India vs Australia, 4th Test, Day 1: మరికాసేపట్లో భారత్‌-ఆస్ట్రేలియా మధ్య కీలక మ్యాచ్‌, అహ్మదాబాద్‌లో నిర్ణయాత్మక నాలుగో టెస్ట్ మ్యాచ్‌, స్టేడియానికి చేరుకున్న ఇరుదేశాల ప్రధానులు

ఇరు జట్లకు ఈ మ్యాచ్ కీలకంగా మారింది. ప్రధానులు రాక సందర్భంగా ఎస్పీజీ భద్రతను కట్టుదిట్టం చేసింది.

India vs Australia 4th Test

Ahmedabad, March 09: బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ టెస్టు సిరీస్‌లో (Border-Gavaskar Trophy) భాగంగా నిర్ణయాత్మక నాల్గో టెస్టు మ్యాచ్ అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో (Narendra Modi Stadium in Ahmedabad) జరుగుతోంది.ఇండియా, ఆస్ట్రేలియా ప్రధానులు స్టేడియంకు చేరుకున్నారు. ఇరు జట్లకు ఈ మ్యాచ్ కీలకంగా మారింది. ప్రధానులు రాక సందర్భంగా ఎస్పీజీ భద్రతను కట్టుదిట్టం చేసింది. స్టేడియం భద్రత బాధ్యతను ఎస్పీజీ తన చేతుల్లోకి తీసుకుంది. తొలి రోజు లక్ష మంది మ్యాచ్ ను వీక్షించేందుకు వస్తారని అంచనా. ఇప్పటికే 75 వేల టికెట్లు స్టేడియంలో అమ్ముడయ్యాయి. మ్యాచ్ ప్రారంభానికి ముందు స్టేడియంలో చిన్న వేదికను ఏర్పాటు చేసి ప్రత్యేక కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ వేదిక పై నుంచి ఇద్దరు ప్రధానులు ఆటగాళ్లనుద్దేశించి ప్రసంగించే అవకాశం ఉంది. ప్రధాని మోదీ మ్యాచ్ ప్రారంభం వ్యాఖ్యానం కూడా చేసే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.

తొలి రెండు మ్యాచ్ లలో వరుస విజయాలతో మంచి జోష్ ను కొనసాగించిన టీమిండియా.. మూడో మ్యాచ్ లో ఆస్ట్రేలియా (India vs Australia) చేతిలో చిత్తుగా ఓడిపోయింది. మూడో టెస్టులో బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో విఫలం కావటంతో మూడు రోజుల్లోనే ఆస్ట్రేలియా విజయంతో మ్యాచ్ ను ముగించేసింది. దీంతో మూడో టెస్టు విజయం ఆసీస్ జట్టు రెట్టించిన ఉత్సాహంతో నాల్గో టెస్టుకు మైదానంలో అడుగుపెట్టనుంది. టీమిండియా టాప్ ఆర్డర్ పేలవ ప్రదర్శన ఆందోళన కలిగించే విషయం. రోహిత్ శర్మ, విరాట్, పుజారా వంటి కీలక ఆటగాళ్లుసైతం భారీస్కోరు సాధించడంలో ఇబ్బందులు పడుతున్నారు. నాల్గో టెస్టులోనూ ఇదే పరిస్థితి కొనసాగితే టీమిండియాకు ఓటమి పొంచిఉంటుందని చెప్పొచ్చు.

