World Cup 2023: భారత్‌తో ఫైనల్ పోరుకు సిద్ధమైన ఆస్ట్రేలియా, ఉత్కంఠభరిత పోరులో పోరాడి ఓడిన సఫారీలు, డేవిడ్ మిల్లర్ సెంచరీ వృధా

దీంతో ఈనెల 19న అహ్మదాబాద్ వేదికగా జరగనున్న ఫైనల్లో టీమిండియాతో ఆస్ట్రేలియా తలపడనుంది.

Australia enter record 8th final after nail-biting win over SA; face India in summit clash

వన్డే ప్రపంచకప్‌లో భాగంగా కోల్‌కతా వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన రెండో సెమీఫైనల్లో ఆస్ట్రేలియా 3 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. దీంతో ఈనెల 19న అహ్మదాబాద్ వేదికగా జరగనున్న ఫైనల్లో టీమిండియాతో ఆస్ట్రేలియా తలపడనుంది. ఈ మ్యాచ్‌లో తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న దక్షిణాఫ్రికా 49.4 ఓవర్లలో 212 పరుగులకు ఆలౌటైంది. డేవిడ్ మిల్లర్ 116 బాల్స్‌లో 8 ఫోర్లు, 5 సిక్సర్లతో 101 పరుగులతో ఒంటరి పోరాటం చేశాడు. దీంతో వన్డే ప్రపంచకప్ నాకౌట్ మ్యాచ్‌లలో సెంచరీ చేసిన తొలి దక్షిణాఫ్రికా బ్యాటర్‌గా నిలిచాడు.

ప్రపంచకప్ 2023 ఫైనల్‌కు ప్రధాని నరేంద్ర మోదీ, ప్రత్యక్షంగా స్టేడియంలో కూర్చుని వీక్షించనున్నట్టు తెలిపిన దైనిక్ జాగరణ్

213 పరుగుల టార్గెట్‌తో బరిలోకి దిగిన ఆస్ట్రేలియా 47.2 ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించారు.ఓపెనర్లు డేవిడ్ వార్నర్, ట్రావిస్ హెడ్ అదిరిపోయే ఆరంభాన్ని ఇచ్చారు. 6 ఓవర్లలో 60 పరుగులు చేశారు. ఆఖర్లో మిచెల్‌ స్టార్క్‌, పాట్‌ కమిన్స్‌లు రాణించి ఆసీస్‌ను రికార్డు స్థాయిలో ఎనిమిదోసారి ఫైనల్‌కు చేర్చారు. ఈ విజయంతో ఆస్ట్రేలియా.. ఈనెల 19న అహ్మదాబాద్‌ వేదికగా భారత్‌తో జరుగబోయే టైటిల్‌ పోరులో అమీతుమీ తేల్చుకోనుంది.