KXIP vs SRH Stat Highlights: ఒత్తిడితో చిత్తయిన హైదరాబాద్, 12 పరుగుల తేడాతో పంజాబ్ గెలుపు, ఐపీఎల్‌లో వంద వికెట్ల క్లబ్ లోకి చేరిన సందీప్ శర్మ

ఐపీఎల్‌–2020లో మరో గేమ్ ఆసక్తికర సాగింది. గెలవాల్సిన స్థితిలో ఉండి కూడా హైదరాబాద్‌ జట్టు చేజేతులా ఓటమితో మ్యాచ్ ని ముగించింది. శనివారం జరిగిన ఈ మ్యాచ్‌లో (KXIP vs SRH Stat Highlights) కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌ 12 పరుగుల తేడాతో సన్‌రైజర్స్‌ను ఓడించింది. ఛేజింగ్ చేయాల్సిన మ్యాచ్ లో (IPL 2020) బ్యాట్స్ మెన్లు చేతులెత్తేశారు. కింగ్స్‌ పంజాబ్‌ 126 పరుగుల స్కోరును కాపాడుకుని భళా అనిపించింది. చివరి మూడు ఓవర్లలో 20 పరుగులు చేస్తే విజయం సాధించే దశలో హైదరాబాద్ ఆరెంజ్‌ ఆర్మీ తేలిపోయింది.

Sandeep Sharma (Photo Credits: IANS)

ఐపీఎల్‌–2020లో మరో గేమ్ ఆసక్తికర సాగింది. గెలవాల్సిన స్థితిలో ఉండి కూడా హైదరాబాద్‌ జట్టు చేజేతులా ఓటమితో మ్యాచ్ ని ముగించింది. శనివారం జరిగిన ఈ మ్యాచ్‌లో (KXIP vs SRH Stat Highlights) కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌ 12 పరుగుల తేడాతో సన్‌రైజర్స్‌ను ఓడించింది. ఛేజింగ్ చేయాల్సిన మ్యాచ్ లో (IPL 2020) బ్యాట్స్ మెన్లు చేతులెత్తేశారు. కింగ్స్‌ పంజాబ్‌ 126 పరుగుల స్కోరును కాపాడుకుని భళా అనిపించింది. చివరి మూడు ఓవర్లలో 20 పరుగులు చేస్తే విజయం సాధించే దశలో హైదరాబాద్ ఆరెంజ్‌ ఆర్మీ తేలిపోయింది.

టాస్‌ గెలిచిన ఎస్‌ఆర్‌హెచ్‌ ఫీల్డింగ్‌ తీసుకోవడంతో పంజాబ్‌కు (Kings XI Punjab) బ్యాటింగ్‌కు దిగింది. కింగ్స్‌ పంజాబ్‌ ఇన్నింగ్స్‌ను కేఎల్‌ రాహుల్‌, మనదీప్‌ సింగ్‌లు ఆరంభించారు. మయాంక్‌ అగర్వాల్‌ స్థానంలో జట్టులోకి వచ్చిన మన్‌దీప్‌ సింగ్‌(17) నిరాశపరిచాడు. సందీప్‌ శర్మ బౌలింగ్‌లో రషీద్‌ ఖాన్‌కు క్యాచ్‌ ఇచ్చి పెవిలియన్‌ చేరాడు. ఆ తర్వాత రాహుల్‌-క్రిస్‌ గేల్‌ల జోడి ఇన్నింగ్స్‌ను ముందుకు తీసుకెళ్లింది.అయితే జట్టు స్కోరు 66 పరుగుల వద్ద ఉండగా గేల్‌(20;20 బంతుల్లో 2 ఫోర్లు, 1సిక్స్‌) రెండో వికెట్‌గా ఔటయ్యాడు. హోల్డర్‌ వేసిన 10 ఓవర్‌ ఆఖరి బంతికి భారీ షాట్‌ ఆడబోయిన గేల్‌.. వార్నర్‌ క్యాచ్‌ పట్టడంతో నిష్క్రమించాడు. ఆపై తదుపరి ఓవర్‌లో రాహుల్‌(27; 27 బంతుల్లో 2 ఫోర్లు, 1సిక్స్‌) ఔటయ్యాడు. రషీద్‌ ఖాన్‌ బౌలింగ్‌లో బౌల్డ్‌ అయ్యాడు. ఆ తర్వాత కింగ్స్‌ తిరిగి తేరుకోలేకపోయింది. మ్యాక్స్‌వెల్‌(12), దీపక్‌ హుడా(0), క్రిస్‌ జోర్డాన్‌(7), మురుగన్‌ అశ్విన్‌(4)లు విఫలయ్యారు. కాగా, నికోలస్‌ పూరన్‌(32 నాటౌట్‌; 28 బంతుల్లో 2 ఫోర్లు) కడవరకూ క్రీజ్‌లో ఉండటంతో వంద పరుగుల మార్కును చేరింది కింగ్స్‌ పంజాబ్‌. ఎస్‌ఆర్‌హెచ్‌ బౌలర్లలో సందీప్‌ శర్మ, హోల్డర్‌, రషీద్‌ ఖాన్‌లు తలో రెండు వికెట్లు సాధించారు. కింగ్స్‌ పంజాబ్‌ నిర్ణీత ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 126 పరుగులు చేసింది.

