుకుంటావా అంటూ ప్లేయర్‌కి ప్రపోజ్ చేసిన కోచ్, వెంటనే ఒకే చెప్పిన ప్లేయర్, సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌ అవుతున్న వీడియో

శ్రీలంకతో జరుగుతున్న మూడు మ్యాచ్‌ల టి20 సిరీస్‌లో భారత్‌ శుభారంభం చేసింది. ఆదివారం జరిగిన తొలి టి20లో (IND vs SL 1st T20I 2021) టీమిండియా 38 పరుగుల తేడాతో శ్రీలంకపై విజయం (India Register Comprehensive Win) సాధించింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన భారత్‌ 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 164 పరుగులు చేసింది. సూర్యకుమార్‌ యాదవ్‌ (34 బంతుల్లో 50; 5 ఫోర్లు, 2 సిక్స్‌లు) తన ఫామ్‌ను కొనసాగిం చాడు.

టోక్యోలో కరోనా కల్లోలం, అత్యధికంగా ఒక్కరోజే 2,848 కేసులు నమోదు, ఒలింపిక్స్ గేమ్స్ ప్రారంభమైన తర్వాత జపాన్ రాజధానిలో పంజా విప్పిన కోవిడ్, ఆందోళనకరంగా మారిన డెల్టా వేరియంట్

శిఖర్‌ ధావన్‌ (36 బంతుల్లో 46; 4 ఫోర్లు, 1 సిక్స్‌) రాణించాడు. ఛేజింగ్‌లో శ్రీలంక 18.3 ఓవ ర్లలో 126 పరుగులకు ఆలౌటైంది. చరిత్‌ అసలంక (26 బంతుల్లో 44; 3 ఫోర్లు, 3 సిక్స్‌లు) జట్టు గెలుపు కోసం ఒంటరి పోరాటం చేశాడు. ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ భువనేశ్వర్‌ (4/22) ప్రత్యర్థిని పడగొట్టడంలో కీలకపాత్ర పోషించాడు. దీపక్‌ చహర్‌ (2/24) అతనికి చక్కటి సహకారం అందించాడు.