బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ (RCB), లక్నో సూపర్ జెయింట్స్ (LSG) జట్ల మధ్య జరిగిన మ్యాచ్లో చివరి వరకు బెంగళూరుదే విజయం అనుకుంటే పూరన్ (Nicholas Pooran) సంచలన ఇన్నింగ్స్ ఆడి మ్యాచ్‌ను లాగేసుకున్నాడు. ఈ మ్యాచ్‌లో బెంగళూరు కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్‌కు (Faf du Plessis) డబుల్ షాక్ తగిలింది. స్లో ఓవర్ రేట్ (slow over-rate) కారణంగా డుప్లెసిస్‌కు జరిమానా పడింది. ఈ సీజన్‌లో ఇదే తొలి తప్పిదం కాబట్టి రూ.12 లక్షల జరిమానా విధించింది. అలాగే చివరి బంతికి విజయం సాధించడంతో లక్నో ఆటగాడు అవేశ్ ఖాన్ (Avesh Khan) మైదానంలో కాస్త అతిగా ప్రవర్తించాడు. మ్యాచ్ గెలిచిన వెంటనే సంతోషం పట్టలేక తన హెల్మెట్‌ను నేలకు విసిరి కొట్టాడు. అయితే అతడి మొదటి తప్పిదంగా భావించి మందలించి వదిలేశారు.

Here's  Video

 

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)