India vs England: రాజ్‌కోట్‌ టెస్ట్‌ మ్యాచులో ఇంగ్లాండ్‌పై భారత్‌ ఘనవిజయం, ఇంగ్లాండ్‌పై 435 పరుగుల తేడాతో భారత్‌ గెలుపు

రాజ్‌కోట్‌లో జరిగిన మ్యాచ్‌లో భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 445 పరుగులు చేసింది. దీంతో 430 పరుగులకు రెండో ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేశారు. దీనికి సమాధానంగా ఇంగ్లండ్ జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 319 పరుగులు, రెండో ఇన్నింగ్స్‌లో 122 పరుగులకు ఆలౌటైంది.

india vs england

ఇంగ్లండ్‌పై టీమిండియా 434 పరుగుల తేడాతో విజయం సాధించింది. రాజ్‌కోట్‌లో జరిగిన మ్యాచ్‌లో భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 445 పరుగులు చేసింది. దీంతో 430 పరుగులకు రెండో ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేశారు. దీనికి సమాధానంగా ఇంగ్లండ్ జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 319 పరుగులు, రెండో ఇన్నింగ్స్‌లో 122 పరుగులకు ఆలౌటైంది. టెస్టు చరిత్రలో పరుగుల పరంగా టీమిండియా అతిపెద్ద విజయాన్ని నమోదు చేసింది. పరుగుల పరంగా ఇంగ్లండ్‌కు ఇది రెండో అతిపెద్ద ఓటమి. భారత్ తరఫున యశస్వి జైస్వాల్ డబుల్ సెంచరీ చేశాడు. అజేయంగా 214 పరుగులు చేశాడు. కెప్టెన్ రోహిత్ శర్మ తొలి ఇన్నింగ్స్‌లో సెంచరీ సాధించాడు. అతను 131 పరుగులు చేశాడు. రవీంద్ర జడేజా 112 పరుగులు చేశాడు. ఈ విజయంతో సిరీస్‌లో టీమిండియా 2-1తో ముందంజ వేసింది. ఇప్పుడు సిరీస్‌లో నాలుగో మ్యాచ్ ఫిబ్రవరి 23 నుంచి రాంచీలో జరగనుంది.