టీమిండియాకు నాల్గో టెస్ట్ కీలకం కానుంది. ఈ మ్యాచ్‌లో విజయం సాధిస్తే డబ్ల్యూటీసీ ఫైనల్‌కు నేరుగా చేరుకోవచ్చు. ఓడిపోయినా, మ్యాచ్ డ్రా అయినా.. టీమిండియా డబ్ల్యూటీసీ ఫైనల్ బెర్త్‌కు అర్హత సాధించాలంటే శ్రీలంక జట్టు ప్రదర్శనపై ఆధారపడాల్సి ఉంటుంది. మరోవైపు ఈ మ్యాచ్‌లో విజయం సాధించడం ద్వారా సిరీస్‌ను సొంతం చేసుకోవచ్చు. ఇలాంటి పరిస్థితుల్లో నాల్గో టెస్టులో విజయంకోసం ఖచ్చితంగా టీమిండియా పోరాడుతుంది. ఈ క్రమంలో జట్టులో కీలక మార్పులు చోటుచేసుకోనున్నట్లు తెలుస్తోంది. పరుగులు రాబట్టడంలో విఫలమవుతున్న వికెట్ కీపర్ కె.ఎస్. భరత్ స్థానంలో ఇషాన్ కిషన్ ను తుది జట్టులోకి ఎంపిక చేసే అవకాశాలు ఉన్నాయి. బౌలింగ్ విభాగంలో మహ్మద్ సిరాజుద్దీన్ స్థానంలో మహ్మద్ షమీ తుది జట్టులోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి.

WPL 2023, MI vs GG: ఉమెన్స్ ప్రీమియర్‌ లీగ్ తొలిమ్యాచ్‌లో ముంబై గ్రాండ్‌ విక్టరీ, చెలరేగి ఆడిన కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్, ఫస్ట్ మ్యాచ్‌లోనే మెరుపులతో ప్రత్యర్ధికి ముచ్చెముటలు  

తొలి మూడు టెస్టుల్లో పిచ్‌లు వివాదాస్పదంగా మారాయి. తొలి సెషన్ నుంచే స్పిన్‌కు అనుకూలించడంతో మూడు టెస్టు మ్యాచ్‌లు మూడు రోజుల్లోనే ముగిశాయి. దీంతో మాజీ క్రికెటర్లు పిచ్‌లపై విమర్శలు చేస్తున్నారు. నాల్గోటెస్టులో నరేంద్ర మోదీ స్టేడియంలో పిచ్ కాస్త ఊరటనిస్తుందని అంచనా. బంతి విపరీతంగా తిరగకపోవచ్చని తెలుస్తోంది. తొలి రోజు పిచ్ పూర్తి ఫ్లాట్‌గా ఉండొచ్చని ఆస్ట్రేలియా కెప్టెన్ స్మీత్ అన్నాడు.



సంబంధిత వార్తలు

AP Weather Update: ఏపీవాసులు ఊపిరిపీల్చుకునే కబురు.. బలహీనపడిన వాయుగుండం.. తప్పిన ముప్పు.. అయితే, రెండు రోజుల్లో బాపట్ల, ప్రకాశం, నెల్లూరు జిల్లాలకు భారీ వర్ష సూచన

AP Rain Update: ఏపీ వర్షాలపై కీలక అప్‌డేట్ ఇదిగో, 24 గంటల్లో అల్పపీడనం ఉత్తరం వైపుగా పయనించి ఏపీ తీరం వెంబడి వెళ్లే అవకాశం, కోస్తా జిల్లాలకు భారీ వర్ష సూచన

Nitin Gadkari on Same-Sex Marriages: స్వలింగ వివాహాలను అనుమతిస్తే ఒక పురుషుడికి ఇద్దరు భార్యలను కూడా అనుమతించాలి, కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ కీలక వ్యాఖ్యలు

Telangana Assembly Sessions: అసెంబ్లీని కుదిపేసిన ఫార్ములా ఈ కార్ రేసు అంశం, కేటీఆర్‌కు మాట్లాడేందుకు అవకాశం ఇవ్వాలని బీఆర్ఎస్ డిమాండ్, కేసు విచారణలో ఉన్న నేపథ్యంలో కుదరదన్న ప్రభుత్వం

00" height="600" layout="responsive" type="mgid" data-publisher="bangla.latestly.com" data-widget="1705935" data-container="M428104ScriptRootC1705935" data-block-on-consent="_till_responded"> @endif