Quinton de Kock of Mumbai Indians. (Photo Credits: Twitter)

Sharjah, October 4: బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో అదరగొట్టిన డిఫెండింగ్‌ చాంపియన్‌ ముంబై ఇండియన్స్‌ ఐపీఎల్‌లో (MI vs SRH Stat Highlights IPL 2020) మరో విజయాన్ని సాధించింది. ఆదివారం జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ను రోహిత్‌ శర్మ బృందం 34 పరుగులతో చిత్తుగా ఓడించింది. కాగా ముంబై ఇండియన్స్‌కు ఇది మూడో విజయం కాగా, సన్‌రైజర్స్‌కు (Sunrisers Hyderabad) మూడో ఓటమి.

టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న ముంబై (Mumbai Indians) 20 ఓవర్లలో 5 వికెట్లకు 208 పరుగులు చేసింది. డికాక్‌ (39 బంతుల్లో 67; 4 ఫోర్లు, 4 సిక్సర్లు) అర్ధసెంచరీతో ఆకట్టుకోగా.. ఇషాన్‌ కిషన్‌ (23 బంతుల్లో 31; 1 ఫోర్, 2 సిక్స్‌లు) రాణించాడు. కృనాల్‌ పాండ్యా (4 బంతుల్లో 20 నాటౌట్‌; 2 ఫోర్లు, 2 సిక్సర్లు) చివర్లో విధ్వంసం సృష్టించడంతో ముంబై భారీ స్కోరును నమోదు చేసింది. ఇక బౌలింగ్ విభాగంలో భువనేశ్వర్‌ స్థానంలో వచ్చిన సందీప్‌ శర్మ, ఖలీల్‌ అహ్మద్‌ను భర్తీ చేసిన సిద్ధార్థ్‌ కౌల్‌ చెరో 2 వికెట్లు దక్కించుకున్నారు. అనంతరం సన్‌రైజర్స్‌ 20 ఓవర్లలో 7 వికెట్లకు 174 పరుగులే చేయగలిగింది. కెప్టెన్‌ వార్నర్‌ (44 బంతుల్లో 60; 5 ఫోర్లు, 2 సిక్సర్లు) అర్ధసెంచరీ సాధించాడు. ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ బౌల్ట్, ప్యాటిన్సన్, బుమ్రా తలా 2 వికెట్లు తీశారు.

హ్యాట్రిక్ పరాజయాలకు ధోనీ సేన పుల్‌స్టాప్, 10 వికెట్ల తేడాతో కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌పై ఘనవిజయం, నాలుగో ఓటమిని చవిచూసిన పంజాబ్

వార్నర్‌ కెప్టెన్‌ ఇన్నింగ్స్‌

మరోసారి రైజర్స్‌ బ్యాటింగ్‌ ఒక్కరిపైనే ఆధారపడింది. కెప్టెన్‌ వార్నర్‌ మినహా మిగతా బ్యాట్స్‌మెన్‌న్‌ముంబై బౌలింగ్‌కు తలొంచారు. బెయిర్‌స్టో (25), మనీశ్‌ పాండే (30; 4 ఫోర్లు, 1 సిక్స్‌), విలియమ్సన్‌ (3)లను కట్టడి చేసి ముంబై మ్యాచ్‌పై పట్టు సాధించింది. మరోవైపు 34 బంతుల్లో అర్ధసెంచరీ సాధించిన వార్నర్‌... జట్టు స్కోరు 142/4 వద్ద ఔట్‌ కావడంతో మ్యాచ్‌ ముంబై వశమైపోయింది. బుమ్రా, బౌల్ట్‌ లాంటి కట్టుదిట్టమైన బౌలింగ్‌కు యువ బ్యాట్స్‌మెన్‌ అభిషేక్‌ శర్మ (10), ప్రియమ్‌ గార్గ్‌ (8), సమద్‌ (20) చేతులెత్తేశారు. దీంతో రైజర్స్‌ ఓటమి ఖాయమైంది.

స్కోరు వివరాలు

ముంబై ఇండియన్స్‌ ఇన్నింగ్స్‌: రోహిత్‌ శర్మ (సి) బెయిర్‌స్టో (బి) సందీప్‌ 6; డికాక్‌ (సి అండ్‌ బి) రషీద్‌ ఖాన్‌ 67; సూర్యకుమార్‌ (సి) నటరాజన్‌ (బి) కౌల్‌ 27; ఇషాన్‌ కిషన్‌ (సి) మనీశ్‌ (బి) సందీప్‌ 31; హార్దిక్‌ (బి) కౌల్‌ 28; పొలార్డ్‌ (నాటౌట్‌) 25; కృనాల్‌ (నాటౌట్‌) 20; ఎక్స్‌ట్రాలు 4; మొత్తం (20 ఓవర్లలో 5 వికెట్లకు) 208.

వికెట్ల పతనం: 1–6, 2–48, 3–126, 4–147, 5–188.

బౌలింగ్‌: సందీప్‌ 4–0–41–2, నటరాజన్‌ 4–0–29–0, సిద్ధార్థ్‌ కౌల్‌ 4–0–64–2, సమద్‌ 2–0–27–0, రషీద్‌ ఖాన్‌ 4–0–22–1, విలియమ్సన్‌ 2–0–24–0.

సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ ఇన్నింగ్స్‌: వార్నర్‌ (సి) ఇషాన్‌ (బి) ప్యాటిన్సన్‌ 60; బెయిర్‌స్టో (సి) హార్దిక్‌ (బి) బౌల్ట్‌ 25; మనీశ్‌ (సి) పొలార్డ్‌ (బి) ప్యాటిన్సన్‌ 30; విలియమ్సన్‌ (సి) డికాక్‌ (బి) బౌల్ట్‌ 3; ప్రియమ్‌ గార్గ్‌ (సి) రాహుల్‌ చహర్‌ (బి) కృనాల్‌ 8; అభిషేక్‌ శర్మ (బి) బుమ్రా 10; సమద్‌ (సి) రోహిత్‌ (బి) బుమ్రా 20; రషీద్‌ ఖాన్‌ (నాటౌట్‌) 3; సందీప్‌ శర్మ (నాటౌట్‌) 0; ఎక్స్‌ట్రాలు 15; మొత్తం (20 ఓవర్లలో 7 వికెట్లకు) 174.

వికెట్ల పతనం: 1–34, 2–94, 3–116, 4–130, 5–142, 6–168, 7–172.

బౌలింగ్‌: బౌల్ట్‌ 4–0–28–2, ప్యాటిన్సన్‌ 4–0–29–2, కృనాల్‌ పాండ్యా 4–0–35–1, బుమ్రా 4–0–41–2, పొలార్డ్‌ 3–0–20–0, రాహుల్‌ చహర్‌ 1–0–16–0.