Latest ICC Rankings: హార్దిక్ పాండ్యాకు భారీ షాక్, ప్రపంచ నంబర్ వన్ టీ20 ఆల్‌రౌండ‌ర్‌గా లియామ్ లివింగ్‌స్టోన్, రెండో స్థానానికి పడిపోయిన మార్క‌స్ స్టోయినిస్‌

ఆస్ట్రేలియాతో జరిగిన టీ20 సిరీస్‌లో అత్యుత్తమ ప్రదర్శన కనబర్చిన లివింగ్‌స్టోన్ పాయింట్ల పట్టికలో ఆటగాళ్లందరినీ అధిగమించి మొదటి స్థానాన్ని కైవసం చేసుకున్నాడు.

iam Livingstone (Photo credit: Twitter)

ICC కొత్త T20 ర్యాంకింగ్స్ జాబితాను విడుదల చేసింది, ఇందులో ఇంగ్లాండ్ ఆల్ రౌండర్ లియామ్ లివింగ్‌స్టోన్ గెలిచాడు. ఆస్ట్రేలియాతో జరిగిన టీ20 సిరీస్‌లో అత్యుత్తమ ప్రదర్శన కనబర్చిన లివింగ్‌స్టోన్ పాయింట్ల పట్టికలో ఆటగాళ్లందరినీ అధిగమించి మొదటి స్థానాన్ని కైవసం చేసుకున్నాడు.

లివింగ్‌స్టోన్ ఇంతకు ముందు ICC ఆల్ రౌండర్ ర్యాంకింగ్స్‌లో 7వ స్థానంలో ఉన్నాడు. కానీ ఆస్ట్రేలియాతో ఆడిన టీ20 సిరీస్‌లో అతను మంచి ప్రదర్శన చేశాడు. లివింగ్‌స్టోన్ బ్యాట్‌తో పాటు బంతితోనూ తన ప్రతిభను చాటుకున్నాడు. ఇప్పుడు ఐసీసీ ర్యాంకింగ్స్‌లో మొదటి స్థానాన్ని కైవసం చేసుకున్నాడు. తాజా ర్యాంకింగ్స్‌లో, అతను 253 రేటింగ్‌తో నంబర్ 1 స్థానానికి చేరుకున్నాడు.

హార్దిక్ పాండ్యా అంతకుముందు నంబర్ 1 స్థానంలో ఉన్నాడు. కానీ ఇటీవల శ్రీలంకతో ఆడిన T-20 సిరీస్‌లో అతని ప్రదర్శన అంతగా లేదు. దీంతో అతను నంబర్ 1 నుంచి 7వ స్థానానికి దిగజారాల్సి వచ్చింది.టీ-20 ఐసీసీ ఆల్ రౌండర్ ర్యాంకింగ్స్‌లో ఆస్ట్రేలియాకు చెందిన మార్కస్ స్టోయినిస్ 211 పాయింట్లతో రెండో స్థానంలో ఉన్నాడు. సికందర్ రజా 208 పాయింట్లతో మూడో స్థానంలో ఉండగా, షకీబ్ అల్ హసన్ 206 పాయింట్లతో నాలుగో స్థానంలో కొనసాగుతున్నాడు.

దంచికొట్టిన డికాక్, వీడియో చూస్తే షాకవడం పక్కా!

ఇంగ్లండ్, ఆస్ట్రేలియా మ‌ధ్య ముగిసిన మూడు టీ20ల సిరీస్‌లో లివింగ్‌స్టోన్ రెచ్చిపోయాడు. మొద‌టి టీ20లో మొద‌ట 27 బంతుల్లో 37 ర‌న్స్ కొట్టిన అత‌డు.. అనంత‌రం బంతితోనూ చెల‌రేగాడు. ఆసీస్ బ్యాట‌ర్ల‌ను బుట్ట‌లో వేసుకొని 322 గ‌ణాంకాలతో ఆక‌ట్టుకున్నాడు. ఇక రెండో టీ20లోనూ ఈ ఆల్‌రౌండ‌ర్ కంగారూల‌ను వ‌ణికించాడు. తొలుత 47 బంతుల్లోనే 87 ప‌రుగులు రాబ‌ట్టిన అత‌డు ఆ త‌ర్వాత రెండు కీల‌క వికెట్లు తీసి ‘ప్లేయ‌ర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డుకి ఎంపిక‌య్యాడు. నిర్ణ‌యాత్మ‌క మూడో టీ20 వ‌ర్షం కార‌ణంగా ర‌ద్దు కావ‌డంతో ఇరుజట్లు సిరీస్‌ను పంచుకున్నాయి.

లివింగ్‌స్టోన్ ఐపీఎల్‌లో కూడా పాపుల‌ర్ అయ్యాడు. 2021లో రాజ‌స్థాన్ రాయ‌ల్స్‌ (Rajasthan Royals)కు ఆడిన ఈ ఆల్‌రౌండ‌ర్ ఆ త‌ర్వాత పంజాబ్ కింగ్స్‌(Punjab Kings)కు మారాడు. 2022 వేలంలో పంజాబ్ అత‌డిని రూ.11.50 కోట్ల భారీ ధ‌ర‌కు కొన్న‌ది. అయితే.. లివింగ్‌స్టోన్ ఒక‌టి రెండు మ్యాచుల్లో మిన‌హా పెద్ద‌క రాణించ‌లేదు.



00" height="600" layout="responsive" type="mgid" data-publisher="bangla.latestly.com" data-widget="1705935" data-container="M428104ScriptRootC1705935" data-block-on-consent="_till_responded"> @endif