IPL Auction 2025 Live

RCB vs KKR IPL 2021: వరుసగా మూడో విజయాన్ని నమోదు చేసిన కోహ్లీ సేన, 38 పరుగులతో కోల్‌కతాను చిత్తు చేసిన రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు, మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ అవార్డు దక్కించుకున్న డివిల్లీర్స్‌

ఆదివారం జరిగిన మ్యాచ్‌లో 38 పరుగులతో కోల్‌కతాను (RCB vs KKR IPL 2021) చిత్తుచేసింది. మొదట బ్యాటింగ్‌ చేసిన ఆర్‌సీబీ 20 ఓవర్లలో 204/4తో భారీ స్కోరు సాధించింది.

Glenn Maxwell, AB de Villiers (Photo Credits; Twitter/IPL)

ఐపీఎల్‌ టైటిల్‌ సాధించాలని పట్టుదలగా ఉన్న కోహ్లీసేన వరుసగా మూడో విజయాన్ని (Royal Challengers Bangalore Beat Kolkata Knight Riders By 38 Runs) నమోదు చేసింది. ఆదివారం జరిగిన మ్యాచ్‌లో 38 పరుగులతో కోల్‌కతాను (RCB vs KKR IPL 2021) చిత్తుచేసింది. మొదట బ్యాటింగ్‌ చేసిన ఆర్‌సీబీ 20 ఓవర్లలో 204/4తో భారీ స్కోరు సాధించింది. మ్యాక్స్‌వెల్‌ (49 బంతుల్లో 9 ఫోర్లు, 3 సిక్సర్లతో 78), డివిల్లీర్స్‌ (34 బంతుల్లో 9 ఫోర్లు, 3 సిక్సర్లతో 76 నాటౌట్‌) మెరుపు హాఫ్‌ సెంచరీలు చేశారు.

స్పిన్నర్‌ వరుణ్‌ చక్రవర్తి రెండు వికెట్లు తీశాడు. అనంతరం కోల్‌కతా 20 ఓవర్లలో 166/8 స్కోరుకే పరిమితమై ఓడింది. ఆండ్రీ రస్సెల్‌ (20 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సర్లతో 31) టాప్‌ స్కోరర్‌. కెప్టెన్‌ మోర్గాన్‌ (29), షకీబల్‌ (26) మోస్తరుగా ఆడారు. జేమిసన్‌ మూడు, హర్షల్‌, చాహల్‌ రెండేసి వికెట్లు పడగొట్టారు. డివిల్లీర్స్‌ మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ అవార్డు దక్కించుకున్నాడు.

తొలుత బ్యాటింగ్‌ చేసిన రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు 20 ఓవర్లలో 4 వికెట్లకు 204 పరుగులు చేసింది. 205 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కోల్‌కతా నైట్‌రైడర్స్‌ 20 ఓవర్లలో 8 వికెట్లకు 166 పరుగులు చేసి ఓడిపోయింది. బెంగళూరు ఇన్నింగ్స్‌లో మ్యాక్స్‌వెల్‌, డివిల్లీర్స్‌ ఆటే హైలైట్‌. కోహ్లీ (5), పటీదార్‌ (1) వికెట్లను చేజార్చుకొని 9/2తో ఆర్‌సీబీ ఇబ్బందుల్లో పడింది. కానీ పడిక్కళ్‌ (25)తో కలిసి మూడో వికెట్‌కు 86 రన్స్‌ జోడించిన మ్యాక్స్‌వెల్‌ ఇన్నింగ్స్‌ చక్కదిద్దాడు. ఈక్రమంలో ఫోర్లు, సిక్సర్లతో ఎదురు దాడికి దిగిన అతడు కేవలం 28 బంతుల్లోనే హాఫ్‌ సెంచరీ చేశాడు.

