Mohammed Shami: వీడియో ఇదిగో, బంతి తలపై రుద్దుకుంటూ వైరల్ అవుతున్న మొహమ్మద్‌ షమీ సెలబ్రేషన్స్, తన 5 వికెట్ల ప్రదర్శన ఎవరికి అంకితం ఇచ్చాడంటే..

ఈ ఐదు వికెట్ల ప్రదర్శనతో పలు రికార్డులు కొల్లగొట్టిన షమీ ఈ రికార్డును తనకు కష్ట కాలంలో అండగా నిలిచిన కోచ్ కు అంకితమిచ్చారు.

Mohammed Shami's Celebration After Becoming India's Highest Wicket-Taker

వన్డే వరల్డ్‌కప్‌-2023లో భాగంగా శ్రీలంకతో నిన్న (నవంబర్‌ 2) జరిగిన మ్యాచ్‌లో మొహమ్మద్‌ షమీ (5-1-18-5) ఐదు వికెట్ల ప్రదర్శనతో భారత్ కు ఘన విజయాన్ని అందించిన సంగతి విదితమే. ఈ ఐదు వికెట్ల ప్రదర్శనతో పలు రికార్డులు కొల్లగొట్టిన షమీ ఈ రికార్డును తనకు కష్ట కాలంలో అండగా నిలిచిన కోచ్ కు అంకితమిచ్చారు. ఈ మ్యాచ్‌లో షమీ తన ఐదో వికెట్‌ సాధించగానే బంతి తలపై రుద్దుకుంటూ డ్రెస్సింగ్‌ రూమ్‌వైపు సైగలు చేశాడు. తన ప్రదర్శన ఎవరికో అంకితం ఇస్తున్నట్లుగా షమీ సైగలు ఉన్నాయి.

మొహమ్మద్ షమీ బద్దలు కొట్టిన పలు ప్రపంచ రికార్డులు ఇవిగో, వన్డే వరల్డ్‌కప్‌లో అత్యధిక సార్లు ఐదు వికెట్ల సాధించిన బౌలర్‌గా కొత్త చరిత్ర

ఈ ప్రదర్శనతో షమీ హర్భజన్‌ సింగ్‌ రికార్డును (వన్డేల్లో భారత్‌ తరఫున అత్యధికసార్లు ఐదు వికెట్ల ఘనత) బ్రేక్‌ చేయడంతో భజ్జీని ఉద్దేశించే ఈ సైగలు చేశాడని అంతా అనుకున్నారు. హిందీ వ్యాఖ్యాతలు సైతం ఇదే అన్నారు. అయితే మ్యాచ్‌ అనంతరం షమీ తాను చేసుకున్న సెలబ్రేషన్స్‌పై వివరణ ఇచ్చాడు. తన కెరీర్‌ ఎత్తుపల్లాల్లో అండగా నిలిచి, తాను స్కిల్స్‌ డెవలప్‌ చేసుకోవడంలో సాయపడిన టీమిండియా బౌలింగ్‌ కోచ్‌ పరస్‌ మాంబ్రేను ఉద్దేశించి సదరు సంబురాలు చేసుకున్నానని వివరణ ఇచ్చాడు.

Here's Viral Video

తన ఐదు వికెట్ల ప్రదర్శనను మాంబ్రేకు అంకితం ఇస్తున్నాని చెప్పడానికి అలా సైగలు చేశానని తెలిపాడు. మాంబ్రేకు తలపై జట్టు ఉండదు కాబట్టి, అలా సైగలు చేశానని చెప్పుకొచ్చాడు. ఇదే విషయాన్ని మ్యాచ్‌ అనంతరం శుభ్‌మన్‌ గిల్‌ కూడా చెప్పాడు.

శ్రీలంకపై ఐదు వికెట్ల ప్రదర్శనతో చెలరేగిన షమీ పలు రికార్డులను సొంతం చేసుకున్నాడు. ఇందులో వరల్డ్‌కప్‌లో భారత్‌ తరఫున అత్యధిక వికెట్ల రికార్డు (14 మ్యాచ్‌ల్లో 45) ప్రధానమైంది కాగా.. వన్డేల్లో భారత్‌ తరఫున అత్యధికసార్లు (4) ఐదు వికెట్ల ఘనత, వరల్డ్‌కప్‌లో అత్యధికసార్లు (3) ఐదు వికెట్ల ఘనత, వరల్డ్‌కప్‌లో అత్యధికసార్లు (7) నాలుగు అంతకంటే ఎక్కువ వికెట్లు తీసిన ఘనత వంటి పలు ఇతర రికార్డులు కూడా ఉన్నాయి.