India vs Australia: వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ లో షాకింగ్ ఘటన, మైదానంలోకి దూసుకొచ్చిన పాలస్తీనా అభిమాని, విరాట్ కోహ్లీని కౌగిలించుకోవడంతో అంతా షాక్..

అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో భారత్, ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న ఫైనల్ మ్యాచ్ లో ఓ ప్రేక్షకుడు అకస్మాత్తుగా మైదానంలోకి ప్రవేశించి విరాట్ కోహ్లీ దగ్గరికి వెళ్లి వెనుక నుంచి పట్టుకున్నాడు.

palastine

ప్రపంచ కప్ ఫైనల్‌లో పాలస్తీనా అభిమానులు సెక్యూరిటీ నిబంధనలను ఉల్లంఘించారు. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో భారత్, ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న ఫైనల్ మ్యాచ్ లో ఓ ప్రేక్షకుడు అకస్మాత్తుగా మైదానంలోకి ప్రవేశించి విరాట్ కోహ్లీ దగ్గరికి వెళ్లి వెనుక నుంచి పట్టుకున్నాడు. అతను పాలస్తీనా జెండాతో కూడిన ముసుగు కూడా ధరించాడు. భారత ఇన్నింగ్స్‌లో 14వ ఓవర్ మూడో బంతికి ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ఘటన జరిగిన వెంటనే భద్రతా సిబ్బంది వచ్చి ఆ ప్రేక్షకుడిని పట్టుకుని బయటకు తోసేశారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు, ఫొటోలు విపరీతంగా వైరల్ అవుతున్నాయి. ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా ఫైనల్ మ్యాచ్ సందర్భంగా మైదానంలోకి దిగిన వ్యక్తిని అహ్మదాబాద్‌లోని చంద్‌ఖేడా పోలీసులు పట్టుకుని పోలీస్ స్టేషన్‌కు తీసుకొచ్చారు. ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా ఫైనల్ మ్యాచ్ సందర్భంగా నరేంద్ర మోడీ స్టేడియం భద్రతా వలయాన్ని ఛేదించుకుని గ్రౌండ్‌లోకి ప్రవేశించిన వ్యక్తి, "నా పేరు జాన్.. నేను ఆస్ట్రేలియా నుండి వచ్చాను. నేను విరాట్ కోహ్లీని కలవడానికి (గ్రౌండ్)లోకి ప్రవేశించాను" అని చెప్పాడు. నేను పాలస్తీనాకు మద్దతు ఇస్తున్నాను అని పేర్కొన్నాడు.



00" height="600" layout="responsive" type="mgid" data-publisher="bangla.latestly.com" data-widget="1705935" data-container="M428104ScriptRootC1705935" data-block-on-consent="_till_responded"> @endif