India vs Pakistan: నరాలు తెగే ఉత్కంఠభరిత పోరు! ఒక బాల్ మిగిలి ఉండగానే విజయం సాధించిన పాకిస్తాన్, మహ్మద్ రిజ్వాన్ మెరుపు ఇన్నింగ్స్‌తో పాక్ గెలుపు, ఆ ఒక్క క్యాచ్ మిస్సవ్వడంతోనే మ్యాచ్ పోయిందంటూ ఫ్యాన్స్ ఫైర్
ఐదు వికెట్ల తేడాతో ఒక బాల్ మిగిలి ఉండగానే లక్ష్యాన్ని చేధించింది. చివరి వరకు నరాలు తెగే ఉత్కంఠ మధ్య జరిగిన మ్యాచ్‌లో చివరకు విజేతగా నిలిచింది. భారత్ ఇచ్చిన టార్గెట్‌ను చేరుకుంది. అయితే ఈ మ్యాచ్‌లో టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కొహ్లీ ఫామ్‌లోకి రావడం మాత్రం భారత ప్రేక్షకులకు ఆనందాన్నిచ్చింది.
Dubai, SEP 04: ఉత్కంఠభరిత పోరులో దాయాది దేశం పాకిస్థాన్ (Pakistan) విజయం సాధించింది. ఐదు వికెట్ల తేడాతో ఒక బాల్ మిగిలి ఉండగానే లక్ష్యాన్ని చేధించింది. చివరి వరకు నరాలు తెగే ఉత్కంఠ మధ్య జరిగిన మ్యాచ్‌లో చివరకు విజేతగా (Pakistan won) నిలిచింది. భారత్ ఇచ్చిన టార్గెట్‌ను చేరుకుంది. అయితే ఈ మ్యాచ్‌లో టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కొహ్లీ (virat kohli) ఫామ్‌లోకి రావడం మాత్రం భారత ప్రేక్షకులకు ఆనందాన్నిచ్చింది. భారత్ నిర్దేశించిన 182 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన పాకిస్థాన్‌కు నాలుగో ఓవర్‌లోనే షాక్ తగిలింది. పాక్ కెప్టెన్ బాబర్ అజామ్ 14 పరుగులు చేసి రోహిత్‌కు క్యాచ్ ఇచ్చి ఔట్ అయ్యాడు. అప్పటికి పాక్ స్కోరు 22 పరుగులు మాత్రమే. అయితే బాబర్ అజామ్ ఔట్ అవడంతో మరో వికెట్ పడకుండా జాగ్రత్తలు తీసుకుంటూనే రిజ్వాన్, ఫఖర్ జమాన్ ధాటిగా ఆడారు. దాంతో పవర్‌ప్లే ముగిసే రికి పాకిస్తాన్ జట్టు 44/1 స్కోరుతో నిలిచింది.
అయితే చాహల్ వేసిన 9వ ఓవర్లో ఫఖర్ జమాన్ (15) అవుటయ్యాడు. ఆ తర్వాత వికెట్ పడకుండా జాగ్రత్త పడ్డ పాక్ టీమ్ ధాటిగా ఆడింది. కానీ రెండు కీలక వికెట్లను స్వల్ప వ్యవధిలోనే కోల్పోయింది. భువనేశ్వర్ బౌలింగ్‌లో నవాజ్ (42), హార్దిక్ బౌలింగ్‌లో రిజ్వాన్ (71) వికెట్లు పడ్డాయి. 147 పరుగుల వద్ద మహ్మద్ రిజ్వాన్(71) వికెట్ పాక్ కోల్పోయింది.
హార్దిక్ పాండ్యా బౌలింగ్‌లో సూర్యకుమార్ యాదవ్‌కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. దీంతో మ్యాచ్ భారత్ చేతుల్లోకి వచ్చిందని భావించినప్పటికీ....పాక్ టీమ్ మాత్రం చివరి వరకు పోరాడింది. మరో బాల్ మిగిలి ఉండగానే లక్ష్యాన్ని చేరుకుంది.