ఘోర పరాభవంతో ఐపీఎల్ నుంచి చెన్నై ఔట్! ముంబైతో జరిగిన మ్యాచ్‌లో చతికిల పడిన ధోనీ సేన, 10 వికెట్ల తేడాతో ముంబై జయకేతనం

లక్ష్య ఛేదనలో ఎస్‌ఆర్‌హెచ్‌ (Sunrisers Hyderabad) ఇన్నింగ్స్‌ను డేవిడ్‌ వార్నర్‌-బెయిర్‌ స్టోలు ధాటిగా ఆరంభించారు. ఈ జోడి 56 పరుగుల జత చేసిన తర్వాత వార్నర్‌(35; 20 బంతుల్లో 3 ఫోర్లు, 2సిక్స్‌లు) తొలి వికెట్‌గా పెవిలియన్‌ చేరాడు. స్పిన్నర్‌ రవి బిష్నోయ్‌ వేసిన ఏడో ఓవర్‌ రెండో బంతికి రాహుల్‌కు క్యాచ్‌ వార్నర్‌ ఔటయ్యాడు. ఆపై వెంటనే బెయిర్‌ స్టో(19; 20 బంతుల్లో 4ఫోర్లు) రెండో వికెట్‌గా పెవిలియన్‌ చేరాడు. మురుగన్‌ అశ్విన్‌ వేసిన ఎనిమిదో ఓవర్‌ రెండో బంతికి బెయిర్‌ స్టో బౌల్డ్‌ అయ్యాడు. అబ్దుల్‌ సామద్‌(7; 5 బంతుల్లో 1 ఫోర్‌) ఇలా వచ్చి అలా వెళ్లిపోయాడు. దాంతో 67 పరుగుల వద్ద మూడో వికెట్‌ను కోల్పోయింది సన్‌రైజర్స్‌. ఆ తరుణంలో మనీష్‌ పాండేకు విజయ్‌ శంకర్‌ జత కలిశాడు. వీరిద్దరూ 33 పరుగుల జత చేసిన తర్వాత మనీష్‌ పాండే పెవిలియన్‌ చేరగా, ఆ తర్వాత స్వల్ప విరామాల్లో వికెట్లను చేజార్చుకుని పరాజయం పాలైంది. 19.5 ఓవర్లలో 114 పరుగులకే సన్‌రైజర్స్‌ చాపచుట్టేసింది. ఆరుగురు సన్‌రైజర్స్‌ ఆటగాళ్లు సింగిల్‌ డిజిట్‌కే పరిమితమయ్యారు.

