IPL 2023: ఐపీఎల్‌ 2023లో ఫాస్టెస్ట్‌ ఫిప్టీ వీడియో ఇదిగో, బెంగుళూరు బౌలర్లను ఉతికి ఆరేసిన పూరన్, ఐపీఎల్‌లో చరిత్రలో ఫాస్టెస్ట్‌ ఫిఫ్టీ చేసిన రెండో ఆటగాడిగా రికార్డు

ఐపీఎల్‌లో-2023లో రాయల్స్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు, లక్నో సూపర్‌ జెయింట్స్‌ మధ్య ఆఖరి బంతి వరకు ఉత్కంఠగా సాగిన మ్యాచ్‌లో ఆర్సీబీపై లక్నో ఒక్క వికెట్ తేడాతో గెలుపొందింది.టాస్‌ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన బెంగళూరు 20 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 212 పరుగులు చేసింది

Nicholas Pooran (Photo-IPL)

ఐపీఎల్‌లో-2023లో రాయల్స్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు, లక్నో సూపర్‌ జెయింట్స్‌ మధ్య ఆఖరి బంతి వరకు ఉత్కంఠగా సాగిన మ్యాచ్‌లో ఆర్సీబీపై లక్నో ఒక్క వికెట్ తేడాతో గెలుపొందింది.టాస్‌ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన బెంగళూరు 20 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 212 పరుగులు చేసింది. ఫాఫ్‌ డుప్లెసిస్‌ (46 బంతుల్లో 79 నాటౌట్‌; 5 ఫోర్లు, 5 సిక్స్‌లు), విరాట్‌ కోహ్లి (44 బంతుల్లో 61; 4 ఫోర్లు, 4 సిక్స్‌లు), గ్లెన్‌ మ్యాక్స్‌వెల్‌ (29 బంతుల్లో 59; 3 ఫోర్లు, 6 సిక్స్‌లు) అర్ధ సెంచరీలతో చెలరేగారు.

ఓటమి బాధలో ఉన్న బెంగళూరుకు భారీ షాక్, కెప్టెన్ డుప్లెసిస్‌కు రూ. రూ.12 లక్షల జరిమానా, అతిగా ప్రవర్తించిన లక్నో ఆటగాడు అవేశ్ ఖాన్‌కు వార్నింగ్

అనంతరం 213 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన లక్నోకు స్టోయినిష్‌ (30 బంతుల్లో 65; 6 ఫోర్లు, 5 సిక్స్‌లు), మెరుపు బ్యాటింగ్‌తో కాస్త ఆశలు చిగురించాయి.ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన నికోలస్‌ పూరన్‌ సంచలన ఇన్నింగ్స్‌ ఆడాడు. ప్రత్యర్ధి బౌలర్లపై ఫోర్లు, సిక్సర్లతో విరుచుకుపడ్డాడు. ఈ క్రమంలో తన హాఫ్‌ సెంచరీ మార్క్‌ను కేవలం 15 బంతుల్లోనే అందుకున్నాడు.

Here's Video

తద్వారా ఐపీఎల్‌-2023లో అత్యంత వేగవంతంగా హాఫ్‌ సెంచరీ చేసిన ఆటగాడిగా పూరన్‌ రికార్డు సృష్టించాడు. ఓవరాల్‌గా ఐపీఎల్‌లో చరిత్రలో ఫాస్టెస్ట్‌ ఫిఫ్టీ చేసిన రెండో ఆటగాడిగా యూసప్‌ పఠాన్‌, సునీల్‌ నరైన్‌తో కలిసి నిలిచాడు. ఈ అరుదైన ఘనత సాధించిన జాబితాలో కేల్‌ రాహుల్‌, ప్యాట్‌ కమ్మిన్స్‌ సంయుక్తంగా తొలి స్థానంలో ఉన్నారు. వీరిద్దరూ 14 బంతుల్లోనే హాఫ్‌ సెంచరీ సాధించాడు.



సంబంధిత వార్తలు