RCB vs DC Highlights IPL 2020: బెంగుళూరును గెలిపించలేకపోయిన కెప్టెన్ కోహ్లీ ఇన్నింగ్స్, ఆల్‌రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టిన ఢిల్లీ, 59 పరుగుల తేడాతో ఢిల్లీ క్యాపిటల్స్ ఘన విజయం
బెంగళూరు రాయల్ చాలెంజర్స్ చిత్తుగా ఓడింది. సోమవారం జరిగిన మ్యాచ్‌లో (RCB vs DC Highlights IPL 2020) ఢిల్లీ 59 పరుగుల తేడాతో బెంగళూరును ఢిల్లీ కంగుతినిపించింది. టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ 20 ఓవర్లలో 4 వికెట్లకు 196 పరుగులు చేసింది. స్టొయినిస్ (26 బంతుల్లో 53 నాటౌట్; 6 ఫోర్లు, 2 సిక్స్‌లు) మెరిపించగా... పృథ్వీషా (23 బంతుల్లో 42; 5 ఫోర్లు, 2 సిక్స్‌లు) రాణించాడు. ఈ సీజన్‌లో తొలి మ్యాచ్ ఆడిన హైదరాబాద్ బౌలర్ సిరాజ్‌కు 2 వికెట్లు దక్కాయి.
Dubai, October 5: ఢిల్లీ క్యాపిటల్స్ మరో విక్టరీని నమోదు చేసింది. బెంగళూరు రాయల్ చాలెంజర్స్ చిత్తుగా ఓడింది. సోమవారం జరిగిన మ్యాచ్‌లో (RCB vs DC Highlights IPL 2020) ఢిల్లీ 59 పరుగుల తేడాతో బెంగళూరును ఢిల్లీ కంగుతినిపించింది. టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ 20 ఓవర్లలో 4 వికెట్లకు 196 పరుగులు చేసింది. స్టొయినిస్ (26 బంతుల్లో 53 నాటౌట్; 6 ఫోర్లు, 2 సిక్స్‌లు) మెరిపించగా... పృథ్వీషా (23 బంతుల్లో 42; 5 ఫోర్లు, 2 సిక్స్‌లు) రాణించాడు. ఈ సీజన్‌లో తొలి మ్యాచ్ ఆడిన హైదరాబాద్ బౌలర్ సిరాజ్‌కు 2 వికెట్లు దక్కాయి.
తర్వాత బెంగళూరు 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 137 పరుగులే చేసి ఓడింది. కెప్టెన్ కోహ్లి (39 బంతుల్లో 43; 2 ఫోర్లు, 1 సిక్స్) తప్ప ఎవరూ కనీసం 20 పరుగులైనా చేయలేకపోయారు. కగిసో రబడ (4/24) బెంగళూరు పతనాన్ని శాసించాడు. మరో పేసర్ నోర్జేకు రెండు వికెట్లు దక్కాయి. పొదుపుగా బౌలింగ్ చేసిన స్పిన్నర్ అక్షర్ పటేల్‌కు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది.
టి20 క్రికెట్‌లో 9 వేల పరుగులు పూర్తి చేసుకున్న తొలి భారతీయ క్రికెటర్‌గా, ఓవరాల్‌గా ఏడో క్రికెటర్‌గా రాయల్ చాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ విరాట్ కోహ్లి (Virat Kohli) గుర్తింపు పొందాడు. తన 271వ టి20 మ్యాచ్‌లో కోహ్లి ఈ ఘనత సాధించాడు. ఈ జాబితాలో గేల్ (13,296 పరుగులు–396 మ్యాచ్‌లు), పొలార్డ్ (10,345–461 మ్యాచ్‌లు), షోయబ్ మాలిక్ (9,926–365 మ్యాచ్‌లు), బ్రెండన్ మెకల్లమ్ (9,922–364 మ్యాచ్‌లు), వార్నర్ (9,391–285 మ్యాచ్‌లు), ఫించ్ (9,140 పరుగులు–285 మ్యాచ్‌లు) వరుసగా తొలి ఆరు స్థానాల్లో ఉన్నారు.
స్కోరు వివరాలు
ఢిల్లీ క్యాపిటల్స్ ఇన్నింగ్స్: పృథ్వీ షా (సి) డివిలియర్స్ (బి) సిరాజ్ 42; ధావన్ (సి) అలీ (బి) ఉదాన 32; శ్రేయస్ (సి) దేవ్‌దత్ (బి) అలీ 11; పంత్ (బి) సిరాజ్ 37; స్టొయినిస్ (నాటౌట్) 53; హెట్‌మైర్ (నాటౌట్) 11;
ఎక్స్‌ట్రాలు 10; మొత్తం (20 ఓవర్లలో 4 వికెట్లకు) 196.
వికెట్ల పతనం: 1–68, 2–82, 3–90, 4–179. బౌలింగ్: ఉదాన 4–0–40–1, సుందర్ 4–0–20–0, సైనీ 3–0–48–0, చహల్ 3–0–29–0, సిరాజ్ 4–0–34–2, మొయిన్ అలీ 2–0–21–1.
రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఇన్నింగ్స్: దేవదత్ (సి) స్టొయినిస్ (బి) అశ్విన్ 4; ఫించ్ (సి) పంత్ (బి) అక్షర్ 13; కోహ్లి (సి) పంత్ (బి) రబడ 43; డివిలియర్స్ (సి) ధావన్ (బి) నోర్జే 9; మొయిన్ అలీ (సి) హెట్‌మైర్ (బి) అక్షర్ 11; సుందర్ (సి) అశ్విన్ (బి) రబడ 17; శివమ్ దూబే (బి) రబడ 11; ఉదాన (సి) శ్రేయస్ (బి) రబడ 1; సైనీ (నాటౌట్) 12; సిరాజ్ (బి) నోర్జే 5; చహల్ (నాటౌట్) 0;
ఎక్స్‌ట్రాలు 11; మొత్తం (20 ఓవర్లలో 9 వికెట్లకు) 137.
వికెట్ల పతనం: 1–20, 2–27, 3–43, 4–75, 5–94, 6–115, 7–118, 8–119, 9–127. బౌలింగ్: రబడ 4–0–24–4, నోర్జే 4–0–22–2, అశ్విన్ 4–0–26–1, అక్షర్ పటేల్ 4–0–18–2, హర్షల్ పటేల్ 4–0–43–0.