MS Dhoni Retirement: రిటైర్మెంట్‌పై ధోనీ హింట్, మళ్లీ ఆడతానో? లేదో? నాకూ అనుమానమే అంటూ కీలక వ్యాఖ్యలు, సీఎస్‌కే కోసం ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానంటూ ప్రకటన

Dhoni) అద్భుతంగా ముందుకు నడిపించి టైటిల్‌ రేసులో నిలిపాడు. ప్రస్తుత సీజనే ధోనీకి చివరిదిగా అంతా భావిస్తున్న వేళ.. కెప్టెన్‌ కూల్‌ కీలక వ్యాఖ్యలు చేశాడు. రిటైర్‌మెంట్‌, తన జట్టు ఫైనల్‌కు చేరుకోవడంపై ధోనీ మాట్లాడాడు.

MS Dhoni (Photo credit: Twitter)

Chepak, May 24: ఐపీఎల్ 2023 సీజన్‌ (IPL 2023) ఫైనల్లోకి చెన్నైసూపర్‌ కింగ్స్‌ (CSK) అడుగు పెట్టింది. క్వాలిఫయర్‌ -1లో గుజరాత్ టైటాన్స్‌ను ఓడించి మరీ ఘనంగా తుదిపోరుకు (GT vs CSK) చేరింది. దీంతో 10వ సారి ఐపీఎల్‌ ఫైనల్‌కు చేరిన జట్టుగా రికార్డు సృష్టించింది. గత సీజన్‌లో లీగ్‌ స్టేజ్‌కే పరిమితమైన సీఎస్‌కేను కెప్టెన్‌ ఎంఎస్ ధోనీ (M.S. Dhoni) అద్భుతంగా ముందుకు నడిపించి టైటిల్‌ రేసులో నిలిపాడు. ప్రస్తుత సీజనే ధోనీకి చివరిదిగా అంతా భావిస్తున్న వేళ.. కెప్టెన్‌ కూల్‌ కీలక వ్యాఖ్యలు చేశాడు. రిటైర్‌మెంట్‌, తన జట్టు ఫైనల్‌కు చేరుకోవడంపై ధోనీ మాట్లాడాడు. ‘‘సాధారణంగా 8 జట్లు పోటీ పడేవి. ఆ సంఖ్య పదికి చేరింది. ఐపీఎల్‌ మెగా టోర్నీ. ఇలా ఫైనల్‌కు చేరడం అంత సులువేం కాదు. రెండు నెలల కష్టం. ప్రతి ఒక్కరూ తమవంతు భాగస్వామ్యం అందించారు. గుజరాత్ టైటాన్స్‌ అద్భుతమైన టీమ్‌. ఛేదనలో వారు టాప్‌. మేం టాస్‌ ఓడిపోవడం కూడా మంచిదైంది. జడేజాకు పిచ్‌ నుంచి సహకారం లభిస్తే అతడిని ఎదుర్కోవడం చాలా కష్టం. జడేజా బౌలింగ్‌ మ్యాచ్‌ను మార్చింది. అలాగే బ్యాటింగ్‌లోనూ మొయిన్‌తో కలిసి చేసిన భాగస్వామ్యం చాలా కీలకమైందన్నాడు ధోనీ.

వచ్చే సీజన్‌లో ఆడతాడా? లేదా? అనే చర్చపై ధోనీ స్పందించాడు. ప్రస్తుత ఐపీఎల్‌ సందర్భంగానే రిటైర్‌మెంట్‌పై ప్రకటన చేస్తాడనే ఊహాగానాలకు తెర దించాడు. చెపాక్‌లో (Chepak) మళ్లీ ఆడే అవకాశాలు ఉన్నాయా..? అనే ప్రశ్నకు స్పందిస్తూ ‘‘ఇప్పుడే చెప్పలేను. ఇంకా 8-9 నెలల సమయం ఉంది. డిసెంబర్‌లో మళ్లీ మినీ వేలం ఉంటుంది. కాబట్టి, ఆ తలనొప్పిని ఇప్పుడే తీసుకోవాల్సిన అవసరం ఏముంది? నాకు కావాల్సినంత సమయం ఉంది. సీఎస్‌కే కోసం ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటా. అది జట్టు కోసం ఆడటమా..? బయట కూర్చోవడమా..? అనేదానిపై నిర్ణయం తీసుకునేందుకు సమయం ఉంది’’ అని చెప్పాడు. ఈ సీజన్‌లో ఈ వేదికలో చెన్నై ఆడిన చివరి మ్యాచ్‌ ఇదే. ఫైనల్‌ అహ్మదాబాద్‌ వేదికగా జరగనుంది.