MI vs CSK Highlights: చెలరేగిన రహానే, సొంతగ్రౌండ్‌లో చెన్నై విధ్వంసం, 7 వికెట్ల తేడాతో సీఎస్కే ఘనవిజయం
సొంత గ్రౌండ్‌లో గెలిచి బోణీ కొట్టాలనుకున్న ముంబై ఇండియన్స్‌కు షాకిచ్చింది. రోహిత్ శర్మ సేనపై 7 వికెట్ల తేడాతో గెలిచింది. అజింక్యా రహానే(61) అర్ధ శతకంతో చెలరేగాడు.
Chennai, April 08: ఐపీఎల్ 16వ సీజన్‌లో చెన్నై సూపర్ కింగ్స్ (Chennai Super Kings) వరుసగా రెండో విజయం సాధించింది. సొంత గ్రౌండ్‌లో గెలిచి బోణీ కొట్టాలనుకున్న ముంబై ఇండియన్స్‌కు షాకిచ్చింది. రోహిత్ శర్మ సేనపై 7 వికెట్ల తేడాతో గెలిచింది. అజింక్యా రహానే(61) అర్ధ శతకంతో చెలరేగాడు. అతను ఔటయ్యాక అంబటి రాయుడు(20), రుతురాజ్ గైక్వాడ్(40) అజేయంగా నిలిచి జట్టును గెలిపించారు. ముంబైకి ఇది వరుసగా రెండో ఓటమి. లక్ష్య ఛేదనలో ఖాతా తెరవకుండానే చెన్నై తొలి వికెట్ కోల్పోయింది. ఓపెనర్ డెవాన్ కాన్వే డకౌట్ అయ్యాడు. ఆ తర్వాత అజింక్యా రహానే(61) విశ్వరూపం చూపించాడు. రహానే ఔటయ్యాక… శివం దూబే(28), రుతురాజ్ గైక్వాడ్(29) మూడో వికెట్‌కు 43 రన్స్ జోడించారు. అర్షద్ ఖాన్ వేసిన 19వ ఓవర్‌లో అంబటి రాయుడు(20) బౌండరీ కొట్టి మ్యాచ్ ముగించాడు. ముంబై బౌలర్లలో జాసన్ బెహ్రెండార్ఫ్, పీయూష్ చావ్లా, కుమార్ కార్తికేయ తలా ఒక వికెట్ తీశారు. వికెట్ తీశారు.
అర్షద్ ఖాన్ వేసిన నాలుగో ఓవర్‌లో అజింక్యా రహానే రెచ్చిపోయాడు. మొదటి బంతిని స్టాండ్స్‌లోకి పంపాడు. తర్వాతి వరుసగా నాలుగు బంతులకు నాలుగు బౌండరీలు కొట్టాడు. పీయూష్ చావ్లా బౌలింగ్‌లో ఫోర్ బాది ఫిఫ్టీకి చేరువయ్యాడు. క్లాస్ బ్యాటింగ్‌తో చెలరేగిన రహానే 19 బంతుల్లోనే 6 ఫోర్లు, 3 సిక్స్‌లతో యాభై రన్స్ చేశాడు. ఈ సీజన్‌లో వేగవంతమైన ఫిఫ్టీ బాదాడు. అంతేకాదు సీఎస్కే తరఫున రెండో ఫాస్టెస్ట్ ఫిఫ్టీ నమోదు చేశాడు. 2014లో సురేశ్ రైనా 16 బంతుల్లోనే కోల్‌కతాపై హాఫ్ సెంచరీ కొట్టాడు.
టాస్ ఓడిపోయి బ్యాటింగ్‌కు దిగిన ముంబై ఇండియన్స్‌కు శుభారంభం దక్కింది.
అయితే.. తుషార్ దేశ్‌పాండే రోహిత్ శర్మ(21) బౌల్డ్ చేసి చెన్నైకి బ్రేక్ ఇచ్చాడు. ధాటిగా ఆడుతున్న ఓపెనర్ ఇషాన్ కిషన్(31)ను జడేజా ఔట్ చేశాడు. 64 వద్ద ముంబై రెండో వికెట్ కోల్పోయింది. ఆ తర్వాత 12 పరుగుల వ్యవధిలో నాలుగు వికెట్లు పడ్డాయి. సూర్యకుమార్ యాదవ్(1), కామెరూన్ గ్రీన్(12), అర్షద్ ఖాన్ వెంట వెంటనే ఔటయ్యారు. తిలక్ వర్మ(22), టిమ్ డేవిడ్ (31), హృతిక్ ష్లోకీన్ (18) ధాటిగా ఆడడంతో ముంబై పోరాడగలిగే స్కోర్ చేయగలిగింది. ప్రిటోరియస్ వేసిన ఆఖరి ఓవర్‌లో హృతిక్ ష్లోకీన్ (18) మూడు బౌండరీలు కొట్టాడు. దాంతో, ముంబై స్కోర్ 150 దాటింది. చెన్నై బౌలర్లలో రవీంద్ర జడేజా మూడు వికెట్లు తీశాడు. శాంట్నర్, తుషార్ దేశ్‌పాండే తలా రెండు వికెట్లు తీశారు. సిసండ మగలకు ఒక వికెట్ దక్కింది