RCB vs RR Highlights IPL 2020: రాజస్తాన్ రాయల్స్‌పై కోహ్లీ సేన ఘన విజయం, చాన్నాళ్ల తరువాత ఆకట్టుకునే ఇన్నింగ్స్ ఆడిన కోహ్లీ, ముచ్చటగా మూడో విజయాన్ని నమోదు చేసిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు
శనివారం రాజస్తాన్ రాయల్స్‌తో (Rajasthan Royals) మ్యాచ్‌లో కోహ్లి సేన 8 వికెట్లతో గెలుపొందింది. టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన రాజస్తాన్ రాయల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 154 పరుగులు చేసింది.
ఐపీఎల్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సీబీ) లీగ్‌లో మూడో విజయాన్ని సాధించి సత్తా (RCB vs RR Highlights IPL 2020) చాటింది. శనివారం రాజస్తాన్ రాయల్స్‌తో (Rajasthan Royals) మ్యాచ్‌లో కోహ్లి సేన 8 వికెట్లతో గెలుపొందింది. టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన రాజస్తాన్ రాయల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 154 పరుగులు చేసింది. రాజస్థాన్ రాయల్స్ లో మహిపాల్ లామ్రోర్ (39 బంతుల్లో 47; 1 ఫోర్, 3 సిక్స్‌లు)తో ఆకట్టుకున్నాడు. బట్లర్ (12 బంతుల్లో 22; 3 ఫోర్లు, 1 సిక్స్), రాహుల్ తేవటియా (12 బంతుల్లో 24; 3 సిక్సర్లు) దూకుడు కనబరిచారు.
బెంగళూరు బౌలర్లలో ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ యజువేంద్ర చహల్ 3 వికెట్లు దక్కించుకున్నాడు. తర్వాత బెంగళూరు (Royal Challengers Bangalore) 19.1 ఓవర్లలో 2 వికెట్లకు 158 పరుగులు చేసి విజయాన్ని అందుకుంది. దేవ్‌దత్ పడిక్కల్ (45 ఓవర్లలో 63; 6 ఫోర్లు, 1 సిక్స్) లీగ్‌లో మూడో అర్ధసెంచరీ నమోదు చేయగా... కెప్టెన్ కోహ్లి (Virat Kohli) (53 బంతుల్లో 72 నాటౌట్; 7 ఫోర్లు, 2 సిక్సర్లు) మునుపటి ఫామ్‌ను అందుకున్నాడు.
155 పరుగుల లక్ష్య చేధనతో బరిలోకి దిగిన బెంగుళూరు ఓపెనర్ ఫించ్ (8) తొందరగానే అవుటైనా... రెండో ఓవర్‌లోనే సిక్స్, ఫోర్ బాదిన దేవ్‌దత్ 15 పరుగులు రాబట్టాడు. మూడో ఓవర్‌లో ఫించ్ ఔటయ్యాక క్రీజులోకి వచ్చిన కోహ్లి కుదురుకునేందుకు ప్రయత్నిస్తుండగా... దేవ్‌దత్ జోరు పెంచాడు. దీంతో పవర్‌ప్లేలో బెంగళూరు 50/1తో నిలిచింది. ఈ క్రమంలో ఉనాద్కట్ బౌలింగ్‌లో ఫోర్‌తో దేవ్‌దత్ 34 బంతుల్లో అర్ధసెంచరీ సాధించాడు. ఈ దశలో కోహ్లి జోరందుకోవడంతో అతను దూకుడు తగ్గించాడు. 16వ ఓవర్‌లో ఆర్చర్ బౌలింగ్‌లో మరో ఫోర్ బాది అదే ఓవర్‌లో దేవ్‌దత్ ఔటయ్యాడు. అప్పటికి ఆర్‌సీబీ విజయ సమీకరణం 24 బంతుల్లో 31 కాగా... డివిలియర్స్ (12 నాటౌట్)తో కలిసి కోహ్లి లాంఛనాన్ని పూర్తి చేశాడు.
స్కోరు వివరాలు
రాజస్తాన్ రాయల్స్ ఇన్నింగ్స్: బట్లర్ (సి) దేవ్‌దత్ (బి) సైనీ 22; స్మిత్ (బి) ఉదాన 5; సంజు సామ్సన్ (సి అండ్ బి) చహల్ 4; ఉతప్ప (సి) ఉదాన (బి) చహల్ 17; లామ్రోర్ (సి) దేవ్‌దత్ (బి) చహల్ 47; రియాన్ పరాగ్ (సి) ఫించ్ (బి) ఉదాన 16; తేవటియా (నాటౌట్) 24; ఆర్చర్ (నాటౌట్) 16; ఎక్స్‌ట్రాలు 3; మొత్తం (20 ఓవర్లలో 6 వికెట్లకు) 154.
వికెట్ల పతనం: 1–27, 2–31, 3–31, 4–70, 5–105, 6–114.
బౌలింగ్: ఉదాన 4–0–41–2, సుందర్ 4–0–20–0, సైనీ 4–1–37–1, చహల్ 4–0–24–3, జంపా 3–0–27–0, శివమ్ దూబే 1–0–4–0.
రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఇన్నింగ్స్: దేవ్‌దత్ పడిక్కల్ (బి) ఆర్చర్ 63; ఫించ్ (ఎల్బీడబ్ల్యూ) (బి) గోపాల్ 8; కోహ్లి (నాటౌట్) 72; డివిలియర్స్ (నాటౌట్) 12; ఎక్స్‌ట్రాలు 3; మొత్తం (19.1 ఓవర్లలో 2 వికెట్లకు) 158.
వికెట్ల పతనం: 1–25, 2–124.
బౌలింగ్: ఆర్చర్ 4–0–18–1, ఉనాద్కట్ 3–0–31–0, గోపాల్ 4–0–27–1, టామ్ కరన్ 3.1–0–40–0, తేవటియా 4–0–28–0, పరాగ్ 1–0–13–0.