మనీష్‌ పాండే ఔట్‌ అయ్యే సమయానికి సన్‌రైజర్స్‌కు 27 పరుగులు అవసరం . క్రిస్‌ జోర్డాన్‌ వేసిన 17 ఓవర్‌ తొలి బంతిని వైడ్‌ వేయగా అక్కడ పరుగు వచ్చింది. ఆ తర్వాత అదే బంతికి మనీష్‌ పాండే భారీ షాట్‌ ఆడాడు. అది సిక్స్‌గా మారే చివరి నిమిషంలో సబ్‌స్టిట్యూట్‌ ఫీల్డర్‌ సుచిత్‌ పరుగెత్తుకుంటూ వచ్చి ఒక్క జంప్‌తో దాన్ని క్యాచ్‌ తీసుకున్నాడు. బౌండరీ లైన్‌ చాలా సమీపంగా వెళ్లిన సుచిత్‌ క్యాచ్‌ పట్టిన తీరు శభాష్‌ అనిపించింది. అక్కడే మ్యాచ్‌ టర్న్‌ అయిపోయింది. అర్షదీప్‌ సింగ్‌ వేసిన 18 ఓవర్‌ ఐదో బంతికి విజయ్‌ శంకర్‌(26; 27 బంతుల్లో 4 ఫోర్లు) ఔట్‌ కావడంతో సన్‌రైజర్స్‌పై ఒత్తిడి పెరిగింది. జోర్డాన్‌ వేసిన 19 ఓవర్‌ మూడో బంతికి హోల్డర్‌(5) ఔట్‌ కాగా, ఆ మరుసటి బంతికి రషీద్‌ ఖాన్‌ డకౌట్‌ అయ్యాడు. దాంతో ఆరు బంతుల్లో 14 పరుగులు అవసరమయ్యాయి. ఆ తరుణంలో ‌ చివరి ఓవర్‌ వేసిన అర్షదీప్ పరుగు మాత్రమే ఇచ్చి మూడు వికెట్లు సాధించాడు. దాంతో కింగ్స్‌ పంజాబ్‌ విజయం సాధించగా, సన్‌రైజర్స్‌ ఓటమి పాలైంది.

కింగ్స్‌ పంజాబ్‌ బౌలర్లలో అర్షదీప్‌ సింగ్‌, జోర్డాన్‌లు తలో మూడు వికెట్లు సాధించగా, మహ్మద్‌ షమీ, మురుగన్‌ అశ్విన్‌, రవి బిష్నోయ్‌లకు వికెట్‌ చొప్పున లభించింది. ఇది కింగ్స్‌ పంజాబ్‌కు ఐదో విజయం కాగా, సన్‌రైజర్స్‌కు ఏడో ఓటమి. ఇది కింగ్స్‌ పంజాబ్‌కు వరుసగా నాల్గో విజయం కావడం విశేషం. తాజా విజయంతో (Kings XI Punjab vs Sunrisers Hyderabad) కింగ్స్‌ పంజాబ్‌ ప్లే ఆఫ్‌ ఆశలను సజీవంగా ఉంచుకోగా, హైదరాబాద్‌ పరిస్థితి క్లిష్టంగా మారింది.

స్కోరు వివరాలు

కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌ ఇన్నింగ్స్‌: రాహుల్‌ (బి) రషీద్‌ 27; మన్‌దీప్‌ (సి) రషీద్‌ (బి) సందీప్‌ 17; గేల్‌ (సి) వార్నర్‌ (బి) హోల్డర్‌ 20; పూరన్‌ (నాటౌట్‌) 32; మ్యాక్స్‌వెల్‌ (సి) వార్నర్‌ (బి) సందీప్‌ 12; దీపక్‌ హుడా (స్టంప్డ్‌) బెయిర్‌స్టో (బి) రషీద్‌ 0; జోర్డాన్‌ (సి) ఖలీల్‌ (బి) హోల్డర్‌ 7; మురుగన్‌ అశ్విన్‌ (రనౌట్‌) 4; రవి బిష్ణోయ్‌ (నాటౌట్‌) 0; ఎక్స్‌ట్రాలు 7; మొత్తం (20 ఓవర్లలో 7 వికెట్లకు) 126.