శిఖర్ ధావన్ దాడి.. పంజాబ్‌పై దిల్లీ గెలుపు, హ్యాట్రిక్ విజయాలతో తగ్గేదేలే అంటున్న కోహ్లీ సేన, ఈరోజు చెన్నై మరియు రాజస్థాన్ మధ్య ఆసక్తికర మ్యాచ్

దేవదత్‌ అవుటయ్యాక మ్యాక్స్‌వెల్‌కు డివిల్లీర్స్‌ జత కలవడంతో ఆర్‌సీబీ ఇన్నింగ్స్‌ మారింది. కోల్‌కతా బౌలర్లను ఆటాడుకున్న వీరు ఫోర్లు, సిక్సర్లతో స్కోరుబోర్డును పరిగెత్తించారు. మ్యాక్స్‌వెల్‌ ఇన్నింగ్స్‌కు కమిన్స్‌ ముగింపు పలికినా..కోల్‌కతాకు మాత్రం ఉపశమనం కలగలేదు. అనంతరం డివిల్లీర్స్‌ నైట్‌రైడర్స్‌ బౌలర్లను చీల్చిచెండాడడంతో బెంగళూరు స్కోరు 200 పరుగులు దాటింది. ఏబీ విధ్వంసంతో చివరి 3 ఓవర్లలో బెంగళూరు 56 రన్స్‌ రాబట్టింది.

భారీ లక్ష్య ఛేదనలో కోల్‌కతాను బెంగళూరు బౌలర్లు పూర్తిగా కట్టడి చేశారు. మరోవైపు క్రమం తప్పకుండా వికెట్లు కోల్పోయిన నైట్‌రైడర్స్‌ ఏ దశలోనూ కోలుకోలేదు. కెప్టెన్‌ మోర్గాన్‌, షకీబల్‌ ఆదుకొనే ప్రయత్నం చేశారు. అనంతరం రస్సెల్‌ ధాటిగా ఆడినా అతడికి అండగా నిలిచేవారు కరువయ్యారు.

స్కోరు బోర్డు బెంగళూరు: కోహ్లీ (సి) త్రిపాఠి (బి) వరుణ్‌ 5, పడిక్కళ్‌ (సి) త్రిపాఠి (బి) ప్రసిద్ధ్‌ 25, పటీదార్‌ (బి) వరుణ్‌ 1, మ్యాక్స్‌వెల్‌ (సి) హర్భజన్‌ (బి) కమిన్స్‌ 78, డివిల్లీర్స్‌ (నాటౌట్‌) 76, జేమిసన్‌ (నాటౌట్‌) 11, ఎక్స్‌ట్రాలు 8, మొత్తం: 20 ఓవర్లలో 204/4; వికెట్లపతనం: 1/6, 2/9, 3/95, 4/148; బౌలింగ్‌: హర్భజన్‌ 4-0-38-0, వరుణ్‌ చక్రవర్తి 4-0-39-2, షకీబల్‌ 2-0-24-0, కమిన్స్‌ 4-0-34-1, ప్రసిద్ధ్‌ 4-0-31-1, రస్సెల్‌ 2-0-38-0.

కోల్‌కతా: నితీశ్‌ (సి) పడిక్కళ్‌ (బి) చాహల్‌ 18, గిల్‌ (సి) సబ్‌ క్రిస్టియన్‌ (బి) జేమిసన్‌ 21, త్రిపాఠి (సి) సిరాజ్‌ (బి) సుందర్‌ 25, మోర్గాన్‌ (సి) కోహ్లీ (బి) హర్షల్‌ 29, దినేశ్‌ కార్తీక్‌ (ఎల్బీ) చాహల్‌ 2, షకీబల్‌ (బి) జేమిసన్‌ 26, రస్సెల్‌ (బి) హర్షల్‌ 31, కమిన్స్‌ (సి) డివిల్లీర్స్‌ (బి) జేమిసన్‌ 6, హర్భజన్‌ (నాటౌట్‌) 2, వరుణ్‌ (నాటౌట్‌) 2, ఎక్స్‌ట్రాలు 4, మొత్తం: 20 ఓవర్లలో 166/8; వికెట్లపతనం : 1/23, 2/57, 3/66, 4/74, 5/114, 6/155, 7/161, 8/162; బౌలింగ్‌: సిరాజ్‌ 3-0-17-0, జేమిసన్‌ 3-0-41-3, చాహల్‌ 4-0-34-2, సుందర్‌ 4-0-33-1, మ్యాక్స్‌వెల్‌ 2-0-24-0, హర్షల్‌ పటేల్‌ 4-0-17-0.