వికెట్ల పతనం: 1–37; 2–66; 3–66; 4–85; 5–88; 6–105; 7–110.

బౌలింగ్‌: సందీప్‌ శర్మ 4–0–29–2; ఖలీల్‌ 4–0–31–0; హోల్డర్‌ 4–0–27–2; రషీద్‌ ఖాన్‌ 4–0–14–2; నటరాజన్‌ 4–0–23–0.

సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ ఇన్నింగ్స్‌: వార్నర్‌ (సి) రాహుల్‌ (బి) బిష్ణోయ్‌ 35; బెయిర్‌స్టో (బి) అశ్విన్‌ 19; పాండే (సి) (సబ్‌) సుచిత్‌ (బి) జోర్డాన్‌ 15; సమద్‌ (సి) జోర్డాన్‌ (బి) షమీ 7; శంకర్‌ (సి) రాహుల్‌ (బి) అర్‌‡్షదీప్‌ 26; హోల్డర్‌ (సి) మన్‌దీప్‌ (బి) జోర్డాన్‌ 5; గార్గ్‌ (సి) జోర్డాన్‌ (బి) అర్‌‡్షదీప్‌ 3; రషీద్‌ (సి) పూరన్‌ (బి) జోర్డాన్‌ 0; సందీప్‌ (సి) అశ్విన్‌ (బి) అర్‌‡్షదీప్‌ 0; నటరాజన్‌ (నాటౌట్‌) 0; ఖలీల్‌ (రనౌట్‌) 0; ఎక్స్‌ట్రాలు 4; మొత్తం (19.5 ఓవర్లలో ఆలౌట్‌) 114.

వికెట్ల పతనం: 1–56; 2–58; 3–67; 4–100; 5–110; 6–112; 7–112; 8–114; 9–114; 10–114.

బౌలింగ్‌: షమీ 4–0–34–1; అర్‌‡్షదీప్‌ 3.5–0–23–3; అశ్విన్‌ 4–0–27–1; బిష్ణోయ్‌ 4–0–13–1; జోర్డాన్‌ 4–0–17–3.

(Social media brings you the latest breaking news, viral news from the world of social media including Twitter, Instagram and YouTube. The above post is embedded directly from the user's social media account. This body of content has not been edited or may not be edited by Latestly staff. Opinions appearing on social media posts and the facts do not reflect the opinions of Latestly, and Latestly assumes no responsibility for the same.)

Share Now

సంబంధిత వార్తలు

Ghatkesar Car Catches Fire Case: ఘట్‌కేసర్‌ కారు ప్రమాదంలో నివ్వెరపోయే నిజాలు, బంధువు బ్లాక్ మెయిల్ కారణంగా మంటల్లో కాలి లోకాన్ని వీడిన లవర్స్

Aramghar-Zoo Park Flyover: వీడియో ఇదిగో, ఆరాంఘర్‌-జూపార్క్‌ ఫ్లై ఓవర్‌కు మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ పేరు, హైదరాబాద్‌లోనే రెండో అతిపెద్ద ఫ్లై ఓవర్ ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి

Rare Feat By Pushpa 2: జూనియర్ ఎన్టీఆర్, రామ్‌ చరణ్‌ రికార్డులను బద్దలు కొట్టిన అల్లు అర్జున్, అరుదైన ఫీట్ సాధించిన తొలి భారతీయ చిత్రంగా పుష్ప-2

HYDRA Complaints: అక్రమ నిర్మాణాలకు సంబంధించి ప్రతి సోమవారం ఉదయం 11 నుంచి సాయంత్రం 5 వరకు ఫిర్యాదులు స్వీకరిస్తాం... అక్రమాలపై హైడ్రా కమిషనర్ రంగనాథ్

